pizza
Prematho Mee Karthik press meet
`ప్రేమతో మీ కార్తీక్` సాంగ్ రిలీజ్
You are at idlebrain.com > News > Functions
Follow Us

1 October 2017
Hyderaba
d

ర‌మ‌ణ శ్రీ గుమ్మ‌కొండ‌, గీతా మ‌న్నం స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మ‌ణ శ్రీ ఆర్ట్స్ బేన‌ర్‌పై కార్తీకేయ‌, సిమ్ర‌త్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం `ప్రేమ‌తో మీ కార్తీక్`. రిషి ద‌ర్శ‌క‌త్వంలో ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌కొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సాంగ్ రిలీజ్ కార్య‌క్ర‌మాన్ని ఆదివారం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్యక్ర‌మానికి దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

దిల్‌రాజు మాట్లాడుతూ - ``సాంగ్ చూస్తుంటే సాంగ్ చిత్రీక‌రించిన విధానం, సాహిత్యం అంతా బావుంది. మంచి ప్రేమ‌క‌థాచిత్ర‌మిద‌ని తెలుస్తుంది. సినిమా ఇలాగే అంద‌రినీ మెప్పించేలా ఉండాల‌ని కోరుకుంటూ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ - `నిర్మాత ర‌వీంద‌ర్‌గారు నాకు యు.ఎస్‌లో బాగా ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తి. ఆయ‌న అన్న త‌న‌యుడితో చేసిన సినిమా ఇది. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు రిషి మాట్లాడుతూ - ``మేం సినిమాను జ‌న‌తాగ్యారేజ్ సెట్‌లో చిత్రీక‌రించాం. అడ‌గ్గానే ఆ సెట్‌ను న‌వీన్‌గారు మాకు ఇచ్చారు. ఆయ‌న‌కు థాంక్స్‌. సినిమా బాగా తీశాన‌నే అనుకుంటున్నాను. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది. సినిమా క్లీన్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌`` అన్నారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ - ``మా సినిమా సాంగ్‌ను విడుద‌ల చేసిన దిల్‌రాజుగారికి థాంక్స్‌. మంచి సినిమా చేశామ‌ని అనుకుంటున్నాను. నిర్మాత‌గారు మా బాబాయ్‌. నా కోసం సినిమా చేశారు. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ - ``మా అన్న‌య్య త‌న‌యుడు కార్తీక్ , పూణే ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ట్ర‌యినింగ్ తీసుకుని ఒక‌ట్రెండు షార్ట్ మూవీస్‌లో న‌టించాడు. మా కార్తీక్‌కు సెకండ్ హీరో, చిన్న క్యారెక్ట‌ర్స్ ఇస్తామ‌ని అవ‌కాశాలు వ‌చ్చాయి. అయితే అందుకు నేను ఒప్పుకోకుండా నేనే నిర్మాత‌గా మారి ఈ సినిమా చేశాను. ద‌ర్శ‌కుడు రిషితో మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌మని అన్నాను. రిషి మంచి క‌థ‌తో నా వ‌ద్ద‌కు వ‌చ్చాడు. క‌థ న‌చ్చ‌డంతో ఈ సినిమా చేశాం`` అన్నారు.

కార్తికేయ‌,సిమ్ర‌త్‌, గొల్ల‌పూడి మారుతీరావు, సుమిత్ర‌, ముర‌ళీశ‌ర్మ‌, పృథ్వీ, ప్ర‌గ‌తి, ఝాన్సీ, దువ్వాసి, కారుమంచి ర‌ఘు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సాహిత్యంః శ్రీమ‌ణి, ఎడిట‌ర్ః మ‌ధు, ఆర్ట్ః హ‌రివ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః సాయిప్ర‌కాష్ ఉమ్మ‌డిసింగు, సంగీతంః షాన్ రెహ‌మాన్, లైన్ ప్రొడ్యూస‌ర్ః అశోక్‌రెడ్డి గుమ్మ‌డికొండ‌, నిర్మాతః ర‌వీంద‌ర్ ఆర్‌.గుమ్మ‌డికొండ‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః రిషి.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved