రిచాపనై, బాహుబలి ప్రభాకర్, పృథ్వీ, సప్తగిరి, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన తారాగణంగా సుఖీభవ మూవీస్ బ్యానర్‌పై వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఎ.గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం `రక్షకభటుడు`. శనివారం ఈ సినిమా బ్యానర్‌లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. బ్యానర్‌లోగోను ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు విడుదల చేస్తే, మోషన్ పోస్టర్‌ను దిల్‌రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా....
ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ - ``కొత్త నిర్మాణ సంస్థకు, దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల, నిర్మాత గురురాజ్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ - ``సుఖీభవ మూవీస్ బ్యానర్ ద్వారా టాలీవుడ్‌లోకి నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్న గురురాజ్‌కు, రక్ష, జక్కన్న వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన వంశీకృష్ణ ఆకెళ్లగారికి అభినందనలు. రక్షకభటుడు అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. స్టార్ హీరోస్ లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులతో సినిమా చేసే ప్రయత్నం పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ - ``నేను, దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్లగారు చాలా కాలంగా మంచి మిత్రులమే. నేను రియల్ ఎస్టేట్ రంగం నుండి సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడానికి వంశీకృష్ణగారు కారణం. ఆయన జక్కన్న టైమ్‌లో నన్ను కలవమని అన్నారు. నేను కలిసినప్పుడు ఆయన చెప్పిన పాయింట్ బాగా నచ్చింది. అందుకే నిర్మాతగా మారాను. క్యారెక్టర్ ఆర్టిస్టులతో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అనగానే నేను సినిమాను ప్రొడ్యూస్ చేయాలనుకన్నాను. ఈ నెలలో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసి వచ్చే నెలలో జరగనున్న రెండో షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణను పూర్తి చేస్తాం. భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను`` అన్నారు.
దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల మాట్లాడుతూ - ``సినిమాలను నేను చిన్న, పెద్ద అని ఆలోచించను. నేను గతంలో చేసిన రక్ష, జక్కన్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇప్పుడు చేస్తున్న రక్షకభటుడు ఈ రెండు సినిమాలను మించేలా రూపొందిస్తాను. కొత్త కాన్సెప్ట్‌తో క్యారెక్టర్ ఆర్టిస్టులతో సినిమాను చేస్తున్నాను. ఇప్పటికే 30 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. సినిమా వ్యవథి ఒక గంట యాబై నిమిషాలైతే అందులో చివరి పదిహేను నిమిషాలు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటే మిగతాదంతా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. మొత్తం మీద ఈ సినిమా ఒక ఎంటర్‌టైనింగ్‌గా సాగే సస్పెన్స్ థ్రిల్లర్. ఫిభ్రవరి నెలాఖరున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం`` అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఎల్.గ్రూప్ ఛైర్మన్ నాగేశ్వరరెడ్డి, సినిమాటోగ్రాఫర్ జోషి తదితరులు పాల్గొన్నారు.
రిచాపనై, బాహుబలి ప్రభాకర్, పృథ్వీ, సప్తగిరి, బ్రహ్మాజీ, ధనరాజ్, అదుర్స్ రఘు, నందు, చిత్రం శ్రీను, గురురాజ్, గౌతంరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో ప్రత్యేకపాత్రలో ఓ స్పెషల్‌స్టార్ నటించనున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః మల్హర్ భట్ జోషి, ఆర్ట్ః రాజీవ్‌నాయర్, ఎడిటింగ్ః అమర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః జె.శ్రీనివాసరాజు, ప్రొడ్యూసర్ః ఎ.గురురాజ్, రచన, దర్శకత్వంః వంశీకృష్ణ ఆకెళ్ల.