pizza
Saptagiri Express release on 23 December
డిసెంబ‌ర్ 23న `స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌`
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 December 2016
Hyderaba
d

సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి బ్యానర్‌పై సప్తగిరి, రోషిణి ప్రకాష్‌ హీరో హీరోయిన్లుగా అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో డా.కె.రవికిరణ్‌ నిర్మాతగా రూపొందిన చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌`. డిసెంబ‌ర్ 23న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం సినిమా వీడియో సాంగ్స్‌ను హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ప్ర‌ద‌ర్శించారు. అనంత‌రం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో....

చిత్ర నిర్మాత డా.కె.ర‌వికిర‌ణ్ మాట్లాడుతూ - ``స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ డిసెంబ‌ర్ 23న విడుద‌లవుతుంది. మేమే ఓన్ రిలీజ్ చేస్తున్నాం. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైనర్ మూవీగా ఉంటుంది. కామెడి చేయ‌డం స‌ప్త‌గిరిగారికి క‌ష్ట‌మేమీ కాదు. అయితే ఈ ఎంట‌ర్‌టైన్మెంట్‌తో పాటు ఈ సినిమాలో తండ్రి కొడుకుల మ‌ధ్య రిలేష‌న్‌. ఎమోష‌న‌ల్ కంటెంట్ ఉండే సినిమా. అలాగే పురాణ గెట‌ప్‌ల‌తో కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. ఒక సాధార‌ణ కానిస్టేబుల్ జీవితం ఎలా సాగుతుంది. వారికి ఎలాంటి స‌మ‌స్య‌లు ఉంటాయి. ఆ స‌మ‌స్య‌ల‌ను వారెలా ఫేస్ చేస్తార‌నే విష‌యాల‌ను కూడా ఇందులో చూపించాం. సినిమాను లావిష్‌గా తెర‌కెక్కించాం. అంద‌రికీ న‌చ్చే చిత్ర‌మ‌వుతుంది`` అన్నారు.

Glam gallery from the event

ద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వార్ మాట్లాడుతూ - ``క‌థే మెయిన్ హీరోగా సినిమా ఉంటుంది. కామెడి ఎంత ఉంటుందో ఎమోష‌న్ కూడా అంతే ఉంటుంది. ఎంత న‌వ్వుకుంటారో, అంతే ఎమోష‌న్ ఫీల్ అవుతారు. పాట‌ల‌ను విదేశాల్లో చిత్రీక‌రించాం. ఇప్ప‌టి వ‌ర‌కు చూపించ‌ని లోకేష‌న్స్‌లో పాట‌ల చిత్రీక‌ర‌ణ చేశాం. ప్రేక్ష‌కుడు పెట్టిన ప్ర‌తి రూపాయికి న్యాయం జ‌రుగుతుంద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాం`` అన్నారు.

రోహిణి ప్ర‌కాష్ మాట్లాడుతూ - ``మంచి టీంతో వ‌ర్క్ చేశాను. స‌ప్త‌గిరి, అరుణ్ ప‌వార్‌, ర‌వికిర‌ణ్‌గారితో వ‌ర్క్ చేయ‌డం హ్యాపీగా అనిపించింది`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved