నారా రోహిత్ హీరోగా నటించిన `శంకర` అక్టోబర్ 21న విడుదల కానుంది. రెజీనా నాయికగా నటించారు. తాతినేని సత్య ప్రకాశ్ దర్శకత్వం వహించారు. శ్రీ లీలా మూవీస్ పతాకంపై రూపొందింది. జె.ఆర్.మీడియా ప్రై.లిమిటెడ్‌తో కలిసి ఆర్.వి.చంద్రమౌళి ప్రసాద్ (కిన్ను) నిర్మించారు. ఎం.వి.రావు సమర్పించారు. తమిళంలో చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్న `మౌనగురు` చిత్రానికి రీమేక్ ఇది. అక్టోబర్ 21న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
చిత్ర సమర్పకుడు ఎం.వి.రావు మాట్లాడుతూ - ``అక్టోబర్ 21న విడుదలవుతున్న శంకర చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. నారా రోహిత్ అవుట్‌స్టాండింగ్ పెర్‌ఫార్మెన్స్‌తో పాటు సాయికార్తీక్ సంగీతం హైలైట్ అవుతుంది`` అన్నారు.
నిర్మాత ఆర్.వి. చంద్రమౌళి ప్రసాద్ (కిన్ను) మాట్లాడుతూ - ``వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు శంకర అనే కుర్రాడికి నచ్చవు. వాటిని ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న అడ్డంకులు ఎలాంటివి? దానికి అతని తల్లి, సోదరుడు ఇచ్చిన చేయూత ఎలాంటిది వంటి ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రం మా `శంకర`. సాయికార్తిక్ మంచి సంగీతాన్నిచ్చారు. ట్యూన్లకు చక్కటి స్పందన వస్తోంది.అలాగే అద్భుతమైన రీరికార్డింగ్ చేశారు. నారా రోహిత్‌గారి పెర్‌ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. సినిమా అక్టోబర్ 21న విడుదలవుతుంది. మెచ్చూర్డ్ నటనను ప్రదర్శించాడు. దర్శకుడు తాతినేని సత్య భీమిలి కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ చిత్రాలతో తనెంటటో ప్రూవ్ చేసుకున్నాడు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే చిత్రమమవుతుంది`` అని అన్నారు.
తాతినేని సత్యప్రకాష్ మాట్లాడుతూ - ``సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అక్టోబర్ 21న విడుదలవుతుంది. సాయికార్తీక్ తన మ్యూజిక్, రీ రికార్డింగ్‌తో నెక్ట్స్‌లెవల్‌కు తీసుకెళ్లాడు. భీమిలి కబడ్డీ జట్టు ఎలా ఆడిందో అలాగే ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ సాధిస్తుందని నమ్మకంగా ఉన్నాం`` అన్నారు.
సంగీత దర్శకుడు సాయికార్తీక్ మాట్లాడుతూ - ఫుల్ లెంగ్త్ కమర్షియల్ మూవీ. చక్కటి ఫైట్స్, సాంగ్స్‌తో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంది. యూత్ సహా అన్నిసెంటర్స్‌లో బాగా ఆదరణ పొందుతుంది`` అన్నారు.
హీరో నారా రోహిత్ మాట్లాడుతూ - ``శంకర సినిమాను గతవారం చూశాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఈసినిమాలో నేను ఫస్ట్‌టైం స్టూడెంట్ క్యారెక్టర్ చేశాను. నా గత సినిమాల్లాగానే ఈ సినిమాను కూడా బాగా ఆదరిస్తారని నమ్ముతున్నాం. షూటింగ్ పరంగా ఎక్కడా డిలే కాలేదు. వేరే కారణాలతో డిలే అవుతూ వచ్చినా చివరకు అక్టోబర్ 21న విడుదలవుతుంది. దర్శక నిర్మాతల కోసం సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
జాన్ విజయ్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్ రెడ్డి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు.