pizza
Shivalinga press meet
అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రాఘ‌వేంద్ర‌లారెన్స్ హీరోగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 November 2016
Hyderaba
d

Raghava Lawrence's 'Shivalinga' event held in Hyderabad

Raghava Lawrence and Ritika Singh are going to be seen together in a Telugu-Tamil film, 'Shivalinga', directed by P Vasu. The shooting of the same is all done but for one song. Produced by Abhishek Films in Telugu, this is a remake of a Kannada movie by same name, which ran for 100 days in 75 theaters. At a press meet held today in Hyderabad, the unit members spoke to the media:

P Vasu said, "'Aaptha Mitra', which was a big Kannada hit, was remade into Tamil and dubbed into Telugu as 'Chandramukhi'. Once again, a similar thing is happening after many years. Raghava Lawrence has acted in a more gutsy way than he did in 'Kanchana' and 'Kanchana-2'. Vadivelu and my son Shakthi Vasu are playing important roles in this movie."

Ravichandran, the producer of the Tamil version, said, "'Shivalinga' was a sensational hit in Kannada. We are confident that this film will be a bigger hit in Telugu and Tamil."

Producer Ramesh P Pillai said, "I hope this film in the combination of Lawrence and P Vasu will be a big hit."

Shakti Vasu said, "I played a key role in the Kannada version of this movie. I was received well by the audience. I have done some movies in Kannada and Tamil. This is my first one in Telugu. I am doing a key role once again."

Cinematographer Sarvesh Murari said, "Since they loved my work for 'Motta Shiva Ketta Shiva' (Kannada remake of 'Pataas'), they roped me in as this movie's cinematographer. 'Shivalinga' will be a bigger hit than 'Chandramukhi'."

Ritika Singh said, "I thank the producer for giving me the opportunity to work with talented people like P Vasu garu, Lawrence, Thaman and Sarvesh Murari."

SS Thaman says, "'Kanchana' and 'Kanchana-2' in our combination were a big hit. So will be 'Shiva Linga'. All the six songs have come out very well."

Raghava Lawrence said, "'Kanchana' was a big hit. 'Ganga' was an even bigger hit. When I was thinking that I should do a bigger hit than 'Ganga', Vasu garu asked me to watch 'Shivalinga'. I liked it a lot. I agreed to acting in the movie. The story is the first hero of 'Shivalinga'. Ritika Singh is the second hero. Shakthi Vasu is the third and I am the fourth hero. Ritika will get the kind of good name that Jyothika got after 'Chandramukhi'. I was thrilled on watching her performance in the interval block. As for Vasu garu, I am happy to have acted under the direction of someone who directed my favourite hero Rajinikanth."

Radha Ravi, Jayaprakash, Pradeep Rawat and others are part of the cast. Cinematography is by Sarvesh Murari. Music is by Thaman. Lyrics are by Ramajogayya Sastry. Art direction is by Durairaj. Stunts are by Anal Arasu and Dinesh. Editing is by Suresh.

The audio will be out in the first week of Dec. The film will hit the screens in January next.

Ritika Singh gallery from the event

అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రాఘ‌వేంద్ర లారెన్స్‌, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో ర‌మేష్ పి.పిళ్లై నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన పాత్రికేయుల సమావేశంలో మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. క‌న్న‌డ‌లో విజ‌య‌వంత‌మైన శివ‌లింగ చిత్రాన్ని పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళంలో రూపొందిస్తున్నారు. ఈ సమావేశంలో...

ద‌ర్శ‌కుడు పి.వాసు మాట్లాడుతూ - ``ప‌దేళ్ల క్రితం క‌న్న‌డ‌లో ఆప్త‌మిత్ర సినిమా తీశాను. అది పెద్ద హిట్ కావ‌డంతో దాన్నే చంద్ర‌ముఖి అనే పేరుతో ర‌జ‌నీకాంత్‌, జ్యోతిక‌ల‌తో తెర‌కెక్కించాను. చంద్ర‌ముఖి కూడా పెద్ద హిట్ అయ్యింది. అలాగే క‌న్న‌డ‌లో నేను చేసిన శివ‌లింగ సినిమా పెద్ద హిట్ సాధించింది. 75 సెంట‌ర్స్‌లో 100రోజులు ఆడింది. ఈ సినిమా వ‌డివేలుగారు న‌టిస్తున్నారు. అలాగే మా అబ్బాయి శ‌క్తివాసు ఈ చిత్రంలో కీల‌కపాత్ర‌లో న‌టించాడు. త‌మిళంలో ర‌విచంద్ర‌న్‌గారు సినిమాను నిర్మిస్తే తెలుగులో ర‌మేష్‌గారు సినిమా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాంచ‌న‌, కాంచ‌న‌2ల‌కు రాఘ‌వేంద్ర లారెన్స్ ఎంత రిస్కు తీసుకుని న‌టించాడో అంత కంటే ఎక్కువ రిస్కు తీసుకుని ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. ఓ సాంగ్ మిన‌హా సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. తెలుగు, త‌మిళంలో ఏక కాలంలో సినిమాను షూటింగ్ చేశాం`` అన్నారు.

ర‌విచంద్ర‌న్ మాట్లాడుతూ - ``క‌న్న‌డ‌లో శివ‌లింగ సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. ఇప్పుడు తెలుగు, త‌మిళంలో వాసుగారి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా క‌న్న‌డం కంటే పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

నిర్మాత ర‌మేష్ పి.పిళ్లై మాట్లాడుతూ - ``వాసుగారు, లారెన్స్‌గారి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ మాట్లాడుతూ - ``నేను, లారెన్స్‌గారు చేసిన కాంచ‌న‌, కాంచ‌న‌2 సినిమాలు పెద్ద విజ‌యాలు సాధించాయి. ఇప్పుడు మా కాంబినేష‌న్‌లో శివలింగ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా జ‌న‌వ‌రిలో విడుద‌ల కానుంది. వాసుగారి వంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కుడితో క‌లిసి వ‌ర్క్‌చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమాలో ఆరు పాటలున్నాయి. అన్నీ సాంగ్స్ బాగా వ‌చ్చాయి. స‌ర్వేష్ మురారిగారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. నిన్న హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఒక సాంగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. న‌వంబ‌ర్ 25 నుండి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ చేస్తాం. డిసెంబ‌ర్‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేస్తాం. జ‌న‌వ‌రిలో సినిమా రిలీజ్ ఉంటుంది. డిసెంబ‌ర్ మొద‌టి వారంలో ఆడియో విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.

శ‌క్తివాసు మాట్లాడుతూ - ``నేను త‌మిళం, క‌న్న‌డంలో సినిమాలు చేశాను. క‌న్న‌డ శివ‌లింగ‌లో నేను చేసిన కీ రోల్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు తెలుగు, త‌మిళంలో రూపొందుతోన్న రీమేక్‌లో ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాను. ఇదే తెలుగులో నేను చేస్తున్న తొలి సినిమా. సినిమాను పూర్త‌య్యింది. ఒక సాంగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. అంద‌రూ సినిమాను త‌ప్ప‌కుండా ఆద‌రించాలని కోరుకుంటున్నాను``అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ స‌ర్వేష్ మురారి మాట్లాడుతూ - ``త‌మిళంలో ప‌టాస్ రీమేక్ మొట్ట‌శివ కెట్ట శివ చిత్రానికి నేనే సినిమాటోగ్ర‌ఫీ అందించాను. నా వ‌ర్క్ న‌చ్చ‌డంతో ఈ సినిమా చేయ‌డానికి అవ‌కాశం వ‌చ్చింది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. చంద్ర‌ముఖి కంటే పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.

రితిక సింగ్ మాట్లాడుతూ - ``వాసుగారు, లారెన్స్, స‌ర్వేష్ మురారి, థ‌మ‌న్ వంటి మంచి టెక్నిక‌ల్ టీంతో క‌లిసి చేసే అవ‌కాశం వ‌చ్చింది. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

రాఘ‌వేంద్ర లారెన్స్ మాట్లాడుతూ - ``కాంచ‌న పెద్ద హిట్ అయ్యింది. కాంచ‌న కంటే గంగ ఇంకా పెద్ద హిట్ అయ్యింది. గంగ కంటే పెద్ద హిట్ మూవీ చేయాల‌ని ఎదురుచూస్తున్న స‌మ‌యంలో వాసుగారు శివ‌లింగ సినిమా చూడ‌మ‌న్నారు. చూడ‌గానే న‌చ్చింది. సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకున్నాను. ఈ సినిమాకు క‌థే మొద‌టి హీరో. రితిక సింగ్ రెండో హీరోయిన్, శ‌క్తివాసు మూడో అయితే నేను నాలుగో హీరోఅవుతానంతే. సినిమా అంత మంచి క‌థ‌తో రూపొందింది. చంద్ర‌ముఖి సినిమాలో రితిక‌సింగ్‌కు ఎంత మంచి పేరు వ‌చ్చిందో రితిక‌కు అంత మంచి పేరు వ‌స్తుంది. రితిక ఇంట‌ర్వెల్ బ్లాక్‌లో చేసిన న‌ట‌న చూసి థ్రిల్ అయ్యాను. ఇక దర్శ‌కుడు వాసుగారు గురించి చెప్పాలంటే నా ఫేవ‌రేట్ హీరో ర‌జ‌నీకాంత్‌ను డైరెక్ట్ చేసిన వాసుగారి దర్శ‌క‌త్వంలో న‌టించ‌డం ఆనందంగా ఉంది. సినిమాకు ప్రేక్ష‌కుల ఆశీస్సులు ఉండాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర‌యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

రాఘ‌వ‌లారెన్స్‌, రితిక సింగ్‌, వ‌డివేలు, శ‌క్తివాసు, రాధార‌వి, జ‌య‌ప్ర‌కాష్‌, ప్ర‌దీప్ రావ‌త్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః స‌ర్వేష్ మురారి. మ్యూజిక్ః ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌, సాహిత్యంః రామ‌జోగ‌య్య శాస్త్రి, ఆర్ట్ః దురైరాజ్‌, ఫైట్స్ః అన‌ల్ అర‌సు, దినేష్‌, ఎడిటింగ్ః సురేష్‌, నిర్మాతః ర‌మేష్‌.పి.పిళ్లై, ద‌ర్శ‌క‌త్వంః పి.వాసు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved