pizza
Singam 3 release on 26 January
జ‌న‌వ‌రి 26న విడుద‌ల‌వుతున్న `సింగం3`
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 January 2017
Hyderaba
d

తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం ఎస్-3 (`సింగం-3`). సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. జనవరి 26న సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో....

మ‌ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ - ``సూర్య హీరోగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సింగం, సింగం2 సినిమాలు ఎంత పెద్ద స‌క్సెస్‌ను సాధించాయో తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబోలో వ‌స్తున్న సీక్వెల్ `సింగం 3`. హ‌రిగారు సినిమాను ఎంత స్పీడ్‌గా తెర‌కెక్కిస్తారో తెలిసిందే. ఇంత‌కు ముందు వ‌చ్చిన సింగం సీక్వెల్‌కు ధీటుగా భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో సినిమా ఉంటుంది. ఈ సినిమా టీజ‌ర్‌ను ప‌ది మిలియ‌న్ మంది వ్యూవ‌ర్స్ వీక్షించ‌డంతో సినిమాపై ఎంత‌టి అంచ‌నాలున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ మూడో పార్ట్‌లో సూర్య ప‌వ‌ర్‌ఫుల్ న‌ట‌న సినిమాకు పెద్ద ఎసెట్ అయితే అనుష్క‌, శృతిహాస‌న్ గ్లామ‌ర్ ఆడియెన్స్‌ను అల‌రిస్తాయి. సింగం 3 సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో జ‌న‌వ‌రి 26న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved