pizza
Singam 3 press meet
పోలీసుల కోసం `సింగం3` స్పెష‌ల్ షోస్ వేస్తున్నాం - మ‌ల్కాపురం శివ‌కుమార్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 February 2017
Hyderaba
d

తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న హీరో సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రం `ఎస్-3 `(`సింగం-3`). హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాను తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మించగా, సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

అనూప్ సింగ్ మాట్లాడుతూ - ``నేను ముంబైకి చెందినవాడిని. నాన్న‌, అమ్మ‌లు ఇద్ద‌రు ముంబై హైకోర్టులో లాయ‌ర్స్‌. నేను సినిమా ఇండ‌స్ట్రీలోకి రాక ముందు పైలైట్‌గా వ‌ర్క్ చేశాను. 2010లో సినిమాల్లోకి వ‌చ్చాను. స్టార్‌ప్ల‌స్‌లో వ‌చ్చే మ‌హాభార‌తంలో ధృత‌రాష్ట్రుడిగా న‌టించాను. మిస్ట‌ర్ ఇండియా, మిస్ట‌ర్ ఏషియా పోటీల్లో కూడా పాల్గొన్నాను. మిస్ట‌ర్ వ‌రల్డ్ పోటీల్లో విజేత‌గా నిలిచిన మొద‌టి భార‌తీయుడుని నేనే. త‌ర్వాత డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌గారు రోగ్ సినిమాలో మెయిన్ విల‌న్ కోసం న‌న్ను సెల‌క్ట్ చేసుకున్నారు. త‌ర్వాత సింగం3లో న‌టించే అవ‌కాశం క‌లిగింది. రోగ్‌లో ముందు న‌టించిన సింగం3తో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాను. సినిమా పెద్ద హిట్ కావ‌డం నాకెంతో క‌లిసొచ్చింది. సింగం3 కోసం త‌మిళం నేర్చుకున్నాను. ప్ర‌తిరోజు ఐదు గంట‌ల పాటు చ‌దివి ప్రాక్టీస్ చేసేవాడిని. విఠ‌ల్ ప్ర‌సాద్‌గా నేను చేసిన పాత్ర‌కు మంచి అప్రిసియేష‌న్ వ‌చ్చింది. సూర్య‌గారు మంచి కోస్టార్‌. నాకు సెట్స్‌లో బాగా స‌పోర్ట్ చేశారు. తెలుగు ప్రేక్ష‌కులు నన్ను రిసీవ్ చేసుకున్న తీరు బావుంది. నెక్ట్స్ మూవీ విన్న‌ర్ కూడా ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల‌వుతుంది. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాలో హార్స్ రైడ‌ర్ క్యారెక్ట‌ర్ చేశాను. అలాగే కమెండో 2 సినిమాలో కూడా న‌టించాను`` అన్నారు.

మ‌ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ - ``సింగం3 విడుద‌లై ప‌దిరోజుల‌వుతుంది. సూప‌ర్‌స్పీడ్ స‌క్సెస్‌తో సినిమా సాగుతుంది. స‌క్సెస్ గురించి రోడ్ షో కూడా ప్లాన్ చేస్తున్నాం. వాటి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం. సినిమా ఇదేవిధంగా ఇంకా ముందు కెళ్తుంద‌ని ఆశిస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐపియ‌స్ ఆఫీస‌ర్స్, వారి కుటుంబ స‌భ్యుల‌కు సింగం3 స్పెష‌ల్ షోస్‌ను వేస్తున్నాం. అందుకు ప‌ర్మిష‌న్ తీసుకున్నాం. ప్ర‌తి పోలీస్ కుటుంబం చూడాల్సిన సినిమా`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved