pizza
Spider-Man: Homecoming release on 7 July
హైదరాబాద్ లో సందడి చేసిన స్పైడీ.... జూలై 7న "స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్" గ్రాండ్ రిలీజ్
You are at idlebrain.com > News > Functions
Follow Us

28 June 2017
Hyderabad

స్పైడర్ మ్యాన్ అంటే తెలియని సినీ ప్రేమికుడు ఉండడు. ముఖ్యంగా చిన్న‌పిల్ల‌ల‌కి హీరో అంటే స్పైడ‌ర్‌మ్యాన్ మాత్ర‌మే గుర్తుంటాడు. మెరుపు వేగంతో దూసుకుపోతూ, చాలా సింపుల్ గా పవర్ ఫుల్ విలన్స్ ఆట కట్టించే ఈ సూపర్ హీరోకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. స్పైడర్ మ్యాన్ సిరీస్ నుంచి సినిమా వచ్చిన ప్రతిసారీ వరల్డ్ మూవీ లవర్స్ గ్రూప్ లో ఓ పండగ వాతవరణం నెలకొటోంది. ఇండియాలో కూడా స్పైడీకి కోట్ల కొద్దీ ఫ్యాన్స్ ఉన్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాలీ భాషల్లో స్పైడర్ మ్యాన్ సినిమాలు అనువాదం అయ్యి ఘ‌న‌విజ‌యాలు సాధిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే స్పైడర్ మ్యాన్ సిరీస్ లో మరో కొత్త సినిమా తెరకెక్కింది. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా స్పైడీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా జులై 7నే విడుదల కాబోతుంది.

ఈ చిత్ర ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో స్పైడీ సందడి చేశాడు. హైదరాబాద్ లో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో ఉత్సాహంగా... స్పైడీతో ఫొటోలు, సెల్ఫీలు దిగి సందడి చేశారు. స్పైడీ చేసిన స్టంట్లు, విన్యాసాలు... ఆశ్యర్యపరిచాయి. స్పైడీతో ఫోజులు పెట్టి మరీ ఫొటోలు దిగడం విశేషం. చిన్న పిల్లల దగ్గరి నుంచి అన్ని వయసుల వారు స్పైడీతో ఫొటోలు దిగి స్పైడర్ మ్యాన్ అంటే తమకు ఎంతిష్టమో చాటి చెప్పారు. దేవనార్ బ్లైండ్ స్కూల్లో జరిగిన మరో క్యార్యక్రమంలో స్పైడీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. తమకు స్పైడర్ మ్యాన్ అంటే ఎంతో ఇష్టమని... అతనితో కలిసి ఆడుకోవడం చాలా హ్యాపీగా ఉందని దేవనార్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని పలు న్యూస్ ఛానెల్స్ ఆఫీసుల్లోనూ... స్పైడీ సందడి చేయడం విశేషం. ఆయా సంస్థల ప్రతినిధులు, జర్నలిస్టులు స్పైడీతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. స్పైడర్ మ్యాన్ ను స్క్రీన్ మీద చూడటమే కానీ... ఇలా ప్రత్యక్షంగా చూస్తామనుకోలేదని పలువురు చెప్పడం విశేషం.

ఇక ఇప్పటికే విడుదలైన స్పైడర్ మ్యాన్ ట్రైలర్ కు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. మార్వెల్ కామిక్స్, కొలంబియా పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

జూలై 7న ఈ సినిమా ని తెలుగు రాష్ట్రాల్లో డైరెక్టు తెలుగు సినిమాలానే భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సోనీ సంస్థ ప్రతినిథులు ప్రకటించారు. అలానే ఈ సినిమాలో స్పైడర్ మ్యాన్ చేసే విన్యాసాలుతో పాటు ఐరన్ మ్యాన్ చేసే యాక్షన్ స్టంట్లు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని సోనీ వారు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో స్పైడర్ మ్యాన్ పాత్రలో కొత్త హీరో థామస్ స్టాన్లే హాలాండ్ నటిస్తున్నాడు, ప్రతినాయకునిగా అకాడమీ అవార్డ్ విన్నర్, బర్డ్ మ్యాన్ ఫేమ్ మిచెల్ కీటన్ నటిస్తున్నాడు, అలానే ఈ సినిమాకి సరికొత్త క్రేజ్ తీసుకొచ్చిన ఐరన్ మ్యాన్ పాత్రలో రాబర్డ్ డౌనీ జూనీయర్ నటిస్తున్నట్లుగా సోనీ సభ్యులు తెలిపారు.

 


 
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved