14 November 2016
Hyderabad
`గౌతమిపుత్ర శాతకర్ణి` చిత్రంలో చాలా ధర్మనందుడు అనే క్యారెక్టర్‌లో నటించాను. చాలా సీరియస్‌గా సాగే పాత్ర, అలాగే ప్రస్తుతం ఆర్.నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రంలో ఫుల్ లెంగ్త్ విలన్‌గా నటిస్తున్నానని తెలియజేశాడు సునీల్ కుమార్. తాను టాలీవుడ్‌లో మంచి నటుడుగా రాణించాలనుకుంటున్న సునీల్‌కుమార్ తన సినీ ప్రయాణం గురించిన విశేషాలను తెలియజేశాడు. సునీల్ కుమార్ మాట్లాడుతూ - ``నేను మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జ్ఞయినిలో పుట్టి పెరిగాను. నా చదువులో ఎక్కువ భాగంలో అక్కడే కొనసాగింది. మా నాన్నకు హోటల్ బిజినెస్ ఉంది. అయితే నటుడుగా రాణించాలనే కోరిక నాలో బలంగా ఏర్పడింది. అందులో భాగంగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుండేవాడిని. ఫోటోలు తీసుకుని చాలా సినిమా ఆఫీసులకు వెళుతూ వస్తుండేవాడిని. అలా ఓసారి టాలీవుడ్ సీనియర్ దర్శకుడు బాపుగారు నా ఫోటోలను చూసి ఆయన చేస్తున్న భాగవతంలో నన్నురాముడు, కృష్ణుడు పాత్రల కోసం ఎంపిక చేశారు. తర్వాత రాధాగోపాలం, సుందరకాండ సినిమాల్లో కూడా నటించాను. తర్వాత యాక్సిడెంట్ కారణంగా సినిమాల్లో నటించలేకపోయాను. అందుకే మధ్యలో సినిమాలకు గ్యాప్ వచ్చింది.
`కంచె` సినిమా చూసిన తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేయాలనే కోరిక పుట్టింది. వెంటనే ఆయన్ను కలిశాను. ఆయన నన్ను చూసి ధర్మనందుడు క్యారెక్టర్ గురించి చెప్పారు. హెయిర్ స్టయిల్ మార్చుకోవాలి..చేస్తావా అన్నారు. నేను సరేనన్నాను. అలా నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో నటించే అవకాశం కలిగింది. బాలకృష్ణగారు చాలా గొప్ప నటుడు. ఎంత పెద్ద స్టార్ నటుడైనా తోటి నటులకు చాలా గౌరవం ఇస్తారు. నన్నెంతో అప్యాయంగా పలకరించారు. మధ్య ప్రదేశ్‌లో మహేశ్వరంలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన నా గురించి, నా కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలకృష్ణ వంటి గొప్ప నటుడితో కలిసి నటించడం మరచిపోలేని అనుభూతి.
ఆర్.నారాయణమూర్తిగారితో చదలవాడ శ్రీనివాసరావుగారు చేస్తున్న `హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య` చిత్రంలో పూర్తిస్థాయి విలన్‌గా కనపడతాను. నేను సినిమాలతో పాటు అమితాబ్ బచ్చన్‌తో కల్యాణ్ జ్యూవెలర్స్ యాడ్ కూడా నటించాను. అలాగే రాణి హమ్ హోగే తుమ్హారే అనే బాలీవుడ్ సినిమాలో కూడా నటించాను. ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. చదలవాడ శ్రీనివాసరావుగారు సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. నన్ను బాగా చేస్తున్నానని ఎంకరేజ్ చేస్తున్నారు. నటుడుగా టాలీవుడ్ పరిశ్రమలో కొనసాగాలనుకుంటున్నాను. గౌతమిపుత్ర శాతకర్ణి, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాలు నటుడుగా నాకు మంచి బ్రేక్ తెచ్చిపెడతాయి. ఇలాగే తెలుగు ప్రేక్షకులను మెప్పించే పాత్రలెన్నింటినో చేయాలనే ఆసక్తితో ఉన్నాను`` అన్నారు.