pizza
TSR Lalitha Kala Parishath Awards press meet
టి.ఎస్‌.ఆర్ లలిత‌క‌ళా ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో జ‌మున‌కు న‌వ‌ర‌స న‌ట క‌ళావాణి అవార్డ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

4 September 2017
Hyderaba
d

టి.సుబ్బరామిరెడ్డి ల‌లిత క‌ళా ప‌రిషత్ వారి ఆధ్వ‌ర్యంలో టి.సుబ్బ‌రామిరెడ్డి పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్ 16, 17 తేదీల్లో వైజాగ్‌లో ప‌లు కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. సెప్టెంబ‌ర్ 17న సినీ రంగానికి ఆర‌వైయేళ్లుగా సేవ‌లు అందించిన సీనియ‌ర్ న‌టి జ‌మున‌కు న‌వ‌ర‌స న‌ట క‌ళావాహిని అవార్డును అంద‌జేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా...

టి.సుబ్బ‌రామిరెడ్డి మాట్లాడుతూ - ``నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 16న అన్ని మ‌తాల‌కు చెందిన ప‌లువురు మ‌త గురువులకు స‌న్మాన కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. ఈ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ న‌టీన‌టులు బి.స‌రోజాదేవి, కాంచ‌న‌, వాణిశ్రీ, శార‌ద‌, జ‌య‌ప్ర‌ద‌, శ్రీదేవి, మోహ‌న్‌బాబు, బ్ర‌హ్మానందం, బోనీక‌పూర్, రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌ త‌దిత‌రులు పాల్గొన‌నున్నారు. గ‌తంలో ఎంతో మంది సినీ ప్ర‌ముఖులకు మా క‌ళాప‌రిష‌త్‌లో స‌న్మానం చేశాం. ఈ ఏడాది జ‌మున‌గారిని న‌వ‌ర‌స న‌ట క‌ళావాహిని అవార్డుతో స‌త్క‌రించ‌నున్నాం. 1978లో జ‌మున‌గారికి సిల్వ‌ర్ జూబ్లీ ఫంక్ష‌న్‌ను నేనే ఏర్పాటు చేశా. ఇప్పుడు ఈ డైమండ్ జూబ్లీ ఫంక్ష‌న్‌ను కూడా నేనే నిర్వ‌హిస్తున్నాను`` అన్నారు.

సీనియ‌ర్ న‌టి జ‌మున మాట్లాడుతూ - ``1978లో నాకు సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ను నిజాం గ్రౌండ్స్‌లో ఘ‌నంగా నిర్వ‌హించిన సుబ్బ‌రామిరెడ్డిగారే ఇప్పుడు నన్ను అవార్డుతో స‌త్క‌రిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వ‌య‌సులో నేను పెద్ద‌దాన్ని అయినా ఆయ‌న‌కు పాదాభి వందనం చేయ‌డం త‌ప్ప మేరేమం చేయ‌లేను. (అంటూ జ‌మున టి.సుబ్బ‌రామిరెడ్డికి పాదాభివంద‌నం చేశారు)`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, వ‌సంత త‌దిత‌రులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved