'దృశ్యం' వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత శ్రీప్రియ దర్శకత్వంలో వస్తోన్న మరో అద్భుత దృశ్య కావ్యం 'ఘటన'. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో క్రిష్ జె. సత్తార్ హీరోగా మలయాళంలో సూపర్‌హిట్ అయిన '22 ఫిమేల్ కొట్టాయం' చిత్రాన్ని సన్‌మూన్ క్రియేషన్స్ పతాకంపై శ్రీప్రియ దర్శకత్వంలో వి.ఆర్. కృష్ణ ఎం. 'ఘటన' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్య్రకమంలో శ్రీప్రియ, రాజ్‌కందుకూరి, నిర్మాత వి.ఆర్.కృష్ణ.యం పాల్గొన్నారు. ఈ సందర్బంగా...
శ్రీప్రియ మాట్లాడుతూ - ''దృశ్యం చిత్రాన్ని తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్‌హాసన్‌గారు చేశారు. వారి అద్భుతమైన నటనను ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. సినిమా పెద్ద హిట్ అయ్యింది. దృశ్యం తర్వాత నేను తెలుగులో చేస్తున్న సినిమా 'ఘటన'. ఆడదంటే ఆటబొమ్మ కాదు.., ఏదైనా చేయగల ఆది పరాశక్తి అని తెలియజేసే చిత్రమిది. సినిమా కమర్షియల్‌గా ఉంటుంది. చిన్న సినిమాలను బాగా ఆదరిస్తేనే ఇండస్ట్రీ బావుంటుంది. సినిమాలో మెయిన్‌రోల్‌లో నటించిన నిత్యామీనన్ అద్భుతమైన నటి. సమాజంలో జరిగే విషయాలను ఈ సినిమాలో ఒక పర్సనల్ వ్యక్తికి జరిగినప్పుడు, ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడనేదే ఈ సినిమా'' అన్నారు.
రాజ్‌ందుకూరి మాట్లాడుతూ - ''సినిమా డిఫరెంట్ సబ్జెక్ట్‌తో తెరకెక్కింది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్. నర్సు ఉద్యోగాల కోసం వేరే దేశాలకు వెళ్ళే అమ్మాయిలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు. అనే విషయాన్ని ఒక వ్యక్తి ఆధారంగా చేసుకుని శ్రీప్రియగారు తెరకెక్కించారు. ఇలాంటి మహిళా సబ్జెక్ట్‌ను డీల్ చేయడానికి మహిళా దర్శకురాలే కరెక్ట్. శ్రీప్రియగారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు'' అన్నారు.
నిర్మాత వి.ఆర్.కృష్ణ.యం మాట్లాడుతూ - ''మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేశాం. అక్టోబర్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
నిత్యామీనన్, క్రిష్ జె. సత్తార్, నరేష్, కోట శ్రీనివాసరావు, కోవై సరళ, విద్యుల్లేఖ రామన్, అంజలీరావు, జానకి, గౌతమి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: మనోజ్ పిళ్ళై, ఎడిటింగ్: బవన్ శ్రీకుమార్, సంగీతం: అరవింద్ శంకర్, ఆర్ట్: ప్రేమ్‌నవాస్, పాటలు: అనంత శ్రీరామ్, కాస్ట్యూమ్ డిజైనర్: అను పార్థసారథి, సమర్పణ: బేబి సంస్కృతి ఎం, బేబీ అక్షర ఎం, నిర్మాత: వి.ఆర్. కృష్ణ ఎం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీప్రియ.