ఆశిష్‌రాజ్, రుక్సార్ మీర్ హీరో హీరోయిన్లుగా వి.కె.ఎ.ఫిలింస్ బ్యానర్‌పై రామ్‌భీమన దర్శకత్వంలో విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మాతలుగా రూపొందిన చిత్రం `ఆకతాయి`. ఈ సినిమా మార్చి 10న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో....
రుక్సార్ మీర్ మాట్లాడుతూ - ``సినిమాను యూనిట్ అంతా కష్టపడి మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మలిచారు. సినిమాను ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కల నిజమైనట్లు ఉంది. అనగా అనే అమ్మాయిగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ - ``కథ వినగానే మేం ఏ నమ్మకంతో అయితే సినిమాను చేశామో ఆ నమ్మకం ఈరోజు నిజమైంది. సినిమా చూసిన అందరూ బావుందని అప్రిసియేట్ చేస్తున్నారు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకు థాంక్స్`` అన్నారు.
హీరో ఆశిష్ రాజ్ మాట్లాడుతూ - ``నేను రియల్ లైఫ్‌లో ఆకతాయిగా ఉండను. కానీ సినిమాలో విక్రాంత్ పాత్రలో చాలా ఆకతాయిగా కనపడ్డాను. ఈరోజు నా పుట్టినరోజు, దీన్ని నాకు మరచిపోలేని రోజుగా గుర్తుండిపోయేలా చేసిన దర్శకుడు రామ్‌భీమనగారికి, నిర్మాతలైన మావయ్యలకు థాంక్స్. సినిమా కోసం ఎంతో మంది కష్టపడ్డారు. బెస్ట్ టీంతో చేసిన ప్రయత్నం ఇది. మా కష్టాన్ని గుర్తించి ప్రేక్షకులు మాకు పెద్ద హిట్‌ను ఇచ్చారు.థియేటర్స్‌లో ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. భవిష్యత్‌లో ఇంకా మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను`` అన్నారు.
రాంకీ మాట్లాడుతూ - ``తెలుగులో సింధూరపువ్వు, ఒసేయ్..రాములమ్మ సహా చాలా సినిమాలు చేశాను. మధ్య గ్యాప్ తీసుకున్నాను. పెద్ద సినిమాతో, మంచి క్యారెక్టర్‌తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్న తరుణంలో ఈ సినిమా అవకాశం వచ్చింది. రామ్‌భీమనగారు ప్రతి క్యారెక్టర్‌ను ఎంతో ఇంప్రెసివ్‌గా చూపించారు. ఇలాంటి బ్యానర్‌లో రీ ఎంట్రీ కావడం గర్వంగా అనిపిస్తుంది. నిర్మాతలు ఎంత కష్టమైనా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను పూర్తి చేశారు. ఇలాంటి నిర్మాతలు మనకు ఎంతో అవసరం. వీరు మరెన్నో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను రామ్ భీమన పెద్ద డైరక్టర్‌గా ఎదుగుతాడు. అలాగే హీరో ఆశిష్‌రాజ్ మంచి హీరోగా పేరే తెచ్చుకుంటాడు`` అన్నారు.
రామ్ భీమన మాట్లాడుతూ - ``నేను సినిమా హిట్ అవుతుందని అనుకున్నాను. కానీ ఇంత పెద్ద హిట్‌ను ఉహించలేదు. థియేటర్స్‌లో అందరూ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మాతలు, హీరో ఆశిష్‌రాజ్, ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ సపోర్ట్‌తో సినిమాను అనకున్న సమయంలో పూర్తి చేయగలిగాను. మంచి సినిమాను తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది`` అన్నారు.