11 October 2016
Hyderabad
తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బి.ఎల్.ఎన్. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించారు. ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై తమిళ్‌లో ప్రభుదేవా నిర్మించారు. హిందీలో సోనూ సూద్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. దసరా రోజున హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్‌రక్షిత్, శేఖర్, జానీ, దినేష్ మాస్టర్లు కలిసి ప్రభుదేవాను సత్కరించారు. తమకు ప్రభుదేవా స్ఫూర్తిని పంచారని అన్నారు.
దర్శకుడు ఎ.ఎల్.విజయ్ మాట్లాడుతూ ``పండక్కి మంచి విజయం అందించారు. మూడు భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. మెయిన్ పిల్లర్ కోన వెంకట్ గారు చాలా బాగా చేశారు. ప్రభుగారి సపోర్ట్ మర్చిపోలేను`` అని అన్నారు.
హేమ మాట్లాడుతూ `` దర్శకుడు నన్ను చూసి అమ్మ పాత్రకి సూట్ కానని అనుకున్నారు. కానీ మూడు పాత్రల్లోనూ నన్ను తీసుకున్నారు. ప్రభుదేవాతో నేను వారసుడులో నటించాను. ఎప్పటికైనా ప్రభుదేవా కొరియోగ్రఫీలో డ్యాన్సులు చేయాలని కోరికగా ఉంది`` అని చెప్పారు.
సప్తగిరి మాట్లాడుతూ ``ప్రభుదేవా మంచి హ్యూమన్ బీయింగ్. చాలా బాగా చేశారు. ఆయనలాగా చేయాలని స్టెప్పులు కూడా వేశాను`` అని తెలిపారు.
కోన వెంకట్ మాట్లాడుతూ ``సినిమా హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది`` అని అన్నారు.
బి.ఎల్.ఎన్ ప్రొడక్షన్ ప్రతినిధి మాట్లాడుతూ ``ఈ సినిమాను చేయడం చాలా ఆనందంగా ఉంది. అవకాశాన్ని కల్పించిన వారికి ధన్యవాదాలు`` అని తెలిపారు.
ప్రభుదేవా మాట్లాడుతూ ``నేను ముంబైలో ఉంటే డైరక్టర్‌ని అవుతాను. చెన్నైలో ఉంటే హీరో అవుతాను. హైదరాబాద్‌లో ఉంటే డ్యాన్స్ మాస్టర్ అవుతాను. నాకు గౌరవమర్యాదలు, డబ్బు ఇచ్చింది తెలుగు పరిశ్రమ. ఇక్కడ కూడా చాలా మంది కొరియోగ్రాఫర్లు అద్భుతంగా చేస్తున్నారు. పండక్కి మంచి విజయం దక్కింది. చాలా ఆనందంగా ఉంది.
ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్, సప్తగిరి, మురళీశర్మ, హేమ, ప థ్వీ, షకలక శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, జి.వి.ప్రకాష్‌కుమార్, సినిమాటోగ్రఫీ: మనీష్ నందన్, ఎడిటింగ్: ఆంటోనీ, ఆర్ట్: వైష్ణరెడ్డి, సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్.