అంజలి టైటిల్ పాత్రలో తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం చిత్రాంగద. తమిళంలో యార్నీ పేరుతో నిర్మించి ఈ హరీజెంటల్ థ్రిల్లర్ చిత్రానికి పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా మార్చి 10న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో...
నిర్మాతలు గంగపట్నం శ్రీధర్, రెహమాన్ మాట్లాడుతూ - ``అశోక్‌గారు సినిమాను అద్భుతమైన కథనంతో నడిపించారు. ప్రేక్షకుడిని సినిమాలో లీనమైయ్యేటట్లు చేసిన గీతాంజలి నటన, అశోక్ టేకింగ్ అన్ని సినిమాను సక్సెస్ బాటలోకి నడిపాయి. మా ప్రయత్నాన్ని ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ``ఈరోజు సినిమా చాలా సక్సెస్ బాటలో నడుస్తుంది. విడుదలైన రోజు నుండి ప్రతి ఆట, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ముందుకు సాగుతుంది. సినిమా విడుదలై నాలుగు రోజులైన సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. రెండు కోట్ల అరవై లక్షలు వచ్చాయి. ఓవర్‌సీస్‌లో కూడా మంచి రిపోర్ట్ వచ్చింది. దర్శకుడు అశోక్‌గారు అంజలిని గ్లామర్‌గానే కాదు, మంచి పెర్‌ఫార్మర్‌గా చూపించాడు. అంజలిగారికి అభినందనలు. ఇంతటి విజయాన్ని సాధించిన ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
దర్శకుడు జి.అశోక్ మాట్లాడుతూ - ``కొత్త పాయింట్‌ను థ్రిల్లర్ ఎలిమెంట్‌కు జోడించి చేసిన సినిమా చిత్రాంగద. సాధారణంగా మనం పునర్జన్మ అనే పాయింట్‌ను నమ్ముతాం. ఒక మగవాడు చనిపోయి ఆడపిల్లగా పుడితే ఎలా ఉంటుందో చెప్పే చిత్రమిది. కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారనడానికి ఈ సినిమా సాక్ష్యం. నాకు అంజలి వెన్నెముకలా నిలబడి అద్భుతంగా నటించింది. యూత్ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. నాకు సపోర్ట్ చేసిన నటీనటులు, టెక్నిషియన్స్‌కు థాంక్స్`` అన్నారు.
అంజలి మాట్లాడుతూ - ``చిత్రాంగద ఆడియెన్స్‌కు బాగా నచ్చింది. అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అశోక్‌గారు చిత్రాంగద వంటి మంచి క్యారెక్టర్ ఇచ్చి మరోసారి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి కారణమైయ్యారు. అలాగే నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీతో సినిమా చేశారు. అలాగే శివకుమార్‌గారికి, సినిమా హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.