1 November 2016
Hyderabad
యంగ్ హీరో ధనుష్ మొదటి సారి ద్విపాత్రాభినయంతో ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధర్మయోగి'. విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి జగన్‌మోహిని సమర్పణలో సి.హెచ్.సతీష్‌కుమార్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. దీపావళి కానుకగా శనివారం విడుదలైన ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లోనూ సూపర్‌హిట్ టాక్‌తో ప్రదిర్శితమవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత సి.హెచ్.సతీష్‌కుమార్, నైజాంలో చిత్రాన్ని విడుదల చేసిన ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ పాల్గొన్నారు.
నిర్మాత సి.హెచ్.సతీష్‌కుమార్ మాట్లాడుతూ - ''ధనుష్ ఫస్ట్ టైమ్ డబుల్ రోల్‌లో నటించిన 'ధర్మయోగి' దీపావళి కానుకగా శనివారం విడుదలైంది. చాలా మంచి రెస్పాన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కలెక్షన్ల పరంగా మేం చాలా హ్యాపీగా వున్నాం. ఈ సినిమాకి వచ్చిన రివ్యూస్ కూడా చాలా పాజిటివ్‌గా వుండడం, మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవడంతో రోజురోజుకీ కలెక్షన్స్ బాగా పెరుగుతున్నాయి. ధనుష్‌గారు చేసిన రెండు క్యారెక్టర్లు రెండు వేరియేషన్స్‌తో చాలా డిఫరెంట్‌గా వున్నాయి. మాస్ క్యారెక్టర్‌కి, క్లాస్ క్యారెక్టర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని చూస్తున్నారు. రఘువరన్ బి.టెక్ తర్వాత ధనుష్‌గారికి తెలుగులో ఇది ది బెస్ట్ మూవీ అవుతుంది. ఈ సినిమాలో త్రిష చేసిన క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ వుంది. ఆ క్యారెక్టర్‌ని ఆమె అద్భుతంగా చేశారు. ఇంతకుముందు త్రిష చేసిన క్యారెక్టర్స్‌కి, ఈ క్యారెక్టర్‌కి చాలా వేరియేషన్ వుంది. అలాగే ఓ క్యూట్ క్యారెక్టర్ చేసిన అనుపమ పరమేశ్వరన్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. ఈమధ్యకాలంలో పూర్తిస్థాయి పొలిటికల్ మూవీస్ రాలేదనే చెప్పాలి. ధర్మయోగి చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందినప్పటికీ ఆడియన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌తో తీయడం జరిగింది. జిల్లా స్థాయిలో వుండే రాజకీయాల నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయాల వరకు ఎలా వుంటాయనేది ఈ సినిమాలో చక్కగా చూపించడం జరిగింది. ప్రతి కార్యకర్త తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ఆడియన్స్‌కి మంచి మెసేజ్ కూడా వుంది. సినిమాలోని డైలాగ్స్‌కి, ట్విస్ట్‌లకు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రామజోగయ్యశాస్త్రిగారు రాసిన పాటలు అందరూ పాడుకునే విధంగా వున్నాయి. సిట్యుయేషన్‌కి తగ్గట్టు చాలా మంచి పాటలు రాశారు. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా సినిమా వుందని, చాలా మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించారని అందరూ ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా వుంది. రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్ని థియేటర్స్‌లో మా సినిమా రన్ అవుతోందో దానికి 30 శాతం థియేటర్స్ పెరుగుతున్నాయి. సినిమా కావాలని ఎగ్జిబిటర్స్ అడుగుతున్నారు. అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా వున్నారు. ఇంత మంచి సక్సెస్ వచ్చినందుకు నేను కూడా చాలా హ్యాపీగా వున్నాను. ఈ సినిమాతో ధనుష్‌గారికి తెలుగులో మార్కెట్ ఓ మెట్టు పెరిగిందని చెప్పుకోవచ్చు. అన్ని ఏరియాల నుంచి మాకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం కలెక్షన్స్ మూడు రోజుల్లో 3 కోట్లు కలెక్ట్ చేసింది. థియేటర్స్ పెరుగుతున్న కారణంగా కలెక్షన్ పరంగా ఈ సినిమా చాలా పెద్ద రేంజ్‌కి వెళ్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ మల్లాపురం శివకుమార్ మాట్లాడుతూ - ''ఈ చిత్రాన్ని నైజాంలో నేను రిలీజ్ చెయ్యడం జరిగింది. తనకి చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఆఫర్స్ వున్నప్పటికీ మా ద్వారానే రిలీజ్ చెయ్యాలని సతీష్‌గారు అనుకున్నారు. నైజాంలో 92 థియేటర్లలో రిలీజ్ చేశాం. సినిమాకి మంచి రిపోర్ట్ రావడమే కాకుండా కలెక్షన్స్ పరంగా ఈ సినిమా చాలా పాజిటివల్‌గా ముందుకు వెళ్తోంది. సాధారణంగా ఒక డబ్బింగ్ సినిమాకి మొదటి వారం థియేటర్స్ దొరకని పరిస్థితి వుంటుంది. కానీ, ఈ సినిమాకి మంచి థియేటర్స్ దొరికాయి. అంతే కాకుండా అన్ని థియేటర్స్‌లో రెండో వారానికి వెళ్తోంది. మరో 18 థియేటర్లు కన్‌ఫర్మ్ అయ్యాయి. ఇవి కాక మరో 15 థియేటర్లు పెరిగే అవకాశం వుంది. సినిమా బాగుందన్న రిపోర్ట్ వస్తేనే ఎగ్జిబిటర్స్ ప్రదర్శించడం జరుగుతుంది. ఈ సినిమా రిపోర్ట్‌పరంగా, కలెక్షన్స్‌పరంగా పాజిటివ్‌గా వుంది కాబట్టి రెండో వారానికి థియేటర్స్ పెరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇది మూడు, నాలుగు వారాలు ఆడే సినిమా. సతీష్‌గారు ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ సినిమాని తీసుకున్నారో దానికి డబుల్ రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను. ధనుష్ చేసిన క్యారెక్టర్స్ అన్నీ నేచురల్‌గా వుంటాయి కాబట్టి ఆడియన్స్ అతని సినిమాలు చూడడానికి ఇష్టపడతారు. ౖ'ధర్మయోగి' కూడా అలాంటి నేచురాలిటీ వున్న సినిమాయే. కాబట్టి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇలాగే కలెక్షన్స్ బాగా పెరిగి మా సతీష్‌గారికి లాభాలతోపాటు మంచి పేరు కూడా తేవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఎస్.ఎ.చంద్రశేఖర్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: వెంకటేష్ ఎస్., ఎడిటింగ్: ప్రకాష్ మబ్బు, సంగీతం: సంతోష్ నారాయణన్, సమర్పణ: శ్రీమతి జగన్మోహిని, నిర్మాత: సి.హెచ్.సతీష్‌కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్.