మంచు మనోజ్, ప్రగ్యా జైశ్వాల్ హీరో హీరోయిన్లుగా క్లాప్స్ అండ్ విజిల్స్ బ్యానర్‌లో ఎస్.కె.సత్య దర్శకత్వంలో వరుణ్ నిర్మించిన చిత్రం 'గుంటూరోడు'. ఈ సినిమా మార్చి 3న విడుదలైంది. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్‌టూర్‌ను ఏర్పాటు చేసింది. ఈ వివరాలను తెలియజేయడానికి ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో...
శ్రీ వరుణ్ అట్లూరి మాట్లాడుతూ - ``మిర్చి సినిమాలో సంపత్‌గారి క్యారెక్టర్‌కు ఎంత మంచి పేరు వచ్చిందో అంతకంటే మంచి పేరు గుంటూరోడు సినిమాలోని క్యారెక్టర్‌కు వచ్చింది. దీనికి నంది అవార్డు, నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. బి, సి సెంటర్స్‌లో మంచి ఆదరణ లభిస్తుంది. మనోజ్, సంపత్ క్యారెక్టర్స్ ఢీ అంటే ఢీ అనేలా ఉన్నాయని అంటున్నారు. ఫైట్స్‌కు, డైలాగ్స్‌కు మంచి ఆదరణ ఉంది. నిన్నటి కంటే ఈరోజు కలెక్షన్స్ ఇంకా బావున్నాయి. సినిమాను ఇంత పెద్ద రేంజ్‌లో ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
ఎస్.కె.సత్య మాట్లాడుతూ - ``అన్నీ చోట్ల నుండి గుంటూరోడు సినిమా చాలా బావుందని అప్రిసియేట్ చేస్తున్నారు. మనోజ్‌గారు పెర్‌ఫార్మెన్స్, సంపత్ విలనిజం, రాజేంద్రప్రసాద్ సెంటిమెంట్, కామెడికి మంచి రెస్పాన్స్ వస్తుంది. హీరో ఇంట్రడక్షన్, లవ్ ట్రాక్, ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ సహా అన్నీ సన్నివేశాలకు అప్రిసియేషన్ బాగా వస్తుంది. అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించిన పరిపూర్ణమైన కమర్షియల్ మూవీ ఇది`` అన్నారు.
డిజె.వసంత్ మాట్లాడుతూ - ``మాస్ హిట్ కొట్టాం. ఈ మాస్ హిట్‌ను బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
సంపత్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి దర్శకుడు సత్య చెప్పగానే, నేను క్యారెక్టర్ కచ్చితంగా వర్కవుట్ అవుతుందని చెప్పాను. కానీ మేం ఉహించిన దానికంటే పెద్ద రెస్పాన్స్ వస్తుందనుకోలేదు. మనోజ్‌తో ఇలాంటి సినిమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. నిర్మాతలు ఎక్స్‌ట్రార్డినరీ ప్రొడ్యూసర్. ఇలాంటి నిర్మాతలకు ఇలాంటి విజయం రావడం ఆనందంగా ఉంది`` అన్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ - ``డైరెక్టర్ సత్య కథ చెప్పగానే ఇది మాస్ సినిమా అని తెలిసింది. అందుకనే ముందు నుండి ఇది మాస్ సినిమా అని చెప్పుకుంటూ వచ్చాం. మాస్ ఎలిమెంట్స్ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయని మేం ఏదైతే నమ్మకంతో సినిమా చేశామో, అది ఈరోజు నిజమైంది. ముఖ్యంగా ప్రతి ఏరియాలో ప్రేక్షకులు సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు. రేపటి నుండి సక్సెస్ టూర్‌ను ప్లాన్ చేస్తున్నాం. కరీంనగర్, కర్నూల్, వరంగల్, గుంటూరు, విజయవాడ సహా అన్నీ ప్రాంతాల్లో తిరిగి ప్రేక్షకులను కలుస్తాను`` అన్నారు.