pizza
Hyper Success meet
You are at idlebrain.com > News > Functions
Follow Us

1 October 2016
Hyderaba
d

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ సినిమా సెప్టెంబ‌ర్ 30న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం చిత్ర‌యూనిట్ స‌క్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో…

అనిల్ సుంక‌ర మాట్లాడుతూ - ``ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌లైన హైప‌ర్ చిత్రాన్ని నిజాయితీగా ఉండాల‌నుకునేవారికి, నిజాయితీగా ఉండేవారికి అంకితం చేస్తున్నాం. ఆడియెన్స్ నుండి సినిమా బావుంద‌ని అప్రిసియేష‌న్స్ వ‌స్తున్నాయి. సినిమాను అంద‌రూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస్‌లో ప‌దిరూపాయ‌లిస్తే ప‌నైపోతుంద‌ని అనుకునేవారికి ఈ సినిమా చూస్తే వారిలో ఇంపాక్ట్ క‌లుగుతుంది. క‌లెక్ష‌న్స్ ప‌రంగా చూస్తే రామ్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ డేలో హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి`` అన్నాయి.

అబ్బూరి ర‌వి మాట్లాడుతూ - ``సాధార‌ణంగా నాకు బొమ్మ‌రిల్లు త‌ర్వాత తండ్రి కొడుకుల మ‌ధ్య ఎమోష‌న్ బావుంద‌ని అంద‌రూ ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఒక వ్య‌క్తికి పెళ్లైన త‌ర్వాత బాధ్య‌త‌లు ఎక్క‌వై, సంపాదించుకున్న జీతం ముందుగానే అయిపోయినప్పుడు తండ్రి విలువ‌ల తెలుస్తుంది. అది ముందుగానే గ్ర‌హించి, తండ్రికి ఏ క‌ష్టం రాకుండా, నీడ‌లా ప‌క్క‌నే ఉంటూ, తండ్రిని కాపాడే కొడుకు క‌థే హైప‌ర్‌. చిన్న‌ప్ప‌ట్నుంచి, ఒక సిద్ధాంతం పెట్టుకుని, నిజాయితీగా బ్ర‌తికే తండ్రి క‌థే ఇది. తండ్రి నిజాయితీగా ఉండ‌టానికి స‌హ‌క‌రించే ఫ్యామిలీ క‌థ‌. ఇది క‌చ్చితంగా ఫ్యామిలీ సినిమా. భార్య కోసం భ‌ర్త ప‌డే త‌ప‌న‌, తండ్రి కోసం కొడుకు ప‌డే త‌ప‌నే ఈ సినిమా. ఈ ద‌స‌రాకు ఇంత కంటే మంచి ప్యామిలీ సినిమా ఉండ‌ద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

ప్ర‌భాస్ శ్రీను మాట్లాడుతూ - ``హైప‌ర్ అనే టైటిల్‌కు ద‌ర్శ‌కుడు సంతోష్ , హీరో రామ్ సరిగ్గా స‌రిపోతారు. సినిమా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సినిమాను స‌క్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్‌`` అన్నారు.

సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ - ``మొద‌టి ఆట పూర్తి కాగానే ప్రేక్ష‌కులే కాదు, చాలా మంది పాత్రికేయులు కూడా నాకు ఫోన్ చేసి సినిమా బావుంద‌ని అప్రిసియేట్ చేశారు. కందిరీగ కంటే నాకు ఎక్కువ సంతృప్తినిచ్చిన సినిమా ఇది. రామ్ వంటి మంచి పెర్‌ఫార్మ‌ర్‌తో ఈ ఇస‌నిమా చేయ‌డం ఆనందంగా ఉంది. రామ్, స‌త్య‌రాజ్‌, ముర‌ళీశ‌ర్మ‌, రావు ర‌మేష్‌లు న‌ట‌న ఇలాఉంటుంద‌ని ఉహించి థియేటర్‌కు వ‌చ్చే ప్రేక్ష‌కులు వారి న‌ట‌న‌ను చూసి 200 శాతం సంతృప్తి ప‌డుతున్నారు. సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తి ఒక టెక్నిషియ‌న్‌, ఆర్టిస్ట్ త‌మ‌దిగా భావించి చేయ‌డం వ‌ల్ల సినిమా ఇంత బాగా వ‌చ్చింది. 100 శాతం ఇదొక ఫ్యామిలీ మూవీ విత్ మెసేజ్‌. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌`` అన్నారు.

సూప‌ర్‌హిట్ పత్రికాధినేత బి.ఎ.రాజు మాట్లాడుతూ - `` జూన్ 3న ప్రారంభ‌మైన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల‌వుతుంద‌ని ప్రెస్‌నోట్ ఇచ్చాం. అయితే ఇంత పెద్ద సినిమాను మూడు నెల‌ల్లోఎలా కంప్లీట్ చేస్తారోన‌ని కొంద‌రు, వీలుకాద‌ని కొంద‌రు అనుకున్నారు. నేను కూడా సినిమా అనుకున్న స‌మయంలో విడుద‌ల కాదేమోన‌ని అనుకున్నాను. అయితే ఇంత పెద్ద సినిమాను నాలుగు నెలల్లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డం చాలా గొప్ప విష‌యం. కందిరీగ కంటే రామ్ హైప‌ర్ ఎన‌ర్జీతో వ‌ర్క్ చేశాడు. రామ్ ఈ సినిమాతో మ‌రో మూడు రెట్లు పైకెదిగాడు`` అన్నారు.

రామ్ ఆచంట మాట్లాడుతూ - ``ఫ‌స్ట్ సిట్టింగ్ నుండి ఒక జెన్యూన్ సినిమాను ఎలా చెబితే ప్రేక్ష‌కులు రీచ్ అవుతుంద‌నే విష‌యం మాకొక ఐడియా ఉంది. దాన్ని ఈరోజు 200 శాతం రీచ్ అయ్యామ‌ని సంతోషంగా ఉన్నాం. తండ్రి కొడుకుల మ‌ధ్య స‌న్నివేశాలు, ఇంట‌ర్వెల్ యాక్ష‌న్ బ్లాక్ స‌హా అన్నింటికి ప్రేక్ష‌కులు సూప‌ర్బ్‌గా రెస్పాన్స్ అవుతున్నారు. హైప‌ర్‌లాంటి సినిమాను మా బ్యాన‌ర్‌లో చేసినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాం`` అన్నారు.

హీరో రామ్ మాట్లాడుతూ - ``ముందు వాసు ఈ క‌థ‌ను ఐదు నిమిషాల లైన్‌గా చెప్పారు. విన‌గానే సంత‌కం కోసం ఇంత అవ‌స‌ర‌మంటావా.. అని నేను అన్నాను. లేదు నేను స్క్రిప్ట్ రెడీ చేసుకుని వ‌స్తాన‌ని, త‌ను పూర్తి స్క్రిప్ట్‌ను నెల‌రోజుల్లో త‌యారు చేసి నాకు వినిపించాడు. అప్పుడే గ‌వ‌ర్నమెంట్ ఆఫీస‌ర్ సంతం విలువ నాకు తెలిసింది. సెకండాఫ్‌లో తండ్రి కొడుకుల మ‌ధ్య ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు అద్భుతంగా పండాయి. ప్ర‌తి కుటుంబానికి, ప్ర‌తి తండ్రి కొడుక్కి క‌నెక్ట్ అయ్యే సినిమా`` అన్నారు.

ఈ కార్యక్ర‌మంలో సినిమాటోగ్రాఫ‌ర్ స‌మీర్‌రెడ్డి, గోపీచంద్ ఆచంట త‌దిత‌రులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved