నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా హీరో హీరోయిన్లుగా వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయికొర్రపాటి నిర్మించిన చిత్రం 'జ్యో అచ్యుతానంద'. అవసరాల శ్రీనివాస్ దర్శకుడు. ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలైంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో....
సినిమాటోగ్రాఫర్ వెంకట్ సి.దిలీప్ మాట్లాడుతూ - ''వారాహి బ్యానర్‌లో నేను వర్క్ చేసిన రెండో చిత్రమిది. కల్యాణ్‌రమణగారు అద్భుతమైన మ్యూజిక్‌తో పాటు అవసరాల శ్రీనివాస్‌గారి అద్భుతమైన టేకింగ్, నారారోహిత్, నాగశౌర్య, రెజీనాల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్'' అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణ్ రమణ మాట్లాడుతూ - ''రోహిత్, నాగశౌర్య, రెజీనాల నటనే సినిమా సక్సెస్‌లో ప్రధాన భూమికను పోషించింది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా తృప్తి కలిగింది. ఇద్దరన్నదమ్ముల మధ్య ఉన్న బాండింగ్ అందిరికీ బాగా కనెక్ట్ అవుతుంది. నేను, శ్రీనివాస్ అవసరాల కలిసి చేసిన రెండో సినిమా ఇది. మ్యూజిక్ విషయంలో శ్రీని ముందు నుండి చాలా కేర్ తీసుకున్నారడు. ముఖ్యంగా నేను కంపోస్ చేసిన ఒక లాలన పాట..నాకు చాలా బాగా నచ్చింది. ఆడియెన్స్ నుండి కూడా మంచి ఆదరణను రాబట్టుకుంది. సినిమా సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్'' అన్నారు.
Regina Cassandra Glam gallery from the event
శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ - ''ఊహలు గుసగుసలాడే' సినిమాకు ప్రేక్షకులు అందించిన ఆదరణను మరచిపోలేదు. అలాంటి రెస్పాన్స్‌నే ఆడియెన్స్ అందించారు. సినిమా విడుదలకు ముందు కథ రాసుకునేటప్పుడు ఒక మంచి కథ రాసుకున్నామని అనుకున్నాను. కానీ తీరా ఎడిటింగ్ టేబుల్‌పైకి వచ్చేసరికి నాలో డౌట్ మొదలైంది. సినిమా విడుదలకు ముందు ఒకట్రెండు నెలలు బాగా ఒత్తిడికి లోనయ్యాను. కానీ ఆడియెన్స్ ఇచ్చిన రెస్పాన్స్ చూసి చాలా తృప్తిగా ఫీలయ్యాను. రోహిత్, శౌర్య, రెజీనాలు ఎప్పుడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. అందరూ వారి శక్తికి మించి వర్క్ చేశారు. యు.ఎస్.లో ఈ స్థాయి సినిమాకి వస్తోన్న ఆదరణ చాలా బావుందని అంటున్నారు. ఇక్కడ కూడా ఫ్యాబులస్ రెస్పాన్స్ వస్తుంది. నాకు ఒక అన్నయ్య ఉండుంటే బావుండేది, నాకు ఒక తమ్ముడుంటే బావుండేదంటూ చాలా మంచి మెసేజ్‌లు పంపారు. సినిమా అంతలా అందరికీ కనెక్ట్ అయ్యింది. సినిమాను ఇంతటి పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్'' అన్నారు.
రెజీనా మాట్లాడుతూ - ''బిజీ షెడ్యూల్, ఫోన్ సిగ్నల్స్ అందని ప్రాంతంలో ఓ సినిమా షూటింగ్‌లో ఉండటం వల్ల జ్యో అచ్యుతానంద సినిమా ఎలా ఉందనే రిపోర్ట్ తెలియలేదు. నిన్ననే ఆడియెన్స్ మధ్య కూర్చొని సినిమా చూశాను. ఆడియెన్స్ ఎంజాయ్ చేయడం చూసి నాకు చాలా సంతోషం వేసింది. కల్యాణ్‌రమణగారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఆయనతో పాటు రోహిత్, శౌర్యల సపోర్ట్, ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ సపోర్ట్ కారణంగానే సినిమాను ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తున్నారు. ఈ సినిమాను నేను చేసిన జ్యోత్స్న రోల్ నా కెరీర్‌లో గుర్తుండిపోయే రోల్'' అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, ఎడిటర్ కిరణ్ గంటి పాల్గొన్నారు.