2 November 2016
Hyderabad
కార్తీ హీరోగా పి.వి.పి సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్స్‌పై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించిన చిత్రం 'కాష్మోరా'. నయనతారా, శ్రీదివ్య హీరోయిన్స్. ఈ సినిమా అక్టోబర్ 28న విడుదలైంది. ఈ సందర్భంగా బుధవారం చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో....
కార్తీ మాట్లాడుతూ - '''కాష్మోరా' సినిమా కోసం యూనిట్ అంతా పడ్డ కష్టం రెండున్నరేళ్లు. యుగానికొక్కడు తరహాలో ఎగ్జయిట్‌మెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న కాష్మోరా వంటి సినిమాను భారీ బడ్జెట్‌లో ఎలా చేస్తారా అని ముందు అనిపించింది. అయితే సినిమా సెట్స్‌లోకి వెళ్లడానికి ఒక సంవత్సరం ముందు నుండే ప్లానింగ్ చేశారు. భారీ సెట్స్, వార్ సీక్వెన్స్‌లు ఎలా చేయాలి అని ముందుగానే డిస్కస్ చేసుకున్నారు. ఒక మంచి అవుట్‌పుట్ కోసం గోకుల్ అండ్ టీం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. స్క్రిప్ట్ వినేటప్పుడు రాజ్‌నాయక్ తల లేకుండా యాక్ట్ చేసే సన్నివేశాలు గురించి చెప్పినప్పుడు స్క్రీన్‌పై ఎలా కనపడుతుందోనని ఎగ్జయిట్‌మెంట్‌గా అనిపించింది. స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు చాలా థ్రిల్ ఫీలయ్యాను. చిన్న పిల్లలు, ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తను వెడ్స్ మను పార్ట్ 2 చూస్తున్నప్పుడు కంగనా రనౌత్ క్యారెక్టర్ ట్రాన్స్‌పర్‌మేషన్ చూసి ఇలాంటి క్యారెక్టర్ మనం ఎప్పుడు చేయగలం అని భావించాను. కానీ గోకుల్ దర్శకత్వంలో కాష్మోరాలో నేను చేసిన రాజ్‌నాయక్ క్యారెక్టర్‌తో నా కోరిక తీరిపోయింది. రాజ్‌నాయక్ రోల్‌లో ప్రతి సీన్‌ను ఎంజాయ్ చేస్తూ చేశాను. ప్రేక్షకులు కూడా ఆ పాత్రను బాగా ఆదరిస్తున్నారు. నయనతార రాణి పాత్రలో చక్కగా యాక్ట్ చేసింది. శ్రీదివ్య మంచి పాత్రలో చేసింది. వివేక్ ఇప్పటి వరకు చేయని తండ్రి పాత్ర ఈ సినిమాలో చేయడం విశేషం. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్'' అన్నారు.
ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ - ''ఈ సినిమా విడుదలకు ముందు దీన్ని పండుగ సినిమా అని చెప్పాను. విడుదల తర్వాత అదే నిజమైంది. ఊపిరి తర్వాత కార్తీ, పివిపి సంస్థ కలయికలో వచ్చిన కాష్మోరా పెద్ద సక్సెస్ కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం అందరం రెండున్నరేళ్లుగా కష్టపడుతున్నాం. సినిమా చూసిన అందరూ బావుందని యూనిక్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇంటర్వెల్ బ్లాక్, కామెడి సీన్స్, ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్నింటినీ పిల్లలు, ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఎంజాయ్‌చేస్తున్నారు. మొదటివారంలో 15 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం'' అన్నారు.
గోకుల్ మాట్లాడుతూ - ''సినిమా సక్సెస్ అవుతుందని భావించాను. కానీ చిన్నపిల్లలు, ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను ఇంత బాగా ఆదరిస్తారని అనుకోలేదు. ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఆడియెన్స్‌కు థాంక్స్. ఈ సక్సెస్, ఇంకా మంచి సినిమాలు చేయాలనే బాధ్యతను పెంచింది. మూడు క్యారెక్టర్స్‌ను కార్తీ చాలా అద్భుతంగా పోషించారు. ఇంత మంచి నటుడుతో ఇంకా సినిమాలు చేయాలని భావిస్తున్నాను'' అన్నారు.