pizza
Khakee success meet
‘ఖాకి’ సక్సెస్ మీట్
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 November 2017
Hyderaba
d

కార్తి, రకుల్ జంటగా నటించిన చిత్రం ‘ఖాకి’. ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ సంస్థ సినిమాను తెలుగులో విడుదల చేసింది. నవంబర్ 17న సినిమా విడుద‌లైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో...

హీరో కార్తి మాట్లాడుతూ - ‘‘తెలుగు ప్రేక్షకులకు నేను ఆవారా కార్తి, ఊపిరి శ్రీనుగా గుర్తుండిపోయాను. కానీ ఖాకి చిత్రం నాకు స్పెషల్ గుర్తింపును తీసుకొచ్చింది. వినోద్‌గారి స్క్రీన్‌ప్లేను చూసి అందరూ అప్రిసియేట్ చేస్తున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ చూసి థ్రిల్ అయ్యారు. బీబ్రాన్ మ్యూజిక్, సత్య సినిమాటోగ్రఫీ సహా అన్ని డిపార్ట్‌మెంట్స్ ఎంతో కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో చాలా మందిలో పోలీసులపై మంచి అభిప్రాయం ఏర్పడింది. నా భార్య కూడా పోలీసులు మన కోసం ఎంతో కష్టపడుతున్నారంటూ కితాబిచ్చింది. మా సినిమాను పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి అంకితం ఇస్తున్నాం. నా గత చిత్రాలతో పోల్చితే తెలుగులో ఎక్కువ థియేుటర్స్‌లో విడుద‌లైన చిత్రమిది. పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా సినిమాను చూడబోతున్నారు. రకుల్ ఇప్పటి వరకు చేయునటువంటి డిఫరెంట్ పాత్రలో కనపడింది. ఇంటెలిజెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.

శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - ‘‘సినిమా రెండో వారంలోకి ఎంటర్ అయినప్పటికీ కలెక్షన్స్ స్టడీగా సాగుతున్నాయి. వినోద్‌గారి డైరెక్షన్, కార్తి, రకుల్ పెర్ఫావెున్స్‌లకి మంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమాను ఆదరించిన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు.

Glam gallery from the event

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ - ‘‘తెలుగు, తమిళంలో విడుదైలెన ‘ఖాకి’ చిత్రాన్ని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. కొత్త కథలను ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు’’ అన్నారు.

నిర్మాత సుభాష్ గుప్తా మాట్లాడుతూ - ‘‘నిర్మాతలుగా మా తొలి చిత్రమిది. సినిమా రెండోవారంలోకి ఎంటర్ అయిన సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. కలెక్షన్స్ బావున్నాయి’’ అన్నారు.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved