నాని, కీర్తిసురేష్ జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ నిర్మించిన చిత్రం `నేను లోకల్`. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, శిరీష్, నవీన్‌చంద్ర, బెక్కం వేణుగోపాల్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ - ``సినిమా సక్సెస్ కావడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా రెండో వారంలో కూడా సినిమా థియేటర్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయి. ఈ సినిమా సెలబ్రేషన్స్ మూలకారణం త్రినాథరావు, సాయికృష్ణ, ప్రసన్నకుమార్ సినిమా కథ అనుకున్న రోజు నుండి కష్టపడుతున్నారు. ప్రతి రోజూ ఎంతో కష్టపడుతున్నారు. మంచి కథ, డైలాగ్స్, దర్శకత్వమే సినిమా సక్సెస్ కు కారణమైంది. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చేసిచ్చాను. క్యారెక్టర్ బేస్‌డ్ లవ్ స్టోరీలో తను సింగిల్‌గా సినిమాను ముందుండి నడిపించాడు. మా బ్యానర్‌కు ఫిబ్రవరిలో శతమానం భవతి, ఈ నెలలో నేను లోకల్ సక్సెస్‌లు వచ్చాయి. అలాగే నవీన్ చంద్ర చిన్న క్యారెక్టర్ అయినా చేయడానికి ముందుకు వచ్చాడు. తన కెరీర్‌కు ఈ సినిమా ఎంతో హెల్ప్ అవుతుంది. కీర్తి సురేష్ సహా ప్రతి నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ బాగా కో ఆపరేట్ చేశారు.ఆడియెన్స్ ఈ సినిమాను రిపీటెడ్‌గా చూస్తున్నారు. అన్నీ వర్గాల ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది`` అన్నారు.
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ - ``రాజుగారు చెప్పినట్లు ఇది ఏ ఒక్కరి సక్సెస్ కాదు. అందరి కష్టంతో సినిమా మంచి ఫైనల్ అవుట్‌పుట్‌తో పెద్ద సక్సెస్ అయ్యింది. బెక్కం వేణుగోపాల్‌గారు కథ వినగానే ఈ సినిమాను పెద్ద బ్యానర్‌లో చేస్తే ఇంకా రీచ్ బావుంటుందని భావించి దిల్‌రాజుగారికి కథను వినిపించారు. అలా సినిమా మొదలైంది. నాని మరో పెద్ద హిట్ సాధించాడు. నవీన్ చంద్ర అడగ్గానే ఒప్పుకుని సినిమా చేసినందుకు అతనికి థాంక్స్`` అన్నారు.
సాయికృష్ణ మాట్లాడుతూ - ``ఈ సినిమా అందరికీ ఐదారేళ్లు గుర్తుండిపోయేలా పెద్ద హిట్ సాధించింది. ఈ సినిమాలో ఒక పార్ట్ అయినందుకు ఆనందంగా ఉంది`` అన్నారు.
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ - ``తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాను పెద్ద హిట్ చేశారు. నలుగురు ఫ్రెండ్స్, ఫ్యామిలీలు కలిసి నేను లోకల్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు`` అన్నారు.
నవీన్ చంద్ర మాట్లాడుతూ - ``దిల్‌రాజుగారి బ్యానర్‌లో నటించాలనగానే వేరే ఆలోచనే లేకుండా సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. నా క్యారెక్టర్‌ను ఎంతో అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. దిల్‌రాజుగారి బ్యానర్‌లో ఆయనే కాదు, అందరూ ఎంతో ప్యాషనేట్‌గా వర్క్ చేస్తారు. ఈ సినిమా నా లుక్‌ను మార్చుకుని చేశాను. ప్రేక్షకులు మా కష్టాన్ని గుర్తించి మాకు మంచి రిజల్ట్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.