లక్కీ మీడియా బ్యానర్‌పై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా రూపొందిన చిత్రం `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్`. రావు రమేష్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్ సేన్ ప్రధాన తారాగణంగా నటించారు. సినిమా డిసెంబర్ 16న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సోమవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఆర్.పి.పట్నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బెక్కం వేణుగోపాల్, భాస్కర్ బండి, హెబ్బా పటేల్, రైటర్ ప్రసన్న, సాయికృష్ణ, అశ్విన్ బాబు, నోయెల్, పార్వతీశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా....డీ మానిటైజేషన్ సమయంలో విడుదలైన నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సినిమాకు తొలిరోజు కలెక్షన్స్ పరంగా ఎఫెక్ట్ పడింది. అయితే ఈ సినిమా చేయాలంటే గట్స్ ఉండాలి. అమ్మాయి ప్రేమిస్తే ఒకే కానీ ఇలాంటి ఓ ప్రేమకథను చేయాలంటే గట్స్ ఉండాలి. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఆడియెన్స్ కన్విన్స్ చేసేలా చెప్పిన టీంను అభినందిస్తున్నానని ఆర్.పి.పట్నాయక్ తెలిపారు.
Glam gallery from the event
సినిమా రిలీజ్ అయిన తొలి రోజు కలెక్షన్స్ విషయంలో మేం అనుకున్న భారీ ఓపెనింగ్స్ రాలేదు. కానీ నెమ్మదిగా పుంజుకుంది. తొలిరోజు కంటే రెండో రోజు 20 శాతం కలెక్షన్స్ పెరిగాయి. మూడో రోజు మొదటిరోజు కలెక్షన్స్‌కు డబుల్ అయ్యాయి. ఈ సక్సెస్‌ను ప్రేక్షకులతో పంచుకోవడానికి సిద్ధమైయ్యాం. అందుకనే రేపటి నుండి కరీంనగర్ నుండి శ్రీకాకుళం వరకు సక్సెస్ టూర్ ప్లాన్ చేశాం. ఈ టూర్‌లో యూనిట్ అంతా పాల్గొని ప్రేక్షకులకు థాంక్స్ చెబుతామని నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు. తొలి సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు దర్శకుడు భాస్కర్ బండి థాంక్స్ చెప్పారు. ఈ ఏడాది నేను చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్‌తో సక్సెస్‌ఫుల్ ఇయర్‌గా ముగింపు రావడం ఎంతో సంతోషంగా ఉందని హెబ్బా పటేల్ అన్నారు. సినిమాను విడుదల చేసిన దిల్‌రాజుగారికి థాంక్స్. డీ మానిటైజేషన్ ఎఫెక్ట్ లేకుండా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని నోయెల్, అశ్విన్ బాబు, పార్వతీశం చెప్పారు.