pizza
Raja The Great success meet
'రాజా ది గ్రేట్‌' సక్సెస్‌ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 October 2017
Hyderabad

రవితేజ, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం 'రాజా ది గ్రేట్‌'. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌పై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా దీపావళి సందర్భంగా ఈ నెల 18న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా...

రవితేజ మాట్లాడుతూ - '''రాజా ది గ్రేట్‌' సినిమాను సక్సెస్‌ చేసిన ప్రతి ఒక్కరికీ పెద్ద థాంక్స్‌..చాలా ఆనందంగా ఉంది. నా క్యారెక్టరైజేషన్‌, డైలాగ్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ గురించి మాట్లాడుతున్న విధానం నాకెంతో నచ్చుతుంది. సాయికార్తీక్‌ మ్యూజిక్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌ నేను ఎక్స్‌పెక్ట్‌ చేసిన దాని కంటే చాలా బాగా చేశాడు. శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, సురేఖా వాణి ఇలా అందరూ చక్కగా సహకారం అందించారు. మోహనకృష్ణగారు అద్భుతంగా చేశారు. తనకు కూడా అభినందనలు. మెహరీన్‌ గోల్డెన్‌ లెగ్‌ హీరోయిన్‌. హ్యాట్రిక్‌ హీరోయిన్‌ అయ్యింది. శిరీష్‌ చాలా నిజాయితీ గల వ్యక్తి. దర్శకుడు అనిల్‌కు థాంక్స్‌. తన మూలంగానే ఇది సాధ్యమైంది. నేను తనను నమ్మాను. అలాగే అనిల్‌ కూడా నన్ను నమ్మాడు. ఒకరినొకరు బాగా నమ్మడంతోనే ఈ సక్సెస్‌ సాధ్యమైంది. తనకు క్లారిటీ, కన్వెక్షన్‌ ఉంది. కథ కుదిరితే చాలు తను ఎక్కడా ఆగకుండా వెళ్లిపోతాడు. తను ఇలాగే ఉండాలి. చాలా హ్యాపీగా ఉన్నాం'' అన్నారు.

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ - ''ఒక సినిమా సక్సెస్‌ కావాలంటే ఓ పాజిటివ్‌ ఎనర్జీ మనతో ఉండాలి. నా టీం రూపంలో ఆ ఎనర్జీ నాకు దొరికింది. సినిమా సినిమాకు నా సినిమాల్లో నవ్వులు ఎక్కువ అవుతున్నాయని అందరూ అంటున్నారు. అది వింటుంటే కాస్త భయంగా కూడా ఉంది. ఎందుకంటే నెక్స్‌ట్‌ సినిమాకు ఇంకెతగా నవ్వించాలో అర్థం కావడం లేదు. సక్సెస్‌ను బాగా ఎంజాయ్‌ చేశాం. సక్సెస్‌తో పాటు అప్రిసియేషన్‌ ఎక్కువగా ఉంది. ఇలాంటి సక్సెస్‌ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్‌. అంధుడి క్యారెక్టర్‌తో సినిమా మొత్తాన్ని తెరకెక్కించాలంటే అంత సులభం కాదు. ఆ విషయంలో నన్ను నమ్మిన దిల్‌రాజు, శిరీష్‌గారికి థాంక్స్‌. అలాగే నన్ను బ్లైండ్‌గా నమ్మిన రవితేజగారికి మనస్ఫూర్తిగా థాంక్స్‌. ఈ సినిమా చూసిన వారందరూ రవితేజ ది గ్రేట్‌ అని అంటున్నారు. రవితేజగారి చిన్నప్పటి క్యారెక్టర్‌లో నటించిన ఆయన అబ్బాయి మహాధన్‌ చాలా చక్కగా చేశాడు. మహాధన్‌ నటనకు థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్‌ వస్తుంది. రవితేజగారి నెక్ట్స్‌ జనరేషన్‌ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మెహరీన్‌ తన పాత్రకు న్యాయం చేసింది. ఈ సినిమా సక్సెస్‌తో తనను అందరూ గోల్డెన్‌ లెగ్‌ అంటున్నారు. తను ఇలాంగే సక్సెస్‌లను సాధించాలి. రాధికగారు, ప్రకాష్‌రాజ్‌గారు, తనికెళ్ల భరణిగారు, రాజేంద్రప్రసాద్‌గారు సహా అందరికి థాంక్స్‌. వెంకట్‌ కంపోజ్‌ చేసిన ఫైట్స్‌కు చాలా మంచి పేరు వచ్చింది. సాయికార్తీక్‌ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్‌స్కోర్‌, మోహనకృష్ణగారి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ తమ్మిరాజుగారి ఎడిటింగ్‌్‌ సినిమాకు చాలా ప్లస్‌ అయ్యింది. ఇలాంటి ఒక మంచి సినిమా తీసినందుకు ఓ రచయితగా, దర్శకుడిగా గర్వంగా ఫీలవుతున్నాను'' అన్నారు.

మెహరీన్‌ మాట్లాడుతూ - ''రాజాది గ్రేట్‌ వంటి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాతో హ్యాట్రిక్‌ హిట్స్‌ కొట్టాను. డబుల్‌ హ్యాట్రిక్‌ టైమ్‌ స్టార్ట్‌ అయ్యింది. చాలా సంతోషంగా ఉంది. కథ విన్నప్పుడు దర్శకుడు అనిల్‌గారు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో, ఇప్పుడు అంతే ఆనందంగా ఉన్నారు. నా దర్శకులు, నిర్మాతలు, సహ నటీనటులు కారణంగానే హ్యాట్రిక్‌ విజయాలను సాధిస్తున్నాను'' అన్నారు.

శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ - ''నా కెరీర్‌లోనే ఈ సినిమాలో పెద్ద క్యారెక్టర్‌ను చేశాను. మంచి పేరు కూడా వచ్చింది. ఈ సినిమా సక్సెస్‌ డబ్బింగ్‌ సమయంలోనే అనిల్‌ ముఖంలో కనపడింది. తను సినిమాను బాగా నమ్మాడు. అన్నపూర్ణమ్మగారు, రాజేంద్రప్రసాద్‌గారు సహా అందరితో నటించడం ఆనందంగా ఉంది'' అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్‌ మోహనకృష్ణ, ఎడిటర్‌ తమ్మిరాజు, సురేఖావాణి, రచ్చ రవి, రవిప్రకాష్‌, రమేష్‌ రెడ్డి, చిత్రం శ్రీను, రఘుబాబు, సాయికార్తీక్‌ తదితరులు పాల్గొని సినిమా సక్సెస్‌ పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved