17 September 2016
Hyderabad
సాగర్ హీరోగా లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రామదూత క్రియేషన్స్ బేనర్‌పై దయానంద్‌రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మాతగా రూపొందిన చిత్రం 'సిద్ధార్థ'. ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో లంకాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ - ''కథ చాలా ఇన్‌స్పైరింగ్‌గా అన్పించింది. ఓ మంచి కథకి మంచి టీమ్ కుదిరింది. అందరూ ఈ సినిమాని తమ సినిమాగా భావించి చేయడంతో మంచి ఔట్‌పుట్ వచ్చింది. సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్'' అన్నారు.
రచయిత విసు మాట్లాడుతూ - ''ఈ చిత్రంతో సాగర్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి పెర్‌ఫార్మెన్స్ ప్రదర్శించాడు. తను భవిష్యత్తులో టాప్ 10 హీరోల్లో ఒకడిగా నిలుస్తాడు. రచయితగా నాకు ఒక మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది'' అన్నారు.
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ''టీమ్ అందరి సమిష్టి కృషి వల్లే ఇంత మంచి సక్సెస్ వచ్చింది. దాసరి కిరణ్‌కుమార్‌తో ఈ చిత్రంతో ప్రయాణం ప్రారంభించాం. ఈ జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. బుల్లితెరపైనే కాదు వెండితెరపై కూడా సాగర్ తానేంటో ఈ చిత్రంతో నిరూపించుకున్నాడు. ప్రేమకు కులమత బేదాలే కాకుండా మరో కొత్త సమస్యను ఈ చిత్రంలో చూపించాం. ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. ఇంతటి మంచి సక్సెస్‌ను ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్'' అన్నారు.
Glam gallery from the event |
|
|
|
నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ - ''ఒక సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనడం కంటే ఎంత మంచి సినిమా తీశాం అన్నదే నిర్మాతకు తృప్తినిస్తుంది. సిద్ధార్థ నాకు చాలా సంతృప్తినిచ్చిన సినిమా. చాలా మంచి టీమ్ కుదిరింది. పరుచూరి బ్రదర్స్, ఎస్.గోపాల్‌రెడ్డి, మణిశర్మ ఇలా ప్రతి ఒక్కరూ మంచి ఔట్‌పుట్ ఇవ్వడంతో సినిమాని ప్రేక్షకులు ఆద్భుతంగా ఆదరిస్తున్నారు. సాగర్ ఈ కథకి పర్‌ఫెక్ట్ యాప్ట్. టాప్‌టెన్ హీరోల్లో ఒకడిగా నిలుస్తాడు. పరుచూరి బ్రదర్స్ మాటలు, గోపాల్‌రెడ్డిగారి సినిమాటోగ్రఫీ, మణిశర్మగారి సంగీతం సినిమా సక్సెస్‌లో కీలక పాత్రలు పోషించాయి. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.
దర్శకుడు దయానంద్‌రెడ్డి మాట్లాడుతూ - ''సినిమాని బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాకు దర్శకుడిగా అవకాశమిచ్చిన నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌గారికి, అద్భుతమైన మాటలు అందించిన పరుచూరి బ్రదర్స్‌కి, ప్రతి విజువల్‌ని రిచ్‌గా చూపించిన ఎస్.గోపాల్‌రెడ్డిగారికి, ఎక్స్‌లెంట్ మ్యూజిక్‌నిచ్చిన మణిశర్మగారికి, మంచి కథని అందించిన విసుగారితో సహా నటీనటులకు, టెక్నీషియన్స్ సపోర్ట్‌తో మంచి సినిమా తీయగలిగాను'' అన్నారు.
హీరో సాగర్ మాట్లాడుతూ - ''సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. వారి రుణం తీర్చుకోలేనిది. దాసరి కిరణ్‌కుమార్‌గారు, దర్శకుడు దయానంద్‌రెడ్డిగారు బ్రదర్స్‌లా కేర్ తీసుకుని సినిమాని అద్భుతంగా చేశారు. అలాగే పరుచూరి బ్రదర్స్, ఎస్.గోపాల్‌రెడ్డి, మణిశర్మలాంటి గొప్ప టెక్నీషియన్స్‌తో పని చేసే అవకాశం కలిగింది. సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్'' అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ రాగిణి నంద్వాని, కథా రచయిత విసు సహా చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.