నిఖిల్, హెబ్బా పటేల్, నందిత శ్వేత హీరో హీరోయిన్లుగా మేఘన ఆర్ట్స్ బ్యానర్‌పై వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో పి.వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా....
హీరో నిఖిల్ మాట్లాడుతూ - ''గత ఏడు నెలులుగా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఈ ఏడు నెలలు నుండి ఈ సినిమా ఏంటని చాలా మంది అడిగారు. నేను సాధారణంగా మంచి స్క్రిప్ట్స్ చేస్తున్నానని చాలా మంది అంటున్నారు. ఆనంద్‌గారు అద్భుతమైన కథ చెప్పగానే మంచి టీంతో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకుని చేసిన సినిమా ఇది. ఇప్పటి వరకు ప్రమోషన్ కూడా చేయలేదు. ఒక పర్టికులర్ డేట్ ఫిక్స్ అయిన తర్వాతే ప్రమోషన్ చేయాలనే నిర్ణయంతో ఇప్పుడు ప్రమోషన్‌ను స్టార్ట్ చేశాం. చాలా మంచి స్టోరీ. మంచి లవ్ స్టోరీలో ఫాంటసీ ఎలిమెంట్స్ మిక్స్ ఉన్నాయి. మా హీరోయిన్స్ కూడా చక్కగా యాక్ట్ చేశారు. వెన్నెలకిషోర్, సత్య అందరూ తమ సినిమాగా భావించి చేసిన సినిమా. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరూ డిఫరెంట్ మూవీగా ఎంజాయ్ చేస్తారు. నవంబర్ ఫస్ట్‌వీక్‌లో సినిమా సెన్సార్ ఉండబోతుంది. సినిమాను నవంబర్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రమోషన్‌ను కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
దర్శకుడు వి.ఐ.ఆనంద్ మాట్లాడుతూ - ''టీజర్ బావుందని చాలా మంది అంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నా హృదయానికి దగ్గరైన స్క్రిప్ట్ ఇది. మూడేళ్ల క్రితం నా ఫ్రెండ్ చెప్పిన ఘటన ఆధారంగా తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఇది. అన్నీ రకాల ఎలిమెంట్స్‌తో ఈ సినిమా కథను తయారు చేసుకున్నాను. నిఖిల్ కథ వినగానే చేయడానికి ఆసక్తిని చూపించారు. నిర్మాత వెంకటేశ్వరరావుగారు సినిమాను కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. అందరికీ థాంక్స్'' అన్నారు.
Nadhita Swetha Glam gallery from the event
హీరోయిన్ నందిశ్వేత మాట్లాడుతూ - ''నేను బెంగళూరు అమ్మాయిని. తమిళ సినిమాల్లో యాక్ట్ చేశాను. తెలుగులో ఎప్పటి నుండో మంచి ప్రాజెక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ కావాలని ఎదురుచూస్తున్నాను. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా వంటి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో పార్వతి అనే పవర్‌ఫుల్ రోల్ చేశాను. సినిమా రిలీజ్ తర్వాత అందరూ నా రోల్ గురించి మాట్లాడుకుంటారు. నేను నటించిన మొదటి తమిళ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అలాగే తెలుగులో కూడా తొలి సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సపోర్ట్ చేసిన హీరో నిఖిల్‌కు థాంక్స్'' అన్నారు.
నిర్మాత పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ''నిఖిల్‌గారితో సినిమా చేయాలని కోరిక ఉండేది. ఆనంద్‌గారు చెప్పిన కథ నచ్చడంతో నిఖిల్‌గారు మా బ్యానర్‌లో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. మంచి డిఫరెంట్ మూవీ అవుతుంది. సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని భావిస్తున్నాం'' అన్నారు.