pizza
Pichiga Nachav teaser launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 January 2017
Hyderaba
d

''ప్రేమన్నది యూనివర్సెల్‌. కానీ ప్రేమలో ఉన్న ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం చెబుతుంటారు. అంటే ప్రేమ అన్నది వ్యక్తిగతం కూడా. చిన్న విషయాన్ని కూడా అర్ధం చేసుకోకుండా నేటి యువత కోపం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుపోతున్నారు. దీని వల్ల మనుషులు, మనసులు విడిపోతున్నాయి. అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని తన వల్ల జరిగిన పొరపాటుని ఎలా సరిదిద్దుకున్నాడు? తన జీవితాన్ని అందంగా ఎలా మలుచుకున్నాడు అన్నది తెరపైనే చూడాలంటున్నారు'' నిర్మాత కమల్‌కుమార్‌ పెండెం. సంజయ్‌, చేతన ఉత్తేజ్‌, నందు, కారుణ్య నటీనటులుగా శ్రీవత్స క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'పిచ్చిగా నచ్చావ్‌'. వి.శశిభూషణ్‌ దర్శకుడు. కమల్‌కుమార్‌ పెండెం నిర్మాత. గురువారం రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. రాజ్‌ కందుకూరి బ్యానర్‌ లోగోను, ఉత్తేజ్‌ హీరోయిన్‌ లుక్‌ను, నవీన్‌చంద్ర టీజర్‌ను ఆవిష్కరించారు.

నవీన్‌చంద్ర మాట్లాడుతూ ''స్ట్రగ్‌లింగ్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ తన పాజిటివ్‌ మాటలతో ఉత్తేజ పరిచే వ్యక్తి ఉత్తేజ్‌గారు. సినిమానే తన జీవితంగా ఎంచుకున్న ఆయన తన కూతుర్ని హీరోయిన్‌గా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. చేతన తండ్రికి తగ్గ కూతురు అనిపించుకోవాలి''అని అన్నారు.

రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ ''ఈ సినిమా చూశాను. ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుంది. రామ్‌ నారాయణ పాటలు హైలైట్‌గా నిలుస్తాయి. నిర్మాత సవాల్‌గా తీసుకుని నిర్మించిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది'' అని అన్నారు.

నిర్మాత కమల్‌కుమార్‌ పెండెం మాట్లాడుతూ ''ప్రేమకథలో రూపొందుతున్న చిత్రమిది. కుటుంబ విలువలతో వల్గారిటీ లేకుండా లావిష్‌గా సినిమాను రూపొందించాం. సంజీవ్‌, చేతన జంట తెర మీద చూడముచ్చటగా ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్లకు చక్కని స్పందన వచ్చింది. 46 రోజుల్లో సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేశాం. దర్శకుడికి మంచి పేరొస్తుంది. త్వరలో పాటల్ని విడుదల చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని తెలిపారు.

ఉత్తేజ్‌ మాట్లాడుతూ ''నాకు సినిమానే ప్రాణం. సినిమా లేకపోతే చచ్చిపోతాను. కళామతల్లిని, కష్టాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ ఇక్కడ మంచి భవిష్యత్తు ఉంటుంది. నా కూతురికి కూడా అదే చెబుతాను'' అని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ ''నా ఐడియాను నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. మొదటి సినిమాకు చక్కని నిర్మాత దొరకడం నా అదృష్టం. ఇది కొత్త కథేమీ కాదు కానీ అందరికీ కనెక్ట్‌ అవుతుంది. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. రాంనారాయణ చక్కని బాణీలందించారు. విందు భోజనంలాంటి సినిమా ఇది'' అని అన్నారు.

హీరోయిన్‌ చేతన మాట్లాడుతూ ''ప్రస్తుత కాలంలో మన పక్కింటి అమ్మాయిలు, అబ్బాయిలు ఎలాంటి వేషాలు వేస్తున్నారన్నది ఈ సినిమాలో చూపించాం. మంచి టీమ్‌ కుదిరింది. కమల్‌గారు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా తెరకెక్కించారు. భవిష్యత్తులో రామానాయుడుగారులాంటి నిర్మాత అవుతారు'' అని అన్నారు.

యజ్ఞంలా ఈ చిత్రానికి పనిచేశామని పుచ్చా రామకృష్ణ తెలిపారు.

ఈ చిత్రానికి కెమెరా: వెంకట హనుమ, సంగీతం: రాం నారాయణ, ఆర్ట్‌: రమేష్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: పుచ్చా రామకృష్ణ, సమర్పణ: శ్రీమతి శైలజ.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved