pizza
Police Power teaser launch
`పోలీస్ ప‌వ‌ర్` టీజ‌ర్ విడుద‌ల
You are at idlebrain.com > News > Functions
Follow Us

1 January 2016
Hyderaba
d

స‌ర్వేశ్వ‌ర మూవీస్ బ్యాన‌ర్‌పై శివ జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా, ద‌ర్శ‌కుడిగా గుద్దేటి బ‌స‌వ‌ప్ప మేరు నిర్మిస్తున్న చిత్రం `పోలీస్ ప‌వ‌ర్`. ఈ సినిమా టైటిల్‌, బ్యాన‌ర్ లోగో, టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో జరిగింది. బ్యానర్‌, టైటిల్ లోగోను సీనియ‌ర్ పాత్రికేయులు వినాయ‌క‌రావు విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను ల‌య‌న్ సాయివెంక‌ట్ విడుద‌ల చేశారు. అనంత‌రం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో...

ల‌య‌న్ సాయివెంక‌ట్ మాట్లాడుతూ - ``2016లో చిన్న సినిమాలు చాలా మంచి స‌క్సెస్‌లు సాధించాయి. ఈ 2017లో కూడా చిన్న సినిమాల స‌క్సెస్ కంటిన్యూ కావాల‌ని కోరుకుంటున్నాను. పోలీస్ ప‌వ‌ర్ సినిమా విష‌యానికి వ‌స్తే టీజ‌ర్ చాలా బావుంది. ఈ సినిమా పెద్ద రేంజ్ హిట్‌ను సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వినాయ‌క‌రావు మాట్లాడుతూ - ``శివ జొన్న‌ల‌గ‌డ్డ‌తో చాలా కాలంగా మంచి ప‌రిచ‌యం ఉంది. ఇది వ‌ర‌కు ద‌ర్శ‌కుడిగా వ‌ర్క్ చేశారు. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగానే కాదు, హీరోగా కూడా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి శివ జొన్న‌ల‌గ‌డ్డ‌కు ద‌ర్శ‌కుడిగా, హీరోగా మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

హీరో, ద‌ర్శ‌కుడు శివ జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ - ``నేను గ‌తంలో దీక్ష‌, శ‌నిదేవుడు వంటి సినిమాల‌ను డైరెక్ట్ చేశాను. తర్వాత ప‌క్కా మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాను చేయాల‌నిపించి పోలీస్ ప‌వ‌ర్ అనే క‌థ‌ను త‌యారు చేసుకున్నాను. కాల్‌మ‌నీ బ్యాక్‌డ్రాప్ న‌డిచే సినిమా. ఇందులో ఏడు ఫైట్స్‌, ఐదు సాంగ్స్ ఉంటాయి. అన్నీ ఎలిమెంట్స్ ప‌క్కాగా కుదిరాయి. సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం`` అన్నారు.

నిర్మాత గుద్దేటి బ‌స‌వ‌ప్ప మేరు మాట్లాడుతూ - ``నేను పోలీస్ డిపార్టెట్‌మెంట్‌లోనే వ‌ర్క్ చేశాను. ఇంత‌కు ముందు దొర‌త‌నం మాకొద్దు అనే సినిమాను నిర్మించాను. త‌ర్వాత గ్యాప్ తీసుకున్నాను. శ‌నిదేవుడు సినిమాను కూడా నిర్మించాను. శివ‌గారు చెప్పిన పోలీస్ ప‌వ‌ర్ సినిమా న‌చ్చ‌డంతో సినిమాను నిర్మించాను. ఈనెల‌లోనే ఆడియో , సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్ నందిని క‌పూర్‌, ఫైట్స్ మాస్ట‌ర్ అవినాష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కెమెరాః బి.ఎస్‌.కుమార్‌, బాపు.జి, ఫైట్స్ః అవినాష్‌, పాట‌లుః రుద్రంగి ర‌మేష్‌, సంజ‌య్ గాంధీ, నిర్మాతః గుద్దేటి బ‌స‌వ‌ప్ప మేరు, క‌థ‌, మాట‌లు, సంగీతం, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శివ జొన్న‌ల‌గ‌డ్డ‌.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved