pizza
Shamanthakamani teaser launch
`శ‌మంత‌క‌మ‌ణి` టీజ‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 June 2017
Hyderabad

భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `శ‌మంత‌క‌మ‌ణి`. నారా రోహిత్‌, సందీప్ కిష‌న్‌, సుధీర్ బాబు, ఆది సాయికుమార్‌, డా. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఇంద్ర‌జ‌, చాందిని చౌద‌రి, అన‌న్య సోని, జెన్ని, సుమ‌న్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, క‌స్తూరి, ర‌ఘు కారుమంచి, హేమ‌, సురేఖ వాణి, గిరిధ‌ర్‌, స‌త్యం రాజేశ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న సినిమా `శ‌మంత‌క‌మ‌ణి`. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వి. ఆనంద‌ప్ర‌సాద్ నిర్మాత‌. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

నారా రోహిత్ మాట్లాడుతూ ``డిఫ‌రెంట్ చిత్ర‌మిది. నా క్యార‌క్ట‌ర్‌ని చాలా బాగా డిజైన్ చేశారు. కొత్తగా ఉంటుంది. నా క్యార‌క్ట‌ర్ బాగా న‌చ్చ‌డంతోనే సినిమా చేశాను. త‌క్కువ రోజుల్లో తెర‌కెక్కించారు. `బాణం`, `సోలో` త‌ర్వాత మ‌ణిశ‌ర్మ సంగీతంలో చేస్తున్నాను. త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. న‌లుగురు హీరోల‌ను ఒక తాటి మీద‌కు తీసుకొచ్చిన ఆనంద‌ప్ర‌సాద్‌గారు`` అని అన్నారు.

సుధీర్‌బాబు మాట్లాడుతూ ``ఇందులో ప్ర‌తి పాత్రా బావుంది. అందుకే నాకు ఏ పాత్ర సూట్ అయితే దాన్నే ఇవ్వ‌మ‌ని ఆప్ష‌న్ ద‌ర్శ‌కుడికి ఇచ్చాను. ఇది రెగ్యుల‌ర్ ఫార్ములాలో ఉండ‌దు. చాలా కొత్త‌గా ఉండే స్క్రిప్ట్. నేను ఇందులో త‌ల్లిని కోల్పోయిన వ్య‌క్తిగా న‌టిస్తున్నాను. ఎమోష‌న్ ఫ్యాక్ట‌ర్ ఉన్న క్యార‌క్ట‌ర్ నాది. న‌లుగురు హీరోల‌తో సినిమా చేయ‌డ‌మంటే ఇబ్బందే అని అనుకుంటున్న ఈ త‌రుణంలో దాన్ని సుసాధ్యం చేసిన ఘ‌న‌త ఈ టీమ్‌ది. ఆనంద‌ప్ర‌సాద్‌గారు తండ్రిలాంటి వారు`` అని చెప్పారు.

ఆది మాట్లాడుతూ ``ఈ మ‌ధ్య‌నే ఓపెనింగ్ అయిన‌ట్టు ఉంది. ఈ సినిమాకు ప్రొడ్యూస‌ర్‌, డైర‌క్ట‌ర్‌, కెమెరామేన్ అంద‌రూ చ‌క్క‌టివారు కుద‌ర‌డంతో చాలా త్వ‌ర‌గా సినిమా పూర్త‌వుతోంది. మోష‌న్ పోస్ట‌ర్‌కి మంచి స్పంద‌న వ‌స్తోంది. మ‌ణిగారి సంగీతంలో నేను న‌టిస్తున్న రెండో చిత్ర‌మిది. కార్తిక్ అనే ల‌వ‌బుల్ పాత్ర‌లో న‌టిస్తున్నాను`` అని అన్నారు.

ఆనంద ప్ర‌సాద్ మాట్లాడుతూ ``టీజ‌ర్‌ని గెస్ చేయ‌మ‌ని ఓ కాంటెస్ట్ ని ర‌న్ చేశాం. త్వ‌ర‌లో మా న‌లుగురు హీరోల‌ను ఒక‌చోట క‌లిపి ఫేస్‌బుక్ లైవ్ ద్వారా న‌లుగురిని ఎంపిక చేసి వారికి చెప్పిన‌ట్టే ఐ7 ఫోన్ల‌ను ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో అందిస్తాం. ఈ సినిమా చేయ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు శ్రీరామ్ ఆదిత్య చాలా మంచి క‌థ చెప్పారు. అంద‌రూ చ‌క్కగా న‌టించారు. జులై 14న చిత్రాన్ని విడుద‌ల చేస్తాం`` అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``ఆన్‌లైన్‌లో టీజ‌ర్‌కి చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. నేను తొలిసారి రాసుకున్న క‌థ ఇది. న‌లుగురు హీరోలూ నాకు చాలా స‌పోర్ట్ చేశారు. ఒక్కొక్క‌రితోనూ నాకు మంచి అనుభ‌వం ఉంది. షూటింగ్ ఫాస్ట్ గా చేయ‌డానికి స‌మీర్ రెడ్డి కెమెరాప‌నిత‌నం కూడా తోడైంది. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, సుమ‌న్‌గారు, త‌నికెళ్ల‌భ‌ర‌ణిగారు, మ‌ణిశ‌ర్మ‌గారు.. లాంటి సీనియ‌ర్ల‌తో ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. ప్ర‌వీణ్‌పూడి ఎడిటింగ్ చేస్తున్నారు. ఆనంద్‌ప్ర‌సాద్‌గారు చాలా పాజిటివ్‌గా ఉండే నిర్మాత‌. ఈ సినిమా ఆద్యంతం నాకు స‌హ‌క‌రించిన అన్నేర‌విగారికి ధ‌న్య‌వాదాలు`` అని చెప్పారు.

క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ ఆదిత్య .టి., నిర్మాత‌: వి. ఆనంద‌ప్ర‌సాద్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: అన్నే ర‌వి, కెమెరా: స‌మీర్ రెడ్డి, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, మాట‌లు: వెంక‌ట్ డి పాటి, అర్జున్ - కార్తిక్‌, శ్రీరామ్ ఆర్‌. ఎర‌గం, ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ పూడి, ఆర్ట్: వివేక్ అన్నామ‌లై, నృత్యాలు: ర‌ఘు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved