pizza
Ram's Hyper theatrical trailer launch
'హైపర్‌' థియేట్రికల్ ట్రైలర్ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 September 2016
Hyderaba
d

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంటగోపీచంద్‌ ఆచంటఅనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). జిబ్రాన్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సెప్టెంబర్‌ 23న హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో సుకుమార్‌రామ్‌నాని రాశిఖన్నాహరీష్‌ శంకర్‌సంతోష్‌ శ్రీనివాస్‌జిబ్రాన్‌శ్రీమణిరామజోగయ్యశాస్త్రిమురళీశర్మస్రవంతి రవికిషోర్‌కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌కిషోర్‌ తిరుమలహను రాఘవపూడిఅబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు.

సుకుమార్‌హరీష్‌ శంకర్‌నాని హైపర్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో హైపర్ సినిమాలోని పాటలను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా....

స్రవంతి రవికిషోర్‌ మాట్లాడుతూ - ''రామ్‌ బాగా యాక్టివ్‌ పర్సన్‌. చాలా కష్టపడతాడు. ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటూ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ - ''రామ్‌ ఎనర్జీ ఏంటో అందరికీ తెలుసు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

కిషోర్‌ తిరుమల మాట్లాడుతూ - ''సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

హను రాఘవపూడి మాట్లాడుతూ - ''హైపర్‌ సినిమా గ్యారంటీ పెద్ద హిట్‌. రామ్‌ తన ఎనర్జీతో అదరగొట్టేశాడు'' అన్నారు.

సుకుమార్‌ మాట్లాడుతూ - ''ట్రైలర్‌ సూపర్బ్‌అదిరిపోయింది. కొన్నిసార్లు ట్రైలర్‌ చూస్తేనే సినిమాపై పాజిటివ్‌ వైబ్స్‌ వస్తుంది. అలాంటి ట్రైలర్‌ ఉంది. ముగ్గురు నిర్మాతలు చాలా కూల్‌గా ఉంటారు. ముగ్గురులో గోపీగారు ప్రొడ్యూసర్‌లా ఆలోచిస్తేరామ్‌గారు మంచి కథకుడులా ఆలోచిస్తారుఅనీల్‌గారు మంచి దర్శకుడిలా ఆలోచిస్తారు. రామ్‌తో జగడం సినిమా చేశాను. తను చాలా హైపర్‌. జగడం నుండి హైపర్‌ వరకు రామ్‌లో ఏ చేంజ్‌ లేదు. ఈ సినిమా తప్పకుండా రామ్‌ హిట్‌ కొడతాడు. అలాగే సంతోష్‌శ్రీనివాస్‌కు ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.

హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ - ''రామ్‌ కెరీర్‌లోనే ఈ ట్రైలర్‌ చాలా బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది. రామ్‌అనీల్‌గోపీగారితో మంచి రిలేషన్‌ ఉంది. అందరూ డబ్బులు సంపాదించాలనే కోరికతో ఇండస్ట్రీకి వస్తారు కానీ వీరు ముగ్గురు డబ్బు సంపాదించి సినిమాపై ప్యాషన్‌తో ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు. 14రీల్స్‌ బ్యానర్‌లో హైపర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ కావాలి. ఈ బ్యానర్‌లో దూకుడు సినిమా వచ్చి ఐదేళ్లు అవుతుంది. అలాంటి హిట్‌ ఈ సినిమాతో నిర్మాతలు అందుకోవాలి. కందిరీగ వాసు ఎనర్జీస్పీడ్‌ అంటే ఇష్టం. హైపర్‌ కథ వినగానే నాకు నచ్చింది. సినిమా డెఫనెట్‌గా వాసు కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది. ఈ సినిమాతో వాసు కమ్‌ బ్యాక్‌ అవుతాడు. సాంగ్స్‌ బావున్నాయి'' అన్నారు.

Raashi Khanna Glam gallery from the event

హీరో నాని మాట్లాడుతూ - ''థియేట్రికల్‌ ట్రైలర్‌ చాలా బావుంది. 14 రీల్స్‌ బ్యానర్‌లో నేను కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా చేశాను. ఈ సినిమా సమయంలో వారితో మంచి అనుబంధం ఏర్పడింది. వారెప్పుడూ నా క్షేమం కోరుకునే వ్యక్తులు. కృష్ణగాడి వీరప్రేమగాథ కంటే హైపర్‌ పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. రామ్‌కు సరిపోయే టైటిల్‌గా హైపర్‌ అని పెట్టారు. వాసుతో ఎప్పటి నుండో పరిచయం ఉంది. సినిమా ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుందో నాకు తెలుసు. జిబ్రాన్‌గారు సంగీతం అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో బేబిడాల్‌ సాంగ్‌ నాకు బాగా నచ్చింది. అన్నీ పాటలు బావున్నాయి. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటూ యూనిట్‌కు అభినందనలు'' అన్నారు.

జిబ్రాన్‌ మాట్లాడుతూ - ''ఈ ఆల్బమ్‌ నాకెంతో స్పెషల్‌. దర్శక నిర్మాతలు ఎంతగానో సపోర్ట్‌ చేశారు. పాటలకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌''అన్నారు.

దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ - ''14 రీల్స్‌ అంటే ఇష్టమే కాదుగౌరవం కూడా. రామ్‌తో ఎలాంటి కథతో సినిమా చేయాలో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి మాకు మూడు నెలలు పట్టింది. కమర్షియల్‌ సినిమాల స్టయిల్‌లో కాకుండా ఏదో చెప్పాలిదాంట్లో ఓ నిజాయితీ ఉండాలని రాసుకున్న కథే హైపర్‌. ప్రతి ఒకరికి వారి తండ్రే హీరో. ఈ సినిమాలో హీరోకు కూడా తండ్రే హీరో. తండ్రిని గెలిపించే కథే హైపర్‌. కథ రాసుకోగానే రామ్‌కు పర్‌ఫెక్ట్‌గా సరిపోయే కథ అని ఆయనకు చెప్పడంఆయనకు నచ్చడంతో అసలు యుద్ధం అక్కడ నుండే ప్రారంభమైంది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా సక్సెస్‌ తర్వాత నేను సినిమా గురించి మాట్లాడుతాను. గౌతంరాజుసమీర్‌రెడ్డిఅబ్బూరి రవి,జిబ్రాన్‌ సహా అందరూ ఎంతగానో సపోర్ట్‌ చేశారు. సత్యరాజ్‌గారుమురళీశర్మరావు రమేష్‌ సహా అందరూ సపోర్ట్‌ చేశారు. నా కెరీర్‌లోనేను చేసిన మూడు సినిమాల్లో ఇదే బెస్ట్‌ మూవీ అవుతుంది'' అన్నారు.

రామ్‌ మాట్లాడుతూ - ''దర్శకుడు సంతోష్‌ నాకెంటే హైపర్‌. సినిమా స్టార్ట్‌ చేసిన మూడు నెలలకే పూర్తి చేసేశాడు. కందిరీగ కథ నాకు చెప్పినప్పుడు తను పెద్ద డైరెక్టర్‌ అవుతాడనిపించింది. ఈ కథ చెప్పేటప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. మా కాంబినేషన్‌లో సూపర్‌హిట్‌ అవుతుంది. నిర్మాతలు చాలా ప్యాషనేట్‌. వారి ప్యాషన్‌ ప్రతి సినిమాకు పెరుగుతుంది. నాకొక మరో హోం బ్యానర్‌లా అనిపిస్తుంది. సమీర్‌రెడ్డి ప్రతి సీన్‌ను ఎంతో అద్భుతంగా చూపించారు. చాలా కమిట్‌మెంట్‌ ఉన్న వ్యక్తి. జిబ్రాన్‌ చాలా మంచి ఆల్బమ్‌ ఇచ్చాడు. అలాగే అబ్బూరిరవిగారు ఎంతో సహకారం అందించారు. సెప్టెంబర్‌ 30న హైపర్‌ విడుదలవుతుంది'' అన్నారు.

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌రావు రమేష్‌మురళీశర్మపోసాని కృష్ణమురళిప్రభాస్‌ శ్రీనుతులసిహేమప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డిఆర్ట్‌: అవినాష్‌ కొల్లాఎడిటింగ్‌: గౌతంరాజుమాటలు: అబ్బూరి రవిలైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టాసమర్పణ: వెంకట్‌ బోయినపల్లినిర్మాతలు: రామ్‌ ఆచంటగోపీచంద్‌ ఆచంటఅనీల్‌ సుంకరకథస్క్రీన్‌ప్లేదర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved