pizza
Akeera Trailer Launch
'
అకీరాట్రైలర్‌ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

6 October 2016
Hyderaba
d

దెయ్యాన్ని చూసి సాధారణంగా భయపడతాడు..అదే మనిషిని చూసి దెయ్యం భయపడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్రం 'అకీరా'. వర్షి మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై విరాజ్‌ హీరోగా ప్రదీప్‌ మమ్ముట్టి దర్శకత్వంలో గోవర్ధన్‌ రెడ్డి నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరుగుతుంది. ఈ సందర్భంగా....

దర్శకత్వంలో మల్టీడైమన్షన్‌ వాసు మాట్లాడుతూ - ''హిందీలోకన్నడలో 'అకీరాఅనే టైటిల్‌తో సినిమా వచ్చి పెద్ద సక్సెస్‌ను సాధించింది. ప్రేక్షకులు హర్రర్‌ కామెడి సినిమాలు ఎన్ని వచ్చినా చూసి ఎంకరేజ్‌ చేస్తూనే ఉన్నారు. మనిషిని చూసి దెయ్యం భయపడే కొత్త తరహా చావోటిక్‌ కామెడి కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తో రీసెంట్‌గా తమిళంలో సంతానం నటించిన సినిమా కూడా పెద్ద హిట్‌ సాధించింది. ట్రైలర్‌ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. దర్శక నిర్మాతలకు అభినందనలు. చిన్న సినిమాల ట్రెండ్‌ నడుస్తుంది. యంగ్‌ టీం చేసిన ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.

Glam galleries from the event

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - ''ప్రదీప్‌గోవర్ధన్‌లకు అభినందనలు. క్యాచీ టైటిల్‌. సక్సెస్‌ఫుల్‌ హర్రర్‌ ఫార్ములాతో సాగే చిత్రమిది. చిన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్న తరుణంలో ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్‌ సాధించాలి'' అన్నారు.

దర్శకుడు ప్రదీప్‌ మమ్ముట్టి మాట్లాడుతూ - ''ఈ సినిమా ఈ స్టేజ్‌కు వచ్చిందంటే ఏకైక కారణం నిర్మాత గోవర్ధన్‌ రెడ్డిగారే. చావోటిక్‌ కామెడితో రూపొందిన సినిమా ఇది. అందరూ బాగా సపోర్ట్‌ చేయడంతో ఓ మంచి ప్రయత్నం చేశామని భావిస్తున్నాను'' అన్నారు.

నిర్మాత గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ - ''స్క్రిప్ట్‌ వినగానే సినిమాను ప్రొడ్యూస్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. సినిమా కొత్త జోనర్‌లో రూపొందింది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం'' అన్నారు.

అనూషఅంకితమనోహర్‌రాపిడ్‌ అప్పారావుఆర్‌.పి. రాకింగ్‌ రాకేష్‌శేషుసాయి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జయంత్‌కథమాటలుస్క్రీన్‌ప్లేదర్శకత్వం: ప్రదీప్‌ మమ్ముట్టి.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved