pizza
Iddaru Iddare trailer launch
'
ఇద్దరూ..ఇద్దరేట్రైలర్‌ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

26 September 2016
Hyderaba
d

కె.ఆర్‌.ఫిలిం ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మోహన్‌లాల్‌సత్యరాజ్‌అమలాపాల్‌రమ్యనంబీశన్‌ తారాగణంగా రూపొందిన చిత్రం 'ఇద్దరూ..ఇద్దరే'. జోషి దర్శకత్వంలో కందల కృష్ణారెడ్డి నిర్మాతగా ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్స్‌ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత కందల కృష్ణారెడ్డిబెక్కం వేణుగోపాల్‌ప్రసన్నకుమార్‌.టిశోభారాణిసాయివెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

నిర్మాత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ - ''నేను నెల్లూరు డిస్ట్రిబ్యూటర్‌ని. మలయాళంలో ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావడంఈ సినిమాలో నటించిన మోహన్‌లాల్‌సత్యరాజ్‌అమలాపాల్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం కావడంతో ఈ సినిమా తెలుగులో కూడా మంచి ఆదరణ పొందుతుందని భావించి సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాం. బిజినెస్‌ కూడా పూర్తయ్యింది. త్వరలోనే విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ - ''ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు పెద్ద విజయాలను సాధిస్తున్నాయి. ఇక మలయాళంలో విజయవంతమైన ఈ సినిమాను ఇద్దరూ..ఇద్దరే.. అనే టైటిల్‌తో కృష్ణారెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. అందరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఆర్టిస్టులే కాబట్టి ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాను ముందు నేను తెలుగు విడుదల చేద్దామని అనుకున్నాను. అయితే అప్పటికే కృష్ణారెడ్డిగారు హక్కులను చేజిక్కించుకున్నారు. సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా పెద్ద సక్సెస్‌ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టాలని భావిస్తున్నాను'' అన్నారు.

మోహన్‌లాల్‌సత్యరాజ్‌అమలాపాల్‌రమ్యనంబీశన్‌రాహుల్‌ దేవ్‌సోనూసూద్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలుపాటలు: వై.రామకృష్ణకెమెరా: ఎస్‌.లోకనాథన్‌ఎడిటింగ్‌: శ్యామ్‌ శశిధరన్‌మ్యూజిక్‌: గోపీసుందర్‌నిర్మాత: కందల కృష్ణారెడ్డిదర్శకత్వం: జోషి.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved