pizza
Intlo Deyyam Nakem Bhayam theatrical trailer launch
'ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం' పాట‌లు విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

3 November 2016
Hyderaba
d

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం'. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను గురువారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు.

హీరో నాని థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``న‌రేశ్ అంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. కిత‌కిత‌లు త‌ర్వాత ఆయ‌న ఎంట‌ర్‌టైన్‌మెంట్ వేలో ఎంత హిట్ అయ్యారో తెలిసిందే. సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్ సినిమాల‌ను చేసేట‌ప్పుడు ఈవీవీగారు న‌న్ను పిలిచి సూప‌ర్‌హిట్లు ఖాయ‌మ‌ని చెప్పారు. ఈ సినిమా మాకు హ్యాట్రిక్ సినిమా. న‌రేశ్‌తో సినిమా చేయాల‌ని అనుకున్న‌ప్పుడు ఏం చేయాలా అని ఆలోచ‌న‌లో ప‌డ్డాను. మ‌నం న‌రేశ్‌కి ఒక క‌థ చెబితే త‌ను ఆరు క‌థ‌లు చెబుతాడు మ‌న‌కి. క‌థ‌ల ఏటీయం న‌రేశ్‌. అంతగా ఎప్పుడూ క‌థ‌ల గురించి ఆలోచిస్తూ, సినిమాలు చూస్తూ ఉంటాడు. హార‌ర్ ట్రై చేద్దామ‌ని న‌రేశ్ అన్నాడు నాతో. ప్ర‌సాద్‌గారు హార‌ర్ సినిమాల‌ను నిర్మిస్తారో లేదో అని అనుకున్నాం. కానీ ప్ర‌సాద్‌గారు వెంట‌నే ఒప్ప‌కున్నారు. బాపినీడుగారు చాలా స‌పోర్ట్ చేశారు. ఈ జోన‌ర్ చాలా బావుంటుంద‌ని బాపినీడు అన్నారు. ఈ సినిమాకు ముందు సీమ సందులో అని టైటిల్ పెడ‌దామ‌ని అనుకున్నాం. అయితే మా నిర్మాత అందుకు ఒప్పుకోలేదు. ఆ త‌ర్వాతే ఈ టైటిల్‌ని ఫిక్స్ చేశాం. నేను న‌రేష్ ను మొద‌టి నుంచి హీరో అనే పిలుస్తాను. ఈ సినిమాలో చాలా బాగా చేశారు. డైమండ్ ర‌త్న‌బాబు, రాజు చాలా హెల్ప్ చేశారు. క్లైమాక్స్ లో శ్రీధ‌ర్ సీపాన హెల్ప్ చేశారు.

ర‌జిత మాట్లాడుతూ ``న‌రేశ్‌గారి కాంబినేష‌న్‌లో చాలా సినిమాలు చేశాను. ఈ సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. డైమండ్ ర‌త్న‌బాబుగారు చాలా మంచి డైలాగులు రాశారు. ఇందులో పోలీస్ క్యార‌క్ట‌ర్ చేశాను`` అని అన్నారు.

వ‌రుణ్ సందేశ్ మాట్లాడుతూ ``న‌రేశ్ ఇందులో స్టైలిష్‌గా ఉన్నాడు. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అని తెలిపారు.

హీరోయిన్లు మాట్లాడుతూ ``మా టీమ్ అంతా చాలా క‌ష్ట‌ప‌డి ఈ సినిమా చేశాం`` అని అన్నారు.

Glam gallery from the event

చ‌మ్మ‌క్ చంద్ర మాట్లాడుతూ ``ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశాను. డిఫ‌రెంట్‌గా ఉంటుంది. సంగీతం బావుంది`` అని చెప్పారు.

సాయికార్తీక్ మాట్లాడుతూ ``హార‌ర్ కామెడీ సినిమా ఇది. హిట్ జోన‌ర్ ఇది. నాగేశ్వ‌ర‌రావుగారు ఇప్ప‌టిదాకా కామెడీ చాలా చేశారు. తొలిసారి ఈ జోన‌ర్ చేశారు. మంచి సంగీతం కుదిరింది. న‌రేశ్‌గారితో నేను చేస్తున్న సినిమా ఇది`` అని అన్నారు.

న‌వీన్ చంద్ర మాట్లాడుతూ ``ఈ సినిమాలో న‌రేశ్ చాలా బాగా చేశారు. నాకు దెయ్య‌మంటే చాలా భ‌యం. కానీ న‌రేశ్ హార‌ర్ చేశాక దెయ్య‌మంటే భ‌యం పోయింది. ట్రైల‌ర్ చూశాక సినిమా చూసి న‌వ్వ‌లేక పొట్ట‌చ‌క్క‌ల‌వుతుందేమోన‌ని అనిపిస్తోంది`` అని తెలిపారు.

సుధీర్‌బాబు మాట్లాడుతూ ``ఈ టైటిల్ని చెప్ప‌వారు, వినేవారు న‌వ్వుతూనే ఉంటారు. ఎందుకంటే పాజిటివ్‌గా అనిపిస్తోంది. ట్రైల‌ర్స్ లో ఇంత ఎక్కువ న‌వ్వించిన ట్రైల‌ర్ ఇదే. సుడిగాడు సినిమాకు రిలీజ్‌కు ముందే ఎలా పాజిటివ్‌నెస్ వ‌చ్చిందో ఈ సినిమాకు కూడా అలాగే పాజిటివ్ బ‌జ్ వ‌స్తోంది`` అని చెప్పారు.

నాని మాట్లాడుతూ ``ఈ సినిమా ట్రైల‌ర్‌ను నాకు ముందే న‌రేశ్ చూపించాడు. చూడ‌గానే సినిమా సూప‌ర్‌హిట్ అని అనిపించింది. న‌రేశ్‌కి ఫ్రాంక్‌గా ఫీడ్‌బ్యాక్ చెప్తాను. సుడిగాడు చూసొచ్చి కాస్త రాంగ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చా. ఈ సినిమా ట్రైల‌ర్ చూడ‌గానే పాజిటివ్‌గా అనిపించింది. అమితాబ్‌బ‌చ్చ‌న్‌ని, ర‌జ‌నీకాంత్‌ని ఒకే సినిమాలో చూస్తే ఎంత కిక్ ఉంటుందో, న‌రేశ్‌ని, రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారిని చూస్తే అంతే కిక్ ఉంటుంది. ఈ సినిమా హిట్ అవుతుంద‌ని నేను క‌న్‌ఫ‌ర్మ్ చేసుకోవ‌డానికి కార‌ణం ఆయ‌న ఇంట్లో అదృష్టం పుట్టింది. ఆ పాజిటివ్ ఎన‌ర్జీ న‌రేశ్ చుట్టుప‌క్క‌లా క‌నిపిస్తోంది`` అని చెప్పారు.

న‌రేశ్ మాట్లాడుతూ ``బండి రమేశ్‌గారు చేసిన సాయం మ‌ర్చిపోలేం. మంచి టైటిల్‌ని సూచించారు. నాగేశ్వ‌ర‌రెడ్డిగారితో 2006లో సీమ‌శాస్త్రి, 2011లో సీమ‌ట‌పాకాయ్ చేశాం. ఆ రెండు సినిమాల‌కు ఒకే సిట్టింగ్‌లో క‌థ‌ను ఓకే చేశాం. ఈ సినిమాను కూడా అంతే. ఈ జాన‌ర్ మా ఇద్ద‌రికీ కొత్త. క‌ష్ట‌ప‌డి చేశాం. అంద‌రూ ఇష్ట‌ప‌డి చేశాం. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారి ద‌గ్గ‌ర నేను చిన్న‌ప్ప‌టి నుంచి చాలా నేర్చుకుంటున్నాను. ఈ సినిమాతో చాలా నేర్చుకున్నా. శ‌త‌మానం భ‌వ‌తి పాట చాలా బావుంది. ఈ నెల 11న సినిమా విడుద‌లవుతుంది. పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను`` అని తెలిపారు.

ప్ర‌గ‌తి మాట్లాడుతూ ``ఈ సినిమాలో నేను చాలా వైవిధ్య‌మైన సినిమా చేశాం`` అని తెలిపారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ ``ఈ సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది`` అని చెప్పారు.

అల్లరి నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్‌, ధన్‌రాజ్‌, ప్రగతి, రజిత, అమిత్‌, టార్జాన్‌, జయవాణి, అపూర్వ, ఆజాద్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: డైమండ్‌ రత్నబాబు, పాటలు: భాస్కరభట్ల, డాన్స్‌: రాజుసుందరం, గణేష్‌, దినేష్‌, ఫైట్స్‌: సుంకర రామ్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved