pizza
Kannullo Nee Roopame trailer launch
`క‌న్నుల్లో నీ రూప‌మే` ట్రైల‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 March 2017
Hyderaba
d

The trailer of talented hero Nandu and Banglore beauty Tejaswini prakash starrer “Kannulo Nee Rupamey,” launched by noted producer Sindurapuvu Krishna reddy. Noted music directors R.P.Patnayak, Sai Kathik, Hero Nandu and total cast and crew of the movie also attend the trailer launch event conducted recently by makers of the movie in Prasad labs. New Director Bix Erusadla is taking care of this project. After watching the trailer my mind set has changed and I got confidence that director bix may handle project well, I hope that the project give entertainment to the audience said chief guest of the programme. Touted to be an comedy entertainer laced with romance. Other than the main lead, 30 years prudhvi, Posani Krishna murali, venu, fish venkat are also playing key roles in the movie. Young music composer saketh komanduri to render the soundtrack for the film. Renowned cinematographer Subash Donthi is handling the camera and Bhaskar Bhasani is bankrolling the film under ASP Creative arts.

`క‌న్నుల్లో నీ రూప‌మే` ట్రైల‌ర్ విడుద‌ల‌

ఇ.రాజ‌మౌళి స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.ఎస్‌.పి.క్రియేటివ్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై భాస్కర్ భాసాని నిర్మాత‌గా బిక్స్ ద‌ర్శ‌క‌త్వంలో నందు, తేజ‌స్వి ప్ర‌కాష్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం `క‌న్నుల్లో నీ రూప‌మే`. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో జ‌రిగింది. సింధూర పువ్వు కృష్ణారెడ్డి, ఆర్.పి.ప‌ట్నాయ‌క్‌, సాయికార్తీక్‌, సురేష్ కొండేటి విడుద‌ల చేశారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో జ‌బ‌ర్‌ద‌స్త్ రాము, హీరో నందు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాకేత్‌, ర‌చ్చ‌ర‌వి, నిర్మాత భాస్క‌ర బాసాని త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా...

సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ - ``ట్రైల‌ర్ చూస్తుంటే యూత్‌ఫుల్ స్టోరీయే కాకుండా మంచి థ్రిల్ల‌ర్ స్టోరీగా అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడు బిక్స్ మంచి ప్యాష‌నేట్ డైరెక్ట‌ర్‌. యు.కెలో ఉద్యోగం చేస్తున్నా కూడా సినిమా అంటే ఆస‌క్తి ఉండ‌టంతో ఉద్యోగాన్ని వ‌దిలేసి చేసిన సినిమా ఇది. అలాగే మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉన్న డైరెక్టర్‌లా క‌న‌ప‌డుతున్నాడు. హీరో నందు మంచి అంద‌గాడు. ఈ సినిమా నందు స‌హా టీంకు మంచి స‌క్సెస్‌ను కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ - ``మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాకేత్ నాకు చిన్న‌ప్ప‌ట్నుంచి తెలుసు. ఈ సినిమాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నందుకు ఈ సినిమా మంచి స‌క్సెస్‌ను ఇవ్వాలి`` అన్నారు.

రామాచారి మాట్లాడుతూ - ``బిక్స్‌. సాకేత్‌, నందుల‌కు ఈ సినిమా మంచి పేరు తేవాలి. ఈ స‌క్సెస్‌తో భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని మంచి సినిమాలు చేయాలి`` అన్నారు.

ఇ. రాజ‌మౌళి మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు బిక్స్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేశాం. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

సాయికార్తీక్ మాట్లాడుతూ - ``సాకేత్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్స్ అన్నీ బావున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి`` అన్నారు.

సాకేత్ మాట్లాడుతూ - ``నా కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతోనే నేను మ్యూజిక్ డైరెక్ట‌ర్ స్థాయికి ఎదిగాను. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేస్తాం. బిక్స్‌గారు మంచి క‌థ‌తో సినిమాను తెర‌కెక్కించారు`` అన్నారు.

నిర్మాత భాస్క‌ర్ బాసాని మాట్లాడుతూ - ``మా బ్యాన‌ర్‌లో వ‌స్తున్న తొలి సినిమా ఇది. సినిమా ఫ‌స్ట్ కాపీ వ‌చ్చింది. అవుట్‌పుట్ బాగా వ‌చ్చింది. డైరెక్ట‌ర్ బిక్స్ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. సాకేత్ మ్యూజిక్ ఎక్స‌లెంట్‌గా ఇచ్చారు. సినిమా ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

ద‌ర్శ‌కుడు బిక్స్ మాట్లాడుతూ - ``మంచి ల‌వ్ స్టోరీ. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా అన్నీ ఎలిమెంట్స్‌తో సినిమాను తెర‌కెక్కించాను. సాకేత్, నందు రెండు క‌ళ్ళ‌లా సినిమాకు స‌పోర్ట్ చేశారు. స‌పోర్ట్ చేసిన మిగ‌తా ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్‌కు థాంక్స్‌`` అన్నారు.

నందు మాట్లాడుతూ - ``ఈ సినిమాలో బాయ్ నెక్ట్స్ డోర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. నా కెరీర్‌కు మంచి పుష్ ఇచ్చే సినిమా అవుతుంది. సాకేత్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ద‌ర్శ‌కుడు బిక్స్‌గారు ఎక్స్‌పీరియెన్స్‌డ్ డైరెక్ట‌ర్‌లా సినిమాను చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved