నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా, నిత్య, శ్రావ్య హీరోయిన్లుగా నటించిన చిత్రం `నందిని నర్సింగ్ హోమ్`. ఎస్.వి.సి.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పి.వి.గిరి దర్శకత్వంలో రూపొందింది. రాధాకిషోర్.జి, బిక్షమయ్య సంగం నిర్మాతలు. ఈ సినిమా అక్టోబర్ 21న విడుదలవుతుంది.ఈ సందర్భంగా బుధవారం చిత్రయూనిట్ ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో....
సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ - మా కుంటుంబంలో మొదటితరంలో నేను, విజయనిర్మల సినిమాల్లో నటిస్తే, రెండో తరంలో నరేష్, మహేష్, రమేష్, సుధీర్‌బాబు నటించారు. ఇప్పుడు మూడో తరం హీరోల్లో నవీనే మొదట ఇంట్రడ్యూస్ అవతున్నాడు. డెఫనెట్‌గా నందిని నర్సింగ్ హోం బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ అవుతుంది. సినిమా ఆడియో విడుదలైన వారం పదిరోజులకు ప్లాటినం డిస్క్ వేడుకను జరుపుకోవడం సంతోషం. ప్రేక్షకులు, అభిమానులు నవీన్‌ను ఆశీర్విదించి, సినిమాను పెద్ద హిట్ చేయాలి`` అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ - ``నవీన్ ఎడిటర్‌గా నాకు మంచి పరిచయం. సాయిధరమ్ తేజ్, నవీన్ మంచి స్నేహితులు. ఇద్దరూ లావుగా ఉండేవారు. హీరోలు కావాలనుకున్న వీరు బాగా కష్టపడ్డారు. తేజు సక్సెస్‌ఫుల్ హీరో అయ్యాడు. ఇప్పుడు నవీన్ వంతు వచ్చింది. డెఫనెట్‌గా నందిని నర్సింగ్ హోం నవీన్‌కు మంచి సినిమా అవుతుందని భావిస్తున్నాను`` అన్నారు.
విజయ నిర్మల మాట్లాడుతూ - ``నవీన్ హీరో కంటే ముందు మంచి ఎడిటర్ అయ్యాడు. హీరో కావాలనుకునే ముందు 130 కిలోలున్న నవీన్, హీరో కావాలనుకుని బరువు తగ్గి సిక్స్ ప్యాక్ చేశాడు. మా ఫ్యామిలీ నుండి నవీన్ హీరోగా రావడం ఎంతో ఆనందంగా ఉంది`` అన్నారు.
నరేష్ మాట్లాడుతూ - ``మహేష్ చేతుల మీదుగా ఆడియో విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాలో మూడు పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ట్రైలర్స్, సాంగ్స్‌కు యూత్‌లో మంచి హైప్ వచ్చింది. ట్రెండింగ్‌లో ఉంది. సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని భావిస్తున్నాం`` అన్నారు.
దర్శకుడు పి.వి.గిరి మాట్లాడుతూ - ``సినిమా చాలా బాగా వచ్చింది. దిల్‌రాజుగారు సినిమాను చూసి అప్రిసియట్ చేశారు`` అన్నారు.
నవీన్ విజయ్‌కృష్ణ మాట్లాడుతూ - ``సినిమా మ్యూజిక్ హిట్ కావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నిన్నే సాంగ్ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆడియో విన్నవాళ్లందరూ బావుందంటున్నారు. అచ్చు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కుదిరింది. సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురుచూస్తున్నాను`` అన్నారు.
డా.మోహన్‌బాబు మాట్లాడుతూ - ``కృష్ణగారు చాలా గొప్ప సంస్కారవంతుడు. అలాగే విజయనిర్మలగారితో మా కుంటుంబంలో మంచి అనుబంధం ఉంది. కృష్ణ, విజయనిర్మల కుటుంబానికి చెందిన నరేష్ తనయుడు నవీన్ మాకు బిడ్డలాంటి వ్యక్తి. వండర్ ఫుల్ టెక్నిషియన్. నవీన్ చాలా లావుగా ఉండేవాడు. హీరో కావాలనుకుని తగ్గి స్లిమ్ అయ్యాడు. సినిమా గొప్ప విజయం సాధించి వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఉండాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
దర్శకరత్న డా.దాసరి నారాయణరావు మాట్లాడుతూ - ``అక్టోబర్ 21న నందిని నర్సింగ్ హోం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండస్ట్రీలో మూడు షిఫ్ట్స్‌లో పనిచేసిన హీరో కృష్ణ, అలాగే విజయనిర్మల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలంటే చాలా ప్యాషన్‌తో పనిచేసిన వ్యక్తి. మోహన్‌బాబు, నిర్మాత దిల్ రాజు ఇలా ఇక్కడున్న అందరూ కష్టపడి పైకొచ్చిన వారే ఇంత మంది నవీన్ ను ఆశీర్వదించడానికి వచ్చాం. నవీన్ హీరో కావాలనుకుని బరువుతగ్గి సన్నబడ్డాడు. నవీన్ యాక్ట్ చేసిన నందని నర్సింగ్ హోం ఆడియో పెద్ద హిట్ అయ్యింది..సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్రయూనిట్ సభ్యులకు దాసరి నారాయణరావు, మోహన్‌బాబు ప్లాటినమ్ డిస్క్ షీల్డ్స్‌ను అందించారు.