27 June 2017
Hyderabad
తెలంగాణ స్టేట్ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎఫ్‌టీవీ అండ్ టీడీసీ) చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత పుస్కూర్ రామ్మోహన్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, కెమెరామెన్–నిర్మాత–దర్శకుడు ఎస్. గోపాల్‌రెడ్డి, నిర్మాతలు పి. సత్యారెడ్డి, లంకాల బుచ్చిరెడ్డి, ‘మల్టీడైమెన్షన్’ వాసు తదితర ప్రముఖులు ఆయన్ను కలసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ – ‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఓ మంచి ఆలోచన కలిగిన వ్యక్తిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. టీఎస్‌ఎఫ్‌టీవీ అండ్ టీడీసీ చైర్మన్‌గా పుస్కూర్ రామ్మోహన్ నియామకం తెలుగు సినిమా అభివృద్ధికి ఎంతో దోహద పడుతుంది’’ అన్నారు.


