pizza

“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta

Article #5: Sai Kumar
ఆర్టికల్ #5: సాయికుమార్ గారు

You are at idlebrain.com > news today >

20 August 2025
Hyderabad

“Every person is a walking story” - Mayasabha articles
“ప్రతి మనిషీ నడయాడే కథ!” – మయసభ వ్యాసాలు
- Deva Katta


Introduction
Behind Mayasabha’s success are underdogs whose grit and passion kept them chasing cinema against all odds. This article series celebrates those journeys—how each cast and crew member was chosen, the struggles that shaped them, and how one project’s nationwide acclaim became the turning point of their careers. Because every person you meet is a walking story—sometimes all it takes is one opportunity for the world to listen.

మయసభ విజయం వెనకున్న సైన్యం, సంవత్సరాలుగా కష్టాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ సినిమా తప్ప వేరే జీవితమే లేదని బతుకుతున్న అండర్‌డాగ్స్. వారి ప్రయాణానికి నివాళిగా ఈ వ్యాసాలు రాస్తున్నాను. వారిని తీర్చిదిద్దిన జీవిన పోరాటాలు, మయసభలో వారి ఎలా ఎంపిక, ఈ విజయంలో వారి పాత్ర ఈ వ్యాసాల్లో ప్రధాన అంశాలు. ప్రతి మనిషి ఒక నడిచే కథ—ఆ కథని ప్రపంచం వినడానికి, ఒకే ఒక్క అవకాశం చాలు.

Don’t encourage piracy. Please watch #Mayasabha only on SonyLiv

There are actors who perform... and then there are actors who transform the very scene they enter. Saikumar gaaru is one of those rare few for me.

I still remember the first time I approached him for Prasthanam. The script was hinged entirely on the gravity of the central character—Lokanath Naidu. It was just my second film. He was already a legend. His voice alone could command attention across a thousand-seat theatre. But what struck me most wasn’t his aura—it was his humility. From that moment, the trust we developed throughout Prasthanam, Autonagar Surya and Mayasabha became a truly magical collaboration.

His portrayal of Lokanath Naidu in Prasthanam was nothing short of iconic. Every line he delivered, every glance he threw, carried years of inner conflict, political cunning, and emotional turmoil. It’s no exaggeration to say Prasthanam wouldn’t have been what it became without Saikumar gaaru. He didn’t just carry the film—he gave it its soul.

But more than that film, what stayed with me was the trust. That silent, strong, and steady belief he placed in me as a director.

Fast forward to Mayasabha. When the story started to take shape, I didn’t imagine anyone else for the role of RCR – Rayapati Chakradhar Rao—a legendary matinee idol whose godlike image among the masses transforms into a political tsunami in Andhra Pradesh’s fictional history. We needed someone who could bring mass charisma, emotional gravitas, and an almost divine aura to a character designed to sway the public imagination. The moment I reached out to him, it felt like we were picking up from where we left off.

Despite the time that passed, his discipline, dedication, and above all, his passion for storytelling were intact. He came to the set with the same intensity, the same fire. And yet, there was a quiet evolution in his performance—he was even more nuanced, more economical with his gestures, and more explosive when the moment demanded it.

A few standout moments from Mayasabha that I’ll never forget:

1. His intro scene towards the end of Episode 7: We originally planned it to be a single shot with the camera behind him in a convertible car, bringing him out of an ocean of fans toward the guest chair. Due to time constraints and crowd management issues, we also placed a tele-camera on track to follow him throughout. We had only one hour to nail it and live with whatever we got, because the setup and coordination for such shots usually take at least 60–90 minutes. The head shake he added as a surprise improv felt brilliant as the take progressed. I asked him what his thought process was—he simply answered, “I was reacting to get rid of the flowers on my head and used it as an attitude of the character as well.” Music director Shaktikanth made that moment iconic by adding a lion’s roar with a perfectly timed pause. That’s when I realised: these are the moments that last longer than any story, script, or shot. They just have to happen magically on location—and they can happen only when the actor truly lives the character more than even the writer or director.

2. The million-dollar glance: In the hospital scene—after his son-in-law (KKN) suffers a miserable defeat in the elections opposing him—he patiently waits until his daughter and son-in-law have their moment with the newborn baby. Then he quietly stands, holding a gift cover—containing a party membership receipt and an invitation to join the party. The glance he throws before walking up to his son-in-law, making him feel comfortable with the defeat and encouraging him to look forward to a future within the family and within his party—to me, that is a million-dollar glance that cannot be expressed in words. Working with Saikumar gaaru again after almost a decade felt like a full circle. Only now, we had both changed—seasoned, perhaps a little more patient, but still chasing that same magic.

Actors like him are rare—not just because of talent, but because of the respect they have for the craft. He never rushes a scene. He listens. He watches. And when he performs, you feel like you’re witnessing not a performance—but a memory being created in real time. It’s a privilege to have his name associated with Prasthanam, Autonagar Surya and Mayasabha—three projects that defined different phases of my creative journey. His contribution elevated not just the scenes he was in, but the entire ensemble around him.
Wishing Saikumar gaaru many more roles that honour his calibre.

Because when he speaks... a nation listens.

Kudos to Saikumar gaaru and his commitment to cinema! – “Every person is a walking story.”

Don’t encourage piracy. Please watch #Mayasabha only on SonyLiv

“ప్రతి మనిషీ నడయాడే కథ!” – ఆర్టికల్ #5: సాయికుమార్ గారు

యాక్టర్ లు చాలామంది ఉన్నారు... కానీ ఒక్కసారి ఫ్రేమ్‌లోకి అడుగుపెడితే ఆ సీన్‌ మొత్తం క్యారీ చేసే యాక్టర్ లు చాలా తక్కువ. నా దృష్టిలో సాయికుమార్ గారు అలాంటి అరుదైన నటుల్లో ఒకరు.

ప్రస్థానం కోసం మొదటిసారి ఆయనను కలిసిన రోజు ఇప్పటికీ గుర్తుంది. ఆ స్క్రిప్ట్ మొత్తం లోకనాథ్ నాయుడు అనే కెరెక్టర్ మీదే ఆధారపడింది. అది నా రెండో సినిమా. ఆయన అప్పటికే ఒక లెజెండ్. ఆయన వాయిస్ ఒక్కటే వెయ్యి మందితో నిండిన థియేటర్ సైలెంట్ చేస్తుంది, శాసిస్తుంది. కానీ నాకు ఆశ్చర్యాన్ని కలిగించినది ఆయన aura కాదు, ఆయన వినయం. ఆ మౌన నమ్మకం, స్పష్టత, director మీద పెట్టిన belief... ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, ఇప్పుడు మయసభ వరకు మా journeyని ఒక మేజికల్ కొలాబరేషన్ గా మార్చింది.

ప్రస్థానంలో ఆయన నటించిన లోకనాథ్ నాయుడు పాత్ర ఒక iconic పాత్రగా నిలిచిపోయింది. ప్రతి డైలాగ్, ప్రతి చూపులో చాలా ఏళ్ల కింద చేసిన ఒక దారుణం, పశ్చాత్తాపంతో కొట్టుమిట్టాడుతున్న భావాలు కనిపించేవి. ప్రస్థానం ఆ రేంజ్‌లో నిలవడం అంటే... సాయికుమార్ గారు లేకుండా అసాధ్యం. ఆయన కేవలం సినిమాలో నటించలేదు – ఆ సినిమాకు ఆత్మ నిచ్చారు.

ఆ సినిమాకన్నా ఎక్కువగా నా జ్ఞాపకాల్లో మిగిలిపోయింది– ఆయన నాకిచ్చిన ఆత్మ విశ్వాసం, నా మీద పెట్టిన నమ్మకం.

మయసభ విషయానికొస్తే... కథ రూపం దిద్దుకుంటున్న దగ్గరినుంచి RCR – రాయపాటి చక్రధర్ రావు అనే పాత్రకి ఇంకెవ్వరూ మా దృష్టికి రాలేదు. RCR అంటే ప్రజలు పూజించే ఒక matinee idol, ఒక గాడ్లీ ఫిగర్... రాజకీయాల్లో ఏకంగా ఒక తుపానుగా మారిన ఒక ఇమేజ్. అలాంటి పాత్రకి అవసరమయ్యే mass charisma, emotional gravitas, అలాగే దైవసదృశ aura – ఈ మూడింటిని తీసుకురాగల నటుడు సాయికుమార్ గారే.

మయసభ కోసం కలిసిన రోజు, మా ప్రయాణం ఎక్కడ వదలి పెట్టామో అక్కడ్నుంచే మొదలుపెడుతున్నాం అనిపించింది.
సమయం ఎంత గడిచినా, ఆయన discipline, dedication, storytelling పట్ల ఉన్న passion మాత్రం చెక్కు చెదరలేదు. అదే fire సెట్స్‌కి వచ్చేవారు. ఈసారి మరింత subtle గా, gestures తక్కువగా, expressionsలో in-depth గా – కొత్త అప్రోచ్ కనిపించింది.

మయసభలో ఆయన చేసిన కొన్ని unmissable మొమెంట్స్:

1. ఎపిసోడ్ 7 చివర్లో ఆయన intro సీన్:
ప్లాన్ ప్రకారం, ఓ convertible కార్‌లో, వెనకాల కెమెరా పట్టుకుని, జన సముద్రాన్ని చీల్చుకుంటూ, ఫ్యాన్స్ మధ్యనుండి గెస్ట్ చైర్‌కి ఆయన రీచ్ అవడం ఒక సింగల్ షాట్ లా తీద్దాం అనుకున్నాం. కానీ time constraints వల్ల, crowd handling సమస్యల వల్ల, ఒక ట్రాక్‌పై ఇంకో tele-camera కూడా పెట్టాం. అన్నీ setup చేసి perfect timingతో తీసేందుకు 60–90 minutes పడుతుంది. ఆ రోజు ఉన్న హెవీ వర్క్ లోడ్ వల్ల, ఈ షాట్ ఒకే టేక్ లో ఒకే అవ్వాల్సిందే. టేక్ మధ్యలో ఆయన spontaneous గా ఒక head shake ఆడ్ చేశారు– అది చాలా మేజికల్ గా అనిపించింది. అడిగినప్పుడు– జస్ట్ తలమీదున్న పువ్వులు తొలగించుకుంటూ దాన్ని ఒక ఆటిట్యూడ్ గా మార్చుకున్నాను అన్నారు. ఆ సీన్‌ను music director శక్తికాంత్ గారు elevate చేసిన విధానం – perfectly paused lion roar add చేయడం – ఆ entire momentని iconic గా మార్చింది. కథలు, screenplay కన్నా ఎక్కువగా ఇలాంటి మోమెంట్స్‌నే audience ఎక్కువ గుర్తుంచుకుంటారు. ఇవన్నీ spontaneous గా, actor characterలో ఒదిగిపోయినప్పుడు మాత్రమే జరుగుతాయి.

2. "Million-dollar glance" – Hospital సీన్:
తన అల్లుడు (KKN) ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత hospital లో newborn babyని చూసేందుకు వస్తాడు. తన కూతురు, అల్లుడు బిడ్డతో తన పలకరింపులు జరిగే వరకు వెయిట్ చేసి, తర్వాత ఒక gift కవర్ (లోపల party membership receipt, partyకి ఆహ్వానం) తో నెమ్మదిగా లేచి, తన అల్లుడి వైపు చూసే ఒక్క చూపు – అది ఓ మాటలతో చెప్పలేని expression. ఓడిపోయిన అల్లుడికి dignity ఇవ్వడం, అంతే కాదు... పార్టీతోపాటు ఫ్యామిలీలోకి తిరిగి రమ్మనే ఆ పిలుపు... నిజంగా million-dollar glance.

దాదాపు దశాబ్దం తర్వాత మళ్ళీ సాయికుమార్ గారితో పని చేయడం ఒక full circle complete చేసినట్టే. మేమిద్దరం మారిపోయాం –more mature, but still chasing the same magic. ఇలాంటి నటులు చాలా అరుదు – కేవలం actingకి కాదు, craft మీద వాళ్లకున్న గౌరవం వల్ల.

అయన ఎప్పుడూ sceneని రష్ చేయరు. తానేమి చెయ్యాలో observe చేస్తారు, జాగ్రత్తగా వింటారు. షాట్ చెప్పగానే, performance కాదు – ఒక జీవన స్మృతినే తెర మీద ఆవిష్కరిస్తారు.

ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, మయసభ – ఈ మూడు ప్రాజెక్టులూ నా కెరీర్‌లో వేరే వేరే దశల్లో జరిగినవి. వాటిలో సాయికుమార్ గారి పేరు ఉండటం నా అదృష్టం. ఆయన పాత్రల్లో నంచడమే కాదు, చుట్టూ ఉన్న ప్రతి నటుడికి ఒక పెద్ద భరోసా.

సాయికుమార్ గారికి ఇంకా ఇంకా గొప్ప పాత్రలు రావాలని కోరుకుంటున్నాను.

ఆయన ఒక వెల్ రిటెన్ పాత్రలో గర్జిస్తే – దేశమే తిరిగి చూస్తుంది.

బిగ్ సెల్యూట్ టు సాయి సర్! - “ప్రతి మనిషీ నడయాడే కథ!”

పైరసీ ని అరికట్టండి. సోనీ లివ్ లో “మయసభ” చూడండి!

- Deva Katta

Other articles from "Mayasabha - Every Person is a Walking Story series:

4.Shatru
3.Tanya Ravi Chandran
2.Chaitanya Rao
1.Aadhi Pinisetty



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved