కార్తీ, సయేషా హీరో హీరోయిన్ గా పాండిరాజ్ దర్శకత్వం వహించిన "చినబాబు" చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీలో యాక్షన్ తో పాటు కామెడీ ఉండబోతోంది. కార్తీ ఈ మూవీలో రైతు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను హీరో సూర్య తో పాటు నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి "2డి ఎంటర్టైన్మెంట్స్" బ్యానర్ మరియు "ద్వారకా క్రియేషన్స్" బ్యానర్ లో నిర్మించడం జరిగింది. ఈరోజు వైజాగ్ లో చినబాబు సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కు సూర్య తో పాటు కార్తీ, చిత్ర యూనిట్ సభ్యులు అందరు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా భానుప్రియ మాట్లాడుతూ... "చినబాబు సినిమా ద్వారా మీ అందరిని కలవడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ పాండిరాజ్ ఈ సినిమా కోసం అందరి దగ్గరనుండి మంచి నటనను రాబట్టుకున్నారు. కార్తీ బాగా నటించారు" అన్నారు.
సత్యరాజ్ మాట్లాడుతూ...
అందరికి నమస్కారం. నాకు తెలుగు మాట్లాడడం రాదు కావున పేపర్ పై నా స్పీచ్ రాసుకొని వచ్చాను. 1986 లో నేను హీరోగా చేసిన సినిమా షూటింగ్ అధికభాగం వైజాగ్ లో జరిగింది. ఇప్పుడు నేను నటించిన సినిమా ఆడియో వైజాగ్ లో జరగడం సంతోషంగా ఉంది. సూర్య, కార్తీ మంచి నటులు ఈ సినిమాతో సూర్య సక్సెస్ ఫుల్ నిర్మాత కాబోతున్నారు. డైరెక్టర్ పాండిరాజ్ ఈ సినిమాలో అందరికి మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇచ్చారు. సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను" అన్నారు.
డైరెక్టర్ పాండిరాజ్ మాట్లాడుతూ...
చినబాబు సినిమాపై తమిళ్ లో ఎంతటి అంచనాలు ఉన్నాయో తెలుగులో అంతే అంచనాలు ఉన్నాయి. సూర్య, కార్తీ ఈ స్క్రిప్ట్ ఓకే చెయ్యడంతోనే ఈ సినిమా సగం సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో యాక్షన్, ఫ్యామిలీ, లవ్ ఉన్నాయి. అందరికి నచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతోంది.
రచయిత శశాంక్ వెన్నెలకంటి మాట్లాడుతూ... "చినబాబు సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. సాంగ్స్ బాగున్నాయి. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న మిరియాల రవీందర్ రెడ్డి గారికి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్న" అన్నారు.
నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... "వైజాగ్ ప్రజలకు నమస్కారం. ఇక్కడ ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకు స్పెషల్ థాంక్స్. నేను మీలాగే ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. వ్యవసాయం చెయ్యాలని తండ్రి చెబితే కొడుకు తన తండ్రి కోసం రైతుగా విజయం సాధిస్తాడు ఈ సినిమాలో. రైతు పాత్రలో కార్తీ అద్భుతంగా నటించారు. డైరెక్టర్ ఈ సినిమాను చక్కగా తీశారు. సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను" అన్నారు.
హీరో కార్తీ మాట్లాడుతూ... "నన్ను అన్నయ్యను సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కృతజ్ఞతలు. రైతును మర్చిపోతున్న సమయంలో రైతును గుర్తుచేసుకొనే విధంగా సినిమా చెయ్యడం గర్వంగా ఉంది. అన్నయ్య సూర్య ఈ సినిమా చూసి మెచ్చుకోవడం జరిగింది. జులై లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరు కలిసి ఉండాలని చెప్పే సినిమా ఇది. ఈ సినిమా చూసాక మీరు మీ అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లికి ఫోన్ చేసి మాట్లాడుతారు" అన్నారు.
హీరో సూర్య మాట్లాడుతూ... "తెలుగువారందరికి నమస్తే. రైతుల గురించి చినబాబు సినిమాను నిర్మించడం జరిగింది. అందరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ప్యాషన్ తో నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. తమ్ముడితో సినిమా చెయ్యడం కల నిజం అయినట్లు ఉంది. సింగం3 సినిమా షూటింగ్ సమయంలో వైజాగ్ వచ్చాను అప్పుడు మీరు చూపించిన ప్రేమ మర్చిపోలేను. నా కంటే కార్తీ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్న. కలలు కనండి వాటిని సాధించండి. పాజిటివ్ గా ఉంటె అన్నీ సాధ్యం అవుతాయి. చినబాబు అందరికి నచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది" అన్నారు.
సాంకేతిక నిపుణులు:
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : పాండిరాజ్
నిర్మాతలు: సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి
బ్యానర్స్: 2డి ఎంటర్టైన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్
సహా నిర్మాతలు: సి.హెచ్. సాయి కుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్.
సంగీతం: డి.ఇమాన్
కెమెరామెన్: వేల్ రాజ్
ఎడిటింగ్: రుబన్