pizza
Pandem Kodi 2 music launch
'పందెంకోడి 2' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


14 October 2018
Hyderabad

మాస్‌ హీరోగా విశాల్‌ కథానాయకుడిగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పందెంకోడి 2'. వీరిద్దరి కలయికలో 13 సంవత్సరాల క్రితం వచ్చిన 'పందెంకోడి' విశాల్‌ కెరీర్‌లోనే బిగెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మళ్ళీ విశాల్‌, లింగుస్వామి కాంబినేషన్‌లో వస్తోన్న 'పందెంకోడి 2' చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. 'పందెం కోడి 2' మాస్‌ హీరో విశాల్‌కి 25వ సినిమా కావడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కి, ట్రైలర్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతి లాల్‌ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. థియేట్రికల్‌ ట్రైలర్‌ను లక్ష్మీ ప్రసన్న విడుదల చేశారు. కొద్ది మంది రైతులకు విశాల్‌ ఆర్ధిక సాయాన్ని అందించారు. జాగర్లమూడి క్రిష్‌ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా...

బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''విశాల్‌, లింగుస్వామి, ఠాగూర్‌ మధు, కీర్తిసురేశ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ అందరికీ అభినందనలు. సినిమా పెద్ద హిట్‌ కావాలి'' అన్నారు.

లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ - ''వినాయక్‌ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేస్తే ఎలా ఉంటాయో.. లింగుస్వామి మధురై బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేస్తే అలా ఉంటాయి. తను డైరెక్ట్‌ చేసిన రన్‌, ఆవారా, పందెంకోడి సినిమాలు ఎంత పెద్ద సక్సెస్‌ను సాధించాయో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దసరాకు 'పందెంకోడి 2'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందరికీ డబుల్‌ ధమాకా అవుతుంది'' అన్నారు.

ఆకుల శివ మాట్లాడుతూ - ''నేను సినిమా చూశాను. ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. విశాల్‌గారి పెర్‌ఫార్మెన్స్‌ పీక్స్‌లో ఉంటుంది. ఇంటర్వెల్‌.. క్లైమాక్స్‌లో విశాల్‌ నటన బెస్ట్‌గా ఉంటుంది. లింగుస్వామిగారి డైరెక్షన్‌ అంటే నాకు ఇష్టం. ఆయన టేకింగ్‌, మేకింగ్‌ నాకెంతో ఇష్టం. మాట కోసం రామాయణం జరిగింది. ఆట కోసం మహాభారతం జరిగింది. తండ్రికిచ్చిన మాట కోసం వేట కొడవలి చేతిలో ఉన్న.. శత్రువు అడుగు దూరంలో ఉన్న కనికరం చూపించే క్యారెక్టర్‌ను విశాల్‌గారు పోషించారు. ఈ దసరాకు సినిమా బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలబడుతుంది'' అన్నారు.

కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ - ''ఠాగూర్‌ మధుకి ఆల్‌ ది బెస్ట్‌. మాస్‌ సినిమాలకు ఉన్న ఫాలోయింగ్‌, కమర్షియల్‌ వేల్యూస్‌ వేరుగా ఉంటాయి. కాబట్టి ఏ నిర్మాత అయిన మాస్‌ సినిమాలు చేయాలనుకుంటాడు. విశాల్‌, లింగుస్వామి, కీర్తిసురేశ్‌, వరలక్ష్మి సహా ఎంటైర్‌ యూనిట్‌కి అభినందనలు'' అన్నారు.

లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ - ''విశాల్‌ 25వ సినిమా 'పందెంకోడి 2'కి అభినందనలు. లింగుస్వామిగారి డైరెక్షన్‌కి నేను పెద్ద అభిమానిని. కీర్తిసురేశ్‌ మన అమ్మాయి.. వరలక్ష్మి లుక్‌ చాలా బావుంది. తన కోసమైనా ఈ సినిమా చూస్తాను. పండగకి పర్‌ఫెక్ట్‌ మూవీ'' అన్నారు.

జాగర్లమూడి క్రిష్‌ మాట్లాడుతూ - ''గొప్ప స్నేహితుడికి అర్థం విశాల్‌ అని చెప్పవచ్చు. నేను తనకు చాలా పెద్ద ఫ్యాన్‌ని. పొల్లాచ్చిలో కృష్ణం వందే జగద్గురుమ్‌ రెక్కీకి వెళ్లినప్పుడు యూనిట్‌కు ప్లేస్‌ ఉంది. అన్ని రూమ్స్‌ ఫుల్‌ అయిపోయాయి. నాకు ఒక రూమ్‌ కూడా లేదు. కారులోనే పడుకుందామని నిర్ణయించుకున్నా.. కానీ, సుందర్‌.సి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విశాల్‌ నన్ను చూసి తన రూమ్‌కి తీసుకెళ్లాడు. తన బెడ్‌ నాకు ఇచ్చేసి తను నేలపై పడుకోవడానికి రెడీ అయిపోయాడు. పురట్చి దళపతి(విప్లవ సేనానాయకుడు) అని విశాల్‌ను తమిళ ప్రేక్షకులు, అభిమానులు పిలుచుకుంటారు. ఆ పేరు పెట్టుకోవడానికి విశాల్‌కు అర్హత ఉంది. గొప్ప పర్సనాలిటీ. మంచి హృదయమున్న వ్యక్తి. పందెంకోడిని జి.కె.రెడ్డి, విక్రమ్‌ కృష్ణ నిర్మించారు. తెలుగులో పెద్ద హిట్‌ అయ్యింది. అప్పటి నుండి అందరూ విశాల్‌ సినిమాలను ఫాలో అవుతూనే ఉన్నారు. ఇక లింగుస్వామిగారంటే.. రేసీగా, యాక్షన్‌ ఫిలిమ్స్‌ను గొప్పగా అందించే దర్శకుడు. ఈ సినిమా 'పందెంకోడి' కన్నా.. రెండింతలు పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

వరలక్ష్మి శరత్‌కుమార్‌ మాట్లాడుతూ - ''పందెంకోడి 2 పాటలు విడుదలయ్యాయి. సంగీతం, ఆర్‌.ఆర్‌ చాలా బాగా వచ్చింది. కీర్తి గురించి చెప్పాలంటే.. తను గొప్ప నటి. మహానటిలో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో ఇంకా అద్భుతంగా నటించింది. విశాల్‌, కీర్తి సురేష్‌ కెమిస్ట్రీ బావుంది. భవాని అనే క్యారెక్టర్‌ను ఇచ్చిన లింగుస్వామిగారికి థాంక్స్‌. శక్తి అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు. తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న ఠాగూర్‌ మధుగారికి థాంక్స్‌'' అన్నారు.

కీర్తిసురేశ్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాలో నాపై నమ్మకంతో ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు లింగుస్వామిగారికి థాంక్స్‌. వరలక్ష్మి గ్రేట్‌ పెర్‌ఫార్మర్‌. తనతో నేను కలిసి నటించిన సీన్స్‌ ఈ సినిమాలో లేవు. కెమెరామెన్‌ శక్తికి ఈ సినిమాతో మంచి బ్రేక్‌ దొరుకుతుందని భావిస్తున్నాను. ఠాగూర్‌ మధుగారికి అభినందనలు. విశాల్‌.. మంచి స్నేహితుడు, మంచి మనసున్న వ్యక్తి, మంచి పెర్‌ఫార్మర్‌. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

డైరెక్టర్‌ లింగుస్వామి మాట్లాడుతూ - ''నేను, యువన్‌ శంకర్‌రాజా కాంబినేషన్‌లో చేసిన సినిమాలన్నీ హిట్టే. ఈ సినిమాకు కూడా చాలా మంచి సంగీతం అందించారు. సూపర్బ్‌ రీ రికార్డింగ్‌ అందించారు. కెమెరామెన్‌ శక్తి.. అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. రాజేశ్‌ ఎ.మూర్తి తెలుగు సినిమాలా అనువాదం చేయించారు. అలాగే ఆకుల శివగారికి థాంక్స్‌. ఠాగూర్‌ మధుగారు తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళంలో కచ్చితంగా సినిమా పెద్ద హిట్‌ అవుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాలో వరలక్ష్మి పెద్ద రౌడీ పాత్రలో నటించారు. రేపు సినిమా చూస్తే ఆమె నటనను అందరూ మెచ్చుకుంటారు. మహానటి చూసిన నేను తనకు పెద్ద ఫ్యాన్‌ అయ్యాను. పందెంకోడిలో మీరా జాస్మిన్‌ ఎలా చేసిందో దాని కంటే ఓ మెట్టు ఎక్కువగానే కీర్తి నటించారు. విశాల్‌ నా హీరో. నాకు సోదరుడితో సమానం. తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా, నడిగర్‌ సంఘం కార్యదర్శిగా ఉన్నారు. ఇంకా ఆయన ఉన్నత స్థాయికి చేరుకోవాలి. దర్శకుడిగా నేనేం అడిగానో దాన్ని నిర్మాతగా ఆయన సమకూర్చారు. పందెంకోడి 3 కూడా మా కాంబినేషన్‌లో చేయాలనుకుంటున్నాం. నా కెరీర్‌లో పందెంకోడి చిత్రం చాలా పెద్ద హిట్‌. నేను చేసిన సినిమాలన్నీ తెలుగులో కూడా మంచి సక్సెస్‌లయ్యాయి. నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్‌'' అన్నారు.

హీరో విశాల్‌ మాట్లాడుతూ - ''నాన్న జి.కె.రెడ్డిగారు.. అన్నయ్య విక్రమ్‌ కృష్ణగారి వల్లే ఓ నటుడిగా మీ ముందు నిలబడి ఉన్నాను. నేను గర్వంగా ఉన్నాను. ఒక నటుడిగా.. ఇది నా 25వ సినిమా. పందెంకోడి నా రెండో సినిమా. మామూలు హీరోని యాక్షన్‌ హీరోగా నిలబెట్టిన సినిమా. పందెంకోడి ప్రారంభించే ముందు నేను 25 సినిమాలు చేస్తానని అనుకోలేదు. మళ్లీ నేను, లింగుస్వామి కలిసి 13 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా పందెంకోడి 2 చేయడం నిజంగా దేవుడి ఆశీర్వాదమే. ఈ సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్‌ ఉంటుందో.. కీర్తిసురేశ్‌, వరలక్ష్మిలకు అంతే ప్రాముఖ్యత ఉంది. సినిమా చూశాను. వరలక్ష్మి ఎక్స్‌ట్రార్డినరీగా చేసిందని, తర్వాత కీర్తి సురేశ్‌ అద్భుతంగా చేసిందని.. తర్వాత లింగుస్వామి సినిమాను అద్భుతంగా మలిచారని.. సినిమా చూసిన ప్రేక్షకులు అంటారు. వీరందరి తర్వాతే నన్ను గుర్తుకు తెచ్చుకుంటారు. యువన్‌ నా స్వంత సోదరుడిలాంటోడు. తను ప్రతిసారి మంచి సంగీతం ఇచ్చాడు. ఈ సినిమాలో పాటలతో పాటు.. అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. పూజ రూమ్‌లోని సామి కంటే నేను లింగుస్వామినే ఎక్కువగా నమ్మాను. ఆయనకు నా ధన్యవాదాలు. నేను మరో 25 సినిమాలు చేసేలా ఈ 25వ సినిమా పందెంకోడి 2 ఉంటుంది. పందెంకోడి 3 చేయడానికి మళ్లీ 13 ఏళ్లు సమయంలో కాకుండా పదమూడు నెలల్లో ప్రారంభం అవుతుందనే నమ్మకం ఉంది. వరలక్ష్మికి ఇప్పుడు సమయం వచ్చింది. తను అద్బుతంగా పెర్‌ఫార్మ్‌ చేసింది. అలాగే కీర్తి రూపంలో నాకొక మంచి ఫ్రెండ్‌ దొరికారు. మా జోడీ చాలా బాగా మెప్పిస్తుంది. తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న ఠాగూర్‌ మధుగారికి థాంక్స్‌. ఆయన నా నెక్స్‌ట్‌ సినిమా నిర్మాత. ఈ సినిమా సమర్పకుడు. అక్టోబర్‌ 18న తెలుగు, తమిళంలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. సినిమాటోగ్రాఫర్‌ శక్తి ఫెంటాస్టిక్‌ విజువల్స్‌ అందించారు. అభిమన్యుడు సమయంలో ఓ విషయం చెప్పాను. అదేంటంటే.. మనం మరచిపోయిన వ్యక్తులు అయిన రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం చేస్తానని అన్నాను. ఆ మాటను ఈరోజు నేరవేర్చుకుంటున్నాను. మనదేశంలోనే రైతులు ఎంతో కష్టపడుతున్నారు. గవర్నమెంట్‌ అనుకుంటే వాళ్ల అప్పులు తీర్చేయవచ్చు. కానీ.. తీర్చరు. గవర్న్‌మెంట్‌ తలుచుకుంటే రైతుల బ్రతుకులు చిటెకెలో మార్చేయొచ్చు. కానీ చేయరు. గవర్నమెంట్‌ తలుచుకుంటే రైతుల పిల్లలు, మంచి చదువులు చదువుకోవచ్చు. కానీ చేయరు. గవర్నమెంట్‌ ఏర్పరిచింది మనమే కదా!.. మనం ప్రయత్నం చేస్తామని నేను భావించి ప్రేక్షకులు కొనే టికెట్‌ డబ్బులు నుండి రూపాయి అడిగాను. రైతులు పొలాల్లో కాళ్లు పెడితేనే మనం అన్నంలో చేయిపెట్టగలుగుతాం. ఈ రైతులకు నేను చచ్చే వరకు ఏదో ఒక విధంగా మంచి చేయడానికి ముందుంటాను. వాళ్ల కోసమైనా నేను ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రతి సినిమాకు టికెట్‌పై ఓ రూపాయి రైతులకే ఇచ్చేస్తాను. ప్రభుత్వాన్ని నేను కోరేదొకటే.. ఇప్పుడు ప్రతి ఏడాది వంద సినిమాలకు పైగానే రిలీజ్‌ అవుతున్నాయి. ప్రేక్షకుడు కొనే టికెట్‌లో ప్రతి రూపాయిని ప్రభుత్వమే తీసుకుని రైతులకు ఖర్చుపెడితే బావుంటుంది. రైతులు, నిర్మాతలు ఒకటే. తప్పకుండా సినిమా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. నాకు థియేటర్‌ గుడి.. ప్రేక్షకులే దేవుళ్లు'' అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved