కమల్‌హాసన్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'విశ్వరూపం 2'. ఆస్కార్ ఫిలింస్(ప్రై) లిమిటెడ్ వి.రవిచంద్రన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై సినిమాను నిర్మించారు. ఆగస్ట్ 10న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. కమల్‌హాసన్ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా..
కమల్‌హాసన్ మాట్లాడుతూ - ''నన్ను స్టార్‌గానే కాదు.. నాకున్న ప్యాషన్ ఇంకా కొనసాగుతుందంటే అందుకు తెలుగు ప్రేక్షకుల ప్రేమే కారణం. నేను తెలుగు వాడిని, మలయాళీవాడిని.. ఐ యామ్ ఇండియన్ అని చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడతాను. అది ప్రేక్షకులు, అభిమానుల పంచిన ప్రేమ కారణంగానే సాధ్యమైంది. నాకన్నా పెద్దవాళ్లు నన్ను ఆశీర్వదిస్తే.. నాన్నా చిన్నవాళ్లు ప్రేమను చూపించారు. నన్ను నటన పరంగా అత్యున్నత స్థితికి తీసుకెళ్లిన సినిమాలన్నీ తెలుగు సినిమాలే. అది టాలెంట్ అనడం కంటే అదృష్టం అని అనాలి. ఇక సినిమా గురించి చెప్పాలంటే.. విశ్వరూపం మా దృష్టిలో ఒకే సినిమా. రెండు భాగాలు విడుదల చేస్తున్నాం. హార్డ్‌వర్క్‌ను, కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తారనే నమ్మకంతో చేసిన సినిమా. మేమే కాదు.. ప్రేక్షకులు కూడా ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేశారు. విశ్వరూపం పార్ట్ వన్ కంటే ఇంకా బెటర్‌గా పార్ట్ 2ను చేశాం. ఆగస్ట్ 10 కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమాను మరో చరిత్రలా భావిస్తున్నాను. ప్రేక్షకుల అందించిన అభిమానంతో మరో పార్శ్వంలోకి ప్రవేశిస్తున్నాను. మీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. నేను తినేది, వేసుకునే దుస్తులు.. అన్నీ ప్రేక్షకులు ఇచ్చినవే. అందరూ కలిసి నాపై ఇన్‌వెస్ట్ చేశారు. మీ ప్రొడక్ట్ అయిన నేను ఇప్పుడు ఆయుధంగా మారాను. మీరు తప్పకుండా ఉపయోగించుకోండి. మన ఫ్రీడవమ్ కోసం మళ్లీ మనం పోరాడాల్సిన తరుణం వచ్చింది. దాని కోసం నాకు మీ సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నాం'' అన్నారు.
రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ ''ఇండియన్ సినిమాకు కొత్త దారులు చూపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కమల్‌హాసన్‌గారు. ఆయన దర్శకత్వంలోనే విశ్వరూపం సినిమా రూపొందింది. మొదటిభాగంలాగానే రెండో భాగం పెద్ద సక్సెస్ కావాలి'' అన్నారు.
జీబ్రాన్ మాట్లాడుతూ ''ఇది నాకు చాలా ముఖ్యమైన చిత్రం. కమల్‌హాసన్‌గారితో నా తొలి సినిమా. మెమురబుల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చిన సినిమా. చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రేక్షకులు సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
ఆండ్రియా మాట్లాడుతూ ''కమల్‌సార్‌తో పనిచేయడం అనేది ఇండస్ట్రీలో చాలా విషయాలను నేర్పించింది. కెమెరా ముందే కాదు.. ఆఫ్ ది కెమెరా కూడా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. ఆయన ప్యాషనే కాదు.. క్రమశిక్షణ వల్లే ఆయన ఈ స్థాయికి చేరారు. ఆయనొక పెద్ద స్కూల్. మా అందరికీ గర్వంగా ఉంది'' అన్నారు.