ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నారా రోహిత్, జగపతిబాబు నటిస్తోన్న చిత్రం `ఆటగాళ్ళు`. పరుచూరి మురళి దర్శకుడు. వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
సాయికార్తీక్ మాట్లాడుతూ - ``రోహిత్ గారితో నాకిది 7 సినిమా. చాలా హ్యాపీగా ఉంది. పరుచూరి మురళిగారితో తొలిసారి వర్క్ చేస్తున్నాను. ఆర్.ఆర్ స్టార్ట్ చేశాను. సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
పరుచూరి మురళి మాట్లాడుతూ ``నేను జగపతిబాబుగారిని వెళ్లి కలిసి సినిమా చేయాలని అన్నప్పుడు నేనెదో విలన్‌గా సినిమాలు చేసుకుంటున్నాను. ఇప్పుడు వద్దులే అన్నారు. కానీ తర్వాత పిలిచి సినిమా చేద్దామని అన్నారు. అలాగే నారా రోహిత్‌గారి వద్దకు వెళ్లి జగపతిబాబుగారు హీరోగా చేస్తున్న సినిమాలో మీరు చేస్తారా? అన్నారు. కథ విన్న ఆయన బానే ఉంది కానీ తర్వాత చెప్తాలే అన్నారు. రెండో సారి ఆయన్ను కలిసి పూర్తిగా మరోసారి వివరించినప్పుడు ఆయన సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ ఇద్దరు హీరోలతో క్రియేటివిటీ పరంగా ఎంత దూరమైనా ట్రావెల్ చేయవచ్చు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఓ ఇన్‌టెన్షన్‌తో పనిచేశారు. ఎవరూ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ సినిమాకు నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌ని కూడా. నిర్మాతలు నా మిత్రులే. ఇలాంటి నిర్మాతలు లేకుంటే ఈ సినిమాను ఇంత బాగా చేసేవాడిని కాను`` అన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ - ``ఒక ఆటతోనే ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. నేను హీరోని కాను.. సరిపోను. నాకు హీరోగా మార్కెట్ లేదని మురళికి ముందుగానే చెప్పాను. స్నేహితుడిని నమ్మి నిర్మాతలు ఈ సినిమాను చేశారు. నా ఒక్కడిపై సినిమా నడవదు. సాలిడ్ బేస్ కావాలి అని అన్నాను. రోహిత్ అయితే ఎలా ఉంటుందని మురళి అన్నారు. రోహిత్ ఒప్పుకోడు.. ఒప్పుకుంటే బావుంటుందని అన్నారు. ఇలాంటి క్యారెక్టర్ చేయడం డేరింగ్ అటెంప్ట్. సినిమా విషయంలో సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. మురళి ప్యాషనేట్‌గా సినిమాను తీశాడు`` అన్నారు.
నారా రోహిత్ మాట్లాడుతూ - ``బాలకృష్ణుడు సినిమా నిర్మాత విజయ్‌కుమార్‌గారు చెప్పారని పరుచూరి మురళిగారు కథ చెబుతానని వచ్చినప్పుడు సరేనని విన్నాను. ఆయన కమర్షియల్ సినిమా చేస్తాడని అనుకుంటే.. నా జోనర్ సినిమాలు చెబుతున్నాడేంటి? అని అనుకున్నాను. ఒక డిఫరెంట్ సినిమాను ఎంటర్‌టైనింగ్‌గా మురళి ప్రెజెంట్ చేశారు. కావాల్సిన దాని కోసం గొడవపడే దర్శకుడు ఆయన. జగపతిబాబుగారు, బ్రహ్మానందంగారితో తొలిసారి చేశాను. నేను చేసిన సినిమాల్లో నాకే కొత్తగా ఉంటుంది`` అన్నారు.