pizza
Nartanasala movie launch
`@న‌ర్త‌న‌శాల‌` మొద‌లైంది
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

18 March 2018
Hyderabad

ఐరా క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న చిత్రం `@న‌ర్త‌న‌శాల‌`. నాగ శౌర్య‌, న‌రేశ్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, అజ‌య్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌త్యం రాజేశ్‌, వెన్నెల కిశోర్‌, గుండు సుద‌ర్శ‌న్‌, జెమిని సురేశ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్పిస్తున్నారు. శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌కుడు. ఉషా ముల్పూరి నిర్మాత‌. ఈ సినిమా ప్రారంభోత్స‌వం పూజా కార్య‌క్ర‌మాలు ఉగాదిని పుర‌స్క‌రించుకుని ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగాయి.

నాగ‌శౌర్య మాట్లాడుతూ ``న‌ర్త‌న శాల అనే పేరు విన‌గానే ఇదేదో పౌరాణిక చిత్ర‌మ‌ని కొంద‌రు, పాత న‌ర్త‌న‌శాల‌కు రీమేక్ అని మ‌రికొంద‌రు అనుకుంటున్నారు. అలాంటిదేమీ లేదు. టైటిల్ క‌థ‌కు స‌రిపోయేలా ఉంద‌ని అలా పెట్టాం. ఆద్యంతం న‌వ్వులు పూయిస్తుంది. కృష్ణ‌వంశీగారి ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసిన శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి ఈ సినిమాకు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. మా సంస్థ‌లో తొలి చిత్రం `ఛ‌లో` చాలా పెద్ద హిట్ అయిం ది. ఈ సినిమా కూడా అంత‌కుమించి హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాం. న‌న్ను హీరోగా ప్రోత్స‌హిస్తోన్న మా అమ్మ‌కు ధ‌న్య‌వాదాలు. స్వ‌ర‌సాగ‌ర్ మ‌హ‌తి మంచి సంగీతాన్నిస్తారు`` అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``ఐరా క్రియేష‌న్స్ సంస్థ ఆల్రెడీ నాకోసం ఓ మంచి ప్లాట్‌పార్మ్ వేసి ఉంది. ఈ సినిమాతో విజ‌య‌ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తాన‌నే న‌మ్మ‌కం ఉంది. ఈ చిత్రాన్ని నేను ఒక బాధ్య‌త‌గా ఫీల‌వుతున్నాను. ఛైత్ర‌మాసంలో ఈ సినిమా మొద‌ల‌వుతోంది. చెట్ల‌కు చిగురులు తొడిగే వేళ ఇది. మా సినిమా కూడా దిన‌దిన‌ప్ర‌వ‌ర్ధ‌మాన‌మ‌వుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది`` అని తెలిపారు.

కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ ``ఛ‌లో టైమ్ లో సినిమా చేయ‌మ‌న్నారు. ఆ సినిమాతో దాదాపు ఫ్యామిలీ మెంబ‌ర్స్ లాగా అయిపోయాం.`` అని చెప్పారు.

విజ‌య్‌.సి.కుమార్ మాట్లాడుతూ ``మంచి సినిమా చేస్తామ‌నే న‌మ్మ‌కం ఉంది`` అని అన్నారు.

ఈ చిత్రానికి స్క్రిప్ట్ కో ఆర్డినేట‌ర్‌: కాశీ న‌డింప‌ల్లి, ఫైట్స్: వెంక‌ట్, ఆర్ట్: కిర‌ణ్ కుమార్‌, ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు(చంటి), త‌మ్మి రాజు, మ్యూజిక్‌: మహ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌, డి.ఒ.పి: విజ‌య్‌.సి.కుమార్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌: బుజ్జి, ఐరా డిజిట‌ల్‌: ఎం.ఎన్‌.ఎస్‌. గౌత‌మ్‌, నిర్మాత‌: ఉషా ముల్పూరి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి, స‌మ‌ర్ప‌ణ‌: శ‌ంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి.



 
Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved