Young hero Rahul Vijay and Mega heroine Niharika Konidela are going to team up for a romantic comedy. This new film is formally launched at Ramanaidu studios on Saturday. Mega brother Naga Babu and Mega Prince Varun Tej have graced the launch event as chief guests.
Naga Babu clapped the board for the first scene shot on the lead pair while Varun Tej switched on the camera.
This film will be directed by Pranith Bramandapally who earlier directed couple of web-series with Niharika like ‘Mudda Pappu Avakay’ and ‘Nanna Koochi.’ Speaking Pranith said “Happy to be directing the movie and thanks to the entire team for their support.”
Mega heroine Niharika conveyed her best wishes to Nirvana Cinemas which is stepping into film production while hero Rahul Vijay added that he okayed this film in a single hearing and said that the film will be in director Sekhar Kammula’s style.
Mark K Robin of ‘AWE’ fame is going to compose music while Harij Prasad will be taking care of the cinematography.
With this film, one of the leading film distribution houses in the United States, Nirvana Cinemas is stepping into film production. In the recent times they have distributed many highly successful films like 'Arjun Rreddy' ‘Mahanati’ ‘Sammohanam’ etc.
Crew:
Writer and Director: Pranith Bramanadapally
Producer: Sundeep Yerrmareddy, Srujan Yarabolu, Ram Naresh
Director of Photography: Harij Prasad
Music: Mark K Robin
Editor: Raviteja Girijala
Art Director: Avinash Kolla
Lyrics: Krishna Kanth
Executive Producers: Raj Nihar
Co-Director: Dasam Prasad
PRO: Vamshi Sekhar
Publicity: Anil& Bhanu
Costume Designing: Bharagavi Ambati, Gauri Naidu
నిర్వాణ సినిమాస్ ప్రొడక్షన్ నెం.1 ప్రారంభం
రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల హీరో హీరోయిన్లుగా నిర్వాణ సినిమా బ్యానర్‌పై ప్రణీత్ బ్రమనడపల్లి దర్శకత్వంలో సందీప్ ఎర్మారెడ్డి, సుజన్ ఎరబోలు, రామ్ నరేశ్ దండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి కె.నాగబాబు క్లాప్ కొట్టగా.. హీరో వరుణ్ తేజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. శివాజీ రాజా గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
దర్శకుడు మాట్లాడుతూ - ```ముద్దపప్పు అవకాయ`, `నాన్నకూచి` తర్వాత నన్ను, నా స్క్రిప్ట్‌ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్వాణ సినిమాస్, నిహారిక, రాహుల్ విజయ్‌గారికి చాలా థాంక్స్. ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 25 నుండి జూలై 20 వరకు జరుగుతుంది. సెకండ్ షెడ్యూల్ ఆగస్టులో ఉంటుంది`` అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ - ``మా నిర్వాణ సినిమాస్‌పై యు.ఎస్‌లో డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాం. ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. ప్రణీత్ కథ విన్న తర్వాత నిహారికగారికైతే ఈ కథ సరిపోతుందనిపించింది. హీరో కోసం వెతుకుతున్నప్పుడు రాహుల్ విజయ్ గురించి తెలిసింది. తనను ఆడిషన్ చేస్తే బావుంటానిపించింది. రెండు వారాల్లోనే సినిమాను స్టార్ట్ చేసేశాం. శివాజీరాజాగారు కీలకపాత్ర పోషిస్తున్నారు`` అన్నారు.
రాహుల్ విజయ్ మాట్లాడుతూ - ``శేఖర్ కమ్ములగారి సినిమాలా ఉంటుందని నమ్ముతున్నాను. నా తొలి సినిమా `ఈ మాయ పేరేమిటో`ని మా హోం బ్యానర్‌లో చేశాను. ఇప్పుడు ఈ సినిమాను వేరే నిర్మాతలతో చేస్తున్నాను. మంచి టీం కుదిరింది. శివాజీరాజాగారు మంచి పాత్ర చేస్తున్నారు. అలాగే నిహారికగారి పక్కన నటించడం మంచి అవకాశంగా భావిస్తున్నాను. నిర్మాణ సంస్థ చేస్తున్న తొలి సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె.రాబిన్ మాట్లాడుతూ - ```అ!` సినిమా తర్వాత చేస్తున్న సినిమా. ఇందులో ఐదు సాంగ్స్, రెండు, మూడుబిట్ ఉంటాయి. నిహారికలో నటిగా మరో కోణంలో చూస్తారు`` అన్నారు.
శివాజీ రాజా మాట్లాడుతూ - ``ప్రణీత్ చాల క్లారిటీ ఉన్న డైరెక్టర్. డెఫనెట్‌గా సినిమా మంచి సినిమా అవుతుంది. విజయ్ మాస్టర్‌గారి అబ్బాయి రాహుల్ విజయ్ హీరోగా, నా స్నేహితుడి కూతురు నిహారిక హీరోయిన్‌గా చేస్తున్న సినిమా. మంచి పాత్ర చేస్తున్నాను`` అన్నారు.
నిహారిక కొణిదెల మాట్లాడుతూ - `` నిర్వాణ సినిమాస్ తొలి ప్రొడక్షన్ ఇది. డైరెక్టర్ ప్రణీత్ నా ఫ్యామిలీ మెంబర్‌తో సమానం. తన ఫస్ట్ మూవీలో నేను చేయడం ఆనందంగా ఉంది. రాహుల్ ఇందులో క్యారెక్టర్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతాడు. సినిమా కొత్తగా ఉండి.. ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది`` అన్నారు.
రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల, శివాజీ రాజా, సత్య, కొటేశ్వర్ రావు, మధుమణి, శిరీష, నాయని పావని ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: కృష్ణ కాంత్, ఆర్ట్: అవినాశ్ కొల్ల, ఎడిటర్: రవితేజ గిరిజాల, మ్యూజిక్: మార్క్ కె.రాబిన్, కెమెరా: హరి ప్రసాద్, నిర్మాతలు: సందీప్ ఎర్మారెడ్డి, సుజన్ ఎరబోలు, రామ్ నరేశ్ దండ, రచన, దర్శకత్వం: ప‌్రణీత్ బ్రమణడపల్లి.