pizza
You movie launch
`యు` ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

10 May 2018
Hyderabad

వై.వై.వి. క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్న చిత్రం `యు`. మూర్తి.వన్నెంరెడ్డి నిర్మాత‌. సుకు పూర్వ‌రాజ్ ద‌ర్శ‌కుడు. జ‌గ‌దీశ్ బొమ్మిశెట్టి కెమెరాను నిర్వ‌హిస్తున్నారు. ఆశీర్వాద్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. వివేక్ విశాల్ హీరో. త‌రుణిక సింగ్ నాయిక‌. యామిని మ‌రో నాయిక‌. ఈ సినిమా ప్రారంభోత్స‌వం గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ముహూర్త‌పు స‌న్నివేశానికి కోన వెంక‌ట్ క్లాప్‌నిచ్చారు. నాగేశ్వ‌ర‌రెడ్డి స్విచ్చాన్ చేశారు. సాగ‌ర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా గురించి

నిర్మాత మాట్లాడుతూ ``మంచి క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. రామానాయుడు, శ‌బ్దాల‌య స్టూడియోల‌లో ప‌నిచేశాను. క‌థ న‌చ్చి నిర్మాత‌గా మారాను. ఇందులో రెండో హీరోయిన్‌గా మా అమ్మాయి న‌టిస్తోంది. ఈ నెలాఖ‌రున‌గానీ, వ‌చ్చే నెల మొద‌టివారంలోగానీ సినిమాను ప్రారంభిస్తాం. వైజాగ్‌, అర‌కు, పాడేరులో చిత్రీక‌రిస్తాం`` అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``మ‌నిషి సృష్టించే అభివృద్ధే అత‌ని వినాశ‌నానికి కార‌ణం. 99 శాతం ఈ భూమిపై ఏమీ మాట్లాడ‌వు. కానీ ధ‌ర్మాన్ని పాటిస్తాయి. మ‌నిషి మాట్లాడుతాడు. కానీ ధ‌ర్మ‌బ‌ద్ధంగా ఉండ‌డు. యూనివ‌ర్శ‌ల్ ఎలిమెంట్స్ తో ఈసినిమా చేస్తున్నాను. సైన్స్ ఫిక్ష‌న్ ఇది. ల‌వ్‌స్టోరీ. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు న‌టీన‌టుల‌కు వ‌ర్క్ షాప్ ఉంటుంది`` అని చెప్పారు.

మంచి పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్టు హీరో, హీరోయిన్లు చెప్పారు.

 



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved