శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్, మెయిన్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై జె.బి.మురళీ కృష్ణ దర్శకత్వంలో రవి, జో జో జోస్, శ్రీనివాస్ రెడ్డి.ఎన్ నిర్మిస్తున్న చిత్రం `జంబ లకిడి పంబ`. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లరి నరేశ్, శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని, డైరెక్టర్ జె.బి.మురళీకృష్ణ, నిర్మాతలు రవి, జో జో జోస్, శ్రీనివాస్ రెడ్డి.ఎన్, వెంకట్రామిరెడ్డి, అనిల్ కుమార్, రాజ్ కందుకూరి, బీరం సుధాకర్ రెడ్డి, జగదీశ్, రాంబాబు, సునీల్ కృష్ణ వంశీ, మహేందర్, నాగవేర్, కొండా, సాయి, ఫణి రామకృష్ణ, వెన్నెలకిశోర్, ధనరాజ్, చిత్రం శ్రీను, తాగుబోతు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
బిజెపి ఉత్తరాంధ్ర ఎం.ఎల్.సి మాధవ్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. బ్యానర్ లోగోను బీరం సుధాకర్ రెడ్డి విడుదల చేశారు.
అల్లరి నరేశ్ మాట్లాడుతూ - ``మేడమీద అబ్బాయి సినిమా నుండి మనుగారితో మంచి పరిచయం ఉంది. కష్టపడి, కసితో చేసిన సినిమా ఇది. జంబ లకిడి పంబ అనే టైటిల్ పెడితే అందరూ తిట్టారని దర్శకుడు మను ఇందాక అన్నారు. ఇంతకు ముందు మేం అహ నా పెళ్ళంట అనే టైటిల్ పెట్టినప్పుడు కూడా మమ్మల్ని అలాగే తిట్టారు. అయితే మేం హిట్ కొట్టాం. రెండు సినిమాలకు సంబంధం ఉండదు. ఫ్రెష్ సబ్జెక్ట్. ఆ సినిమా ఎంత విజయం సాధించిందో ఈ సినిమా అంతే పెద్ద సక్సెస్ కావాలి. గోపీసుందర్ గారు ఎంతో బిజీగా ఉన్నా కూడా ఈ సినిమాకు ఆయన సంగీతం అందించారు. నిర్మాతలకు అభినందనలు. సినిమాపై నేను నమ్మకంగా ఉన్నాం. 22న నా నమ్మకం నిజమవుతుందని నమ్ముతున్నాను`` అన్నారు.
బిజెపి ఉత్తరాంధ్ర ఎం.ఎల్.సి మాధవ్ మాట్లాడుతూ - `` నిర్మాతలు నాకు మంచి మిత్రులు. ముందుగా వారికి అభినందనలు. ముందు టైటిల్ వినగానే వెకిలిగా ఎమైనా ఉంటుందేమో, కామెడీ పక్కదారి పడుతుందో ఏమో అనుకున్నాను. వినోదంతో పాటు మంచి మెసేజ్ ఇస్తున్నారు. మన సంస్కృతిని మరచిపోతున్న రోజుల్లో మనకు దాన్ని గుర్తుకు చేసేలా సినిమా చేసిన డైరెక్టర్ మనుగారికి అభినందనలు. తనకు మంచి భవిష్యత్ ఉంది. శ్రీనివాసరెడ్డి మంచి టైమింగ్ ఉన్న నటుడు. అన్ని రకాల పాత్రలు చేస్తున్నారు.
సిద్ధి ఇద్నాని మాట్లాడుతూ - ``ఇలాంటి సినిమాలో నేను భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే నా తొలి చిత్రం. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. అందరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ నెల 22న సినిమా విడుదలవుతుంది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను`` అన్నారు.
గోపీ సుందర్ మాట్లాడుతూ ``మనుగారితో వర్క్ చేయడం హ్యాపీ. సినిమాలో చాలా మంచి పాటలున్నాయి. శ్రీనివాసరెడ్డి, సిద్ధి సహా దర్శక నిర్మాతలకు సినిమా మంచి పేరు తెస్తుందని భావిస్తున్నాను`` అన్నారు.
నిర్మాత రవి మాట్లాడుతూ - ``నా స్నేహితుడు సంతోశ్ ద్వారా మనుగారిని కలిశాను. కథ వినగానే నచ్చింది. వెంటనే ఓకే చేశాం. నా తొలి ప్రొడక్షన్ ఇది. మనుగారు చాలా బాగా మూవీ తీశారు. శ్రీనివాసరెడ్డిగారు పెద్ద ఎసెట్ అయ్యారు. ఆయన రోల్ కొత్తగా ఉంటుంది. సిద్ధి సహా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో ఎఫర్ట్ పెట్టి పనిచేశారు. గోపీసుందర్ ఒప్పుకున్న తర్వాత పెద్ద టెక్నీషియన్స్ మా సినిమాలో పార్ట్ కావడానికి ఓప్పుకున్నారు. మ్యూజిక్ చాలా బాగా కుదిరింది. అందరూ ఎంతో సహకారం అందించారు. జూన్ 22న సినిమాను విడుదల చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం`` అన్నారు.
సురేశ్ రెడ్డి మాట్లాడుతూ - ``ఈ సినిమా విషయంలో మాకు సహకారం పెద్దగా రాలేదు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని సినిమా చేశాం. తర్వాత శ్రీనివాసరెడ్డి నుండి సపోర్ట్ దొరికింది. హీరో శ్రీనివాస్‌రెడ్డిగారు పాత టైటిల్స్‌తో ఎలాగైతే సక్సెస్ సాధిస్తున్నారో ఈ సినిమాతో అలాగే మంచి సక్సెస్ అందుకుంటాం. పాత సినిమాకు, మాకు ఎలాంటి కంపేరిజన్ లేదు. సినిమా ప్లాప్ అయితే బయ్యర్, అతని కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో మనకు తెలిసిందే. బయ్యర్ అనేవారు ఏదో ఆశతోనే సినిమా చేస్తారు. మా సినిమా కొని ఏ బయ్యర్ నష్ట పోకూడదని కోరుకుంటాం. సిద్ధి కొత్త హీరోయిన్ అంటే ఎవరూ నమ్మరు. అంత చక్కగా నటించింది. అందరూ ఎంతో సహకారం అందించారు`` అన్నారు.
దర్శకుడు జె.బి.మురళీకృష్ణ(మను) మాట్లాడుతూ - ``అల్లరి నరేశ్‌గారు ఎంతగానో సహకారం అందించారు. నువ్వు ఓ విషయాన్ని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే దాని కోసం సమస్త విశ్వం నీకు తోడ్పడుతుంది.. అనే దాన్ని నమ్ముకునే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి నా వెనుక గొప్ప గొప్ప వ్యక్తులు, మంచి వ్యక్తులు ఉన్నారు. సంతోశ్, ధనరాజ్, అనిల్ అందరి ఎంతో సహకారం అందించారు. గోపీ సుందర్ మాపై నమ్మకంతో సినిమాకు సంగీతం అందించడానికి ముందుకు వచ్చారు. ఆయన వల్లే సినిమాకు ముందు మంచి పేరు వచ్చింది. మనసు పెట్టి పెట్టిన వంటకం లాంటి సినిమా. సినిమా చూసే ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకుంటాడు. ఈవీవీగారి జంబలకిడి పంబ పేరు పెట్టుకున్నందుకు కొందరు మమ్మల్ని సోషల్ మీడియాలో తిడుతున్నారు. వారికి చెప్పదొక్కటే. ఆ సినిమాను మేం టచ్ కూడా చేయలేం. అదొక కల్ట్ మూవీ. పేరు పెట్టుకున్నందుకు ఆ సినిమా పరువు మాత్రం తీయం అని చెప్పగను`` అన్నారు.
హీరో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ - ``ఈ సినిమా కోసం మంచి నిర్మాతలు దొరికారు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మనుగారు చాలా ఓపికతో సినిమా మంచి సినిమా తీశారు. సతీశ్‌గారి విజువల్స్ వల్లనే సినిమా ఇంత గ్రాండ్‌గా వచ్చింది. సినిమాను పెద్ద సక్సెస్ చేయాలి. గోపీసుందర్‌గారి పేరు, జంబ లకిడి పంబ అనే రెండు పేర్లే ముందు బలంగా నిలిచాయి. అందరికీ థాంక్స్`` అన్నారు.
జగదీశ్ మాట్లాడుతూ - ``మంచి సినిమా చేసిన నిర్మాతలకు అభినందనలు. భవిష్యత్‌లో ఇలాగే మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
రాంబాబు మాట్లాడుతూ ``సినిమా కమర్షియల్‌గా సక్సెస్ సాధించడమే కాదు.. ఎంటైర్ యూనిట్‌కు మంచి పేరు రావాలి`` అన్నారు.
సునీల్ కృష్ణవంశీ మాట్లాడుతూ - ``నిర్మాతలు ఈ సినిమాతో ఇండస్ట్రీలో తమకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌తో ఆ కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేసుకుంటారని భావిస్తున్నాను`` అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ``ఒకప్పుడు సూపర్‌డూపర్ హిట్ కొట్టిన టైటిల్ `జంబలకిడిపంబ`. నిర్మాతలతో మంచి అనుబంధమే ఉంది. ఈ సినిమాతో పేరే కాదు.. డబ్బులు కూడా సంపాదించాలని కోరుకుంటున్నాను. మంచి అభిరుచి గల నిర్మాతలు. ఎందుకంటే కథను నమ్మి మురళీకృష్ణతో సినిమా చేయడం ఒకటైతే.. మరొకటి గోపీ సుందర్‌ను సంగీత దర్శకుడిగా తీసుకోవడం. శ్రీనివాసరెడ్డి కామెడీ నాకెంతో నచ్చుతుంది. తనకు, సిద్ధి ఇద్నాని సహా యూనిట్‌కి ఆల్ ది బెస్ట్`` అన్నారు.
చిత్రం శ్రీను మాట్లాడుతూ - ``గురువుగారు ఈవీవీగారు తీసిన జంబ లకిడి పంబ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమా మా దర్శక నిర్మాతలు, శ్రీనివాసరెడ్డి,సిద్ధి ఇద్నాని సహా అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
తాగుబోతు రమేశ్ మాట్లాడుతూ - ``గ్రేట్ ఫిలిం టైటిల్‌తో మనుగారు ఈ సినిమాను శ్రీనివాసరెడ్డిగారితో చేయడం గొప్ప విషయం. శ్రీనివాసరెడ్డి అన్నకు ఇది మూడో సినిమా. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. సినిమా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
దనరాజ్ మాట్లాడుతూ - ``ఈ స్క్రిప్ట్‌ను ముందు విన్నది నేనే. మనుతో నేను రైట్ రైట్ అనే సినిమా చేశాను. స్క్రిప్ట్‌ను నమ్మి మనుగారితో సినిమా చేయడానికి రెడీ అయిన శ్రీనివాసరెడ్డిగారికి, నిర్మాతలకు థాంక్స్. నాకు ఇందులో మంచి వేషం ఇచ్చారు. రెడ్డన్న డిఫరెంట్ టైటిల్స్‌తో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధియే హీరో`` అన్నారు.
వెన్నెలకిశోర్ మాట్లాడుతూ - ``మంచి పాత్ర ఇచ్చారు. ఇందులో స్వరూప్ అనే పాత్ర చేశాను. పోసానిగారితో కలిసి నటించాను. సిద్ధిగారు తొలి సినిమాకే రోప్ షాట్స్, ఫైట్స్ చేశారు. గోపీసుందర్ మ్యూజిక్‌కి నేను పెద్ద అభిమానిని. మనుగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. శ్రీనివాసరెడ్డిగారు చాలా మంచి పాత్ర చేశారు. ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు`` అన్నారు.