pizza
Kaasi pre release function
`కాశి` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 May 2018
Hyderabad

సెన్సిబుల్ చిత్రాల తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటూ.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం `కాశి`. కృతిక ఉద‌య‌నిధి ద‌ర్శ‌కురాలు. విజయ్ ఆంటోనీ సరసన అంజలి, సునైన కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లెజండ్ సినిమా పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి తెలుగులో విడుదల చేస్తున్నారు. మే 18న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్బంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో....

న‌టుడు మ‌ధు మాట్లాడుతూ - ``విజ‌య్ ఆంటోనిగారిది డిఫ‌రెంట్ జోన‌ర్. ఆయ‌న న‌టించిన బిచ్చ‌గాడు ఎంత పెద్ద హిట్ అయ్యుంటుందో తెలిసిందే. కృతిక‌గారు మంచి మూవీ చేయాల‌నే త‌ప‌న‌తో మంచి క‌థ‌తో కాశి సినిమా చేశారు. న‌లుగురు హీరోయిన్స్ సినిమాలో ఉన్నారు. సినిమాు చూసి అంద‌రూ ఆద‌రించాలి`` అన్నారు.

అమృత మాట్లాడుతూ - ``ఈ నెల 18న సినిమా విడుద‌ల‌వుతుంది. విజ‌య్ ఆంటోని, కృతిక‌గారికి థాంక్స్`` అన్నారు.

సునైన మాట్లడుతూ ``త‌మిళ‌కాలంలో కాళి, తెలుగులో కాశి పేరుతో సినిమా ఈ మే 18న విడుద‌ల‌వుతుంది. నేను న‌టించిన సినిమా నాక ముక పాట‌ను విజ‌య్ ఆంటోనిగారే కంపోజ్ చేశారు. అప్ప‌టి నుండి ఆయ‌న‌తో నాకు ప‌రిచ‌యం ఉంది. విజ‌య్‌గారు మంచి యాక్ట‌రే కాదు.. గొప్ప న‌టుడు కూడా. చాలా మంచి క్యారెక్ట‌ర్ చేశాను. ప్రేమ అనే అంశం సినిమా ఉంటుంది. త‌ల్లి కొడుకు మ‌ధ్య ప్రేమ కావ‌చ్చు.. ఇద్ద‌రి ప్రేమికుల మ‌ధ్య ప్రేమ కావ‌చ్చు. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే`` అన్నారు.

జెమిని కిర‌ణ్ మాట్లాడుతూ - ``మ్యూజిక్ డైరెక్ట‌ర్ విజ‌య్ ఆంటోనిగారు బిచ్చ‌గాడు సినిమాతో హీరోగా మారి ఆంధ్ర దేశాన్ని ఓ ఊపు ఊపేశారు. ఇప్పుడు కాశితో మ‌రో హిట్ సాధిస్తార‌ని భావిస్తున్నాను`` అన్నారు.

సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ - ```కాశి` సినిమా డిఫ‌రెంట్ మూవీ. కృతిక ఆలోచ‌న బావుంది. మంచి స్క్రీన్‌ప్లే, మంచి రొమాన్స్ ఉంది. కృతిక సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. భాషాశ్రీ మంచి డైలాగ్స్ ఇచ్చారు. సినిమా చూశాను. డిఫరెంట్ కాన్సెప్ట్‌. యూనిట్ పెట్టిన ఎఫ‌ర్ట్ సినిమాలో క‌న‌ప‌డుతుంది. మ‌న రూట్స్ గురించి ఆలోచింప చేసుకునే సినిమా. ఈ సినిమా త‌ర్వాత విజ‌య్ ఆంటోని స్ట్ర‌యిట్ తెలుగు సినిమానే చేస్తారు. కృతిక త‌మిళంలోనే కాదు.. తెలుగులో కూడా సినిమా చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

భాషా శ్రీ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో విజ‌య్ ఆంటోనిగారు త‌ల్లికి కొడుకు, మంచి రొమాంటిక్ హీరోగా.. ఇలా నాలుగు డిఫ‌రెంట్ యాంగిల్స్‌లో క‌న‌ప‌డ‌తారు. కృతిక‌గారు ప్ర‌తి ఫ్రేమ్‌ను చాలా అందంగా చూపించారు. అద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ సినిమాకు మాట‌లు, పాట‌లు రాశారు. విజ‌య్ ఆంటోనిగారు, న‌లుగురు హీరోయిన్స్‌తో క‌లిసి న‌టించారు.

ప్ర‌ద్యుమ్న‌ మాట్లాడుతూ - ``విజ‌య్ ఆంటోనిగారు ఓ ఆల్ రౌండ‌ర్‌. ఆయ‌న న‌టించిన ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తుండ‌టం గ‌ర్వంగా ఉంది. కృతిక గారు చేసిన వ‌ణ‌క్కం చెన్నై సినిమా త‌ర్వాత ఆమె ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా. చాలా అద్భుతంగా తెర‌కెక్కించారు. హీరోయిన్స్ అంద‌రికీ ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు. స‌హ‌కారం అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌`` అన్నారు.

గ‌ణేశ్ మాట్లాడుతూ - ``మా పై న‌మ్మ‌కంతో మాకు తెలుగులో సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశాన్ని ఇచ్చిన విజ‌య్ ఆంటోని, ఫాతిమాగారికి థాంక్స్‌`` అన్నారు.

కృతిక ఉద‌య‌నిధి మాట్లాడుతూ - ``కాశి సినిమా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నాను. విజ‌య్ ఆంటోనిగారు క‌థ విన‌గానే నన్ను న‌మ్మి డైరెక్ష‌న్ అవ‌కాశం ఇచ్చారు. తెలుగులో భాషా శ్రీగారు మాట‌లు, పాట‌లు చ‌క్క‌గా రాశారు. యూనిట్‌కి థాంక్స్‌`` అన్నారు.

చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ - ``విజ‌య్ ఆంటోనికి ఈ సినిమా మ‌రో మైలురాయి కావాలని కోరుకుంటున్నాను. ఆయ‌న డైరెక్ట్‌గా తెలుగులో కూడా సినిమా చేయాల‌ని కోరుకుంటున్నాను. కృతిక‌గారు సినిమాపై ప్రేమ‌తో డైరెక్ష‌న్ చేశారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ - ``న‌న్ను తెలుగు నిర్మాత‌లంద‌రూ వారి హీరోగా భావించి ఎంక‌రేజ్ చేస్తున్నారు. నా గ‌త చిత్రాల‌తో పోల్చితే ఇది చాలా డిఫ‌రెంట్ మూవీ. కృతిక‌గారు కాలేజ్ స‌మ‌యంలో నా క్లాస్ మేట్‌. సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. భాషాశ్రీగారు అమేజింగ్‌గా మాట‌లు, పాట‌లు రాశారు. ఆయ‌న స్క్రిప్ట్‌ను బాగా డెవ‌ల‌ప్ చేస్తారు. సినిమా మేకింగ్ సమ‌యంలో చాలా స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేసినా క‌ల్యాణ్‌గారు ఎంతో చ‌క్క‌గా స‌హ‌కారాన్ని అందించారు. తెలుగులో సినిమాను విడుద‌ల చేస్తున్న నిర్మాత‌ల‌కు థాంక్స్. మంచి, డీసెంట్ సినిమాల‌ను అందించ‌డానికే ప్ర‌య‌త్నిస్తాను. త్వ‌ర‌లోనే తెలుగులో స్ట్ర‌యిట్ మూవీ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. మా సినిమా పాట‌ల‌ను ఎటువంటి చార్జీలు లేకుండా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ సినిమాకే కాదు.. భ‌విష్య‌త్‌లో కూడా నా సినిమా పాట‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు నా అఫిషియ‌ల్ వెబ్‌సైట్‌కు విజ‌య్ ఆంటోని.కామ్‌ వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు`` అన్నారు.

విజయ్ ఆంటోనీ, అంజలి, సునైన, అమృత అయ్యర్, శిల్పా మంజునాథ్, రాకేష్ పృధ్వీ, గాల్విన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోనీ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్, ఎడిటర్: లారెన్స్ కిషోర్, నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి, రచన-దర్శకత్వం: కృతిక ఉదయనిధి.

 

 



Photo Gallery (photos by G Narasaiah)
 
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved