2 September 2018
Hyderabad
రాజా గౌతమ్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'మను'. నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండెడ్‌గా నిర్మితమైన ఈ చిత్రానికి ఫణీంద్ర నార్‌శెట్టి దర్శకుడు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదలవుతుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ...
నరేశ్ కుమరన్ మాట్లాడుతూ - ``ఫణితో మధురంకు కూడా వర్క్ చేశాను. తనతో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ నాకు తెలుసు. తను విజువల్స్‌తో నా వద్దకు వచ్చినప్పుడు నేను షాకయ్యాను. నన్ను చాలా ఇన్‌స్ఫైర్ చేసింది. రెగ్యులర్ మూవీకి డిఫరెంట్‌గా ఉంటుంది. నా బెస్ట్ ఇచ్చాను`` అన్నారు.
మోహన్ భగత్ మాట్లాడుతూ - ``ఫణితో పనిచేసిన తర్వాత గర్వంగా అనిపించింది. తప్పకుండా సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది`` అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ శివ్ కుమార్ మాట్లాడుతూ - ``కథకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. విజువల్స్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. నాకు సినిమాల పరంగా ఏ ఎక్స్‌పీరియెన్స్ లేదు. మాకు తెలిసిన పద్ధతిలోనే చేసుకుంటూ వచ్చాను. నాకు సహకారం ఇచ్చిన ఫణిగారికి టీమ్‌కి థాంక్స్`` అన్నారు.
అభిరామ్ వర్మ మాట్లాడుతూ - ``ఈ సినిమా మూడేళ్ల కష్టం. ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాను`` అన్నారు
సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ - ``మూవీని 2016లో స్టార్ట్ చేశాం. ఫేస్ బుక్ ద్వారా ఫణిని కలిశాను. ప్రేక్షకుడిగా ఫణి స్టోరి నెరేషన్‌ను ఎంజాయ్ చేసేవాడిని`` అన్నారు.
జాన్ కొటొలి మాట్లాడుతూ - ``మేం చిన్న టీమ్‌గా వర్క్ చేస్తూ వచ్చాం. మేం ఏ పని చేయాలనే దానిపై ప్రతి ఒక్కరికీ క్లారిటీ ఉంది. అందుకే ఓ మంచి, కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను`` అన్నారు.
వెంకట్ మహా మాట్లాడుతూ - ``కంచరపాలెం కథ రాసుకున్న తర్వాత క్రౌడ్ ఫండింగ్ ద్వారా సినిమా తీద్దామని ప్రయత్నాలు చేసుకుంటున్న సమయంలో మను ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. సరే! వాళ్లకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని ఆసక్తిగా గమనిస్తున్న తరుణంలో.. నాలుగురోజుల్లో కోటి రూపాయలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిందని ఫణిగారు పోస్ట్ చేశారు. నేను ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడే.. వారి సెట్ వర్క్ స్టార్ట్ చేశారు. మా మధ్య యాదృచ్చికంగా చాలా విషయాలు జరుగుతూ వస్తున్నాయి. సక్సెస్‌లో కూడా ఆ కో ఇన్‌సిడెన్స్ ఉండాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ - ``చాలా గొప్ప సినిమాలు అవుతాయని ఎక్స్‌పెక్ట్ చేస్తూ వచ్చిన రెండు సినిమాలు మను, కేరాఫ్ కంచెరపాలెం విడుదల కాబోతున్నాయి. మను ట్రైలర్ చూసిన తర్వాత సృజన్ అడిగిన మేర.. ట్వీట్ కూడా చేశాను. అప్పుడే ఎప్పుడైనా ప్రివ్యూ వేస్తే నాకు చూపిస్తారా? అని కూడా అడిగాను. ట్రైలర్ చూసిన తర్వాత ఇలాంటి సినిమా నేను కూడా ఒకటి తీస్తే బావుండు అనిపిస్తుంది. ప్రతి డిపార్ట్‌మెంట్ ప్యాషన్‌తో చేసిన సినిమా ఇది. సృజన్, సందీప్‌తో పాటు 112 మంది సినిమా ప్రియులకు అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు`` అన్నారు.
నిర్వాణ సినిమా సందీప్ మాట్లాడుతూ - ``కొత్త సినిమాలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మను సినిమాకు సహకారం అందించడానికి ముందుకు వచ్చాం. సహకారం అందిస్తూ వస్తున్న అందరికీ థాంక్స్`` అన్నారు.
చాందినీ చౌదరి మాట్లాడుతూ - ``ఆ చిన్న సినిమాను పెద్దగా ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్తున్న నిర్వాణ సినిమాస్‌కు థాంక్స్. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. టీమ్ అందరికీ థాంక్స్`` అన్నారు.
నిర్వాణ సినిమా సృజన్ మాట్లాడుతూ - ``డిఫరెంట్ సినిమాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తొలిసారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నాం. అన్ని డిపార్ట్ మెంట్స్ చేసిన కృషితో పాత్ బ్రేకింగ్ మూవీ అని చెప్పగలను`` అన్నారు.
రాజా గౌతమ్ మాట్లాడుతూ - ``ట్రైలర్ లాంచ్ తర్వాత ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ప్రేక్షకులతో నేరుగా ఇంటరాక్ట్ కావాలని నేరుగా ప్రేక్షకులను కలుసుకుంటున్నాం. ప్రేక్షకులు చూపించే ప్రేమకు గుండె ఆనందంతో నిండిపోతుంది. ఈ మూడేళ్ల జర్నీని నా లైఫ్‌లో మరచిపోలేను. ఇది నా బెస్ట్ లైఫ్ ఎక్స్‌పీరియెన్స్. కొత్త కాన్సెప్ట్‌లకు నిర్మాతలెవరూ ముందుకు రాకపోతే.. క్రౌడ్ ఉందనే ధైర్యం మా సినిమాను చూస్తే కలుగుతుంది. డబ్బు, ఫ్యామిలీకి దూరంగా, మను సినిమాకు దగ్గరగా ఉంటూ వచ్చిన యూనిట్ సభ్యులకు థాంక్స్. ఫణీంద్ర అన్ని క్రాఫ్ట్స్‌లను చక్కగా హ్యాండిల్ చేస్తాడు. ప్యాషన్ అనేది చాలా బలమైన పదం. అలాంటి పదానికి డెఫినిషన్ ఫణీంద్ర నారశెట్టి. ప్రతి సీన్‌ను బెస్ట్‌గా చేయడానికి మేం పడ్డ కష్టమేంటో మాకు తెలుసు. నటీనటులు, సాంకేతిక నిపుణుల కమిట్‌మెంట్స్‌కు, నిర్వాణ సినిమాస్‌కు ధన్యవాదాలు`` అన్నారు.
ఫణీంద్ర నారశెట్టి మాట్లాడుతూ - ``క్రౌడ్ ఫండింగ్ అనేది డిగ్నిఫైడ్ అప్రోచ్ అని ఈ సినిమాతో నిరూపించాలనుకుంటున్నాం. నువ్వు సరిగ్గా తీస్తే ఓ ఫ్లాట్‌ఫాం ఉందని చెప్పే ప్రయత్నమిది. రాజా గౌతమ్‌తోనే ఈ సినిమా ఎందుకు చేశావని చాలా మంది అడిగారు. తెలుగు సినిమాలో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న వ్యక్తి బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ అని నేను ఎప్పుడూ ఫీల్ కాలేదు. గౌతమ్ వ్యక్తిత్వం చాలా గొప్పది. సినిమాకు సంబంధించిన పనులను తను స్వంతంగా చేసుకుంటూ ఉండేవాడు. ఈ వ్యక్తిత్వాన్ని తను అలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. 2012లో నేను చాందినినీ కలిశాను. మధురం చేశాం. తర్వాత 2016లో మళ్ళీ కలిశాను. తను ప్యాషన్ కోసం ఎంత తపనతో ఉంటుందో నాకు తెలుసు. ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. మా సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ .. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. నెలకు లక్షన్నర రూపాయలు సంపాదించుకునే వ్యక్తి. ఈ సినిమా చేస్తే నేను డబ్బులు ఇవ్వలేనని తనకు చెప్పినా.. తను సినిమా చేస్తానని ముందుక వచ్చాడు. ఆరేడు నెలలు తర్వాత డబ్బు కష్టం ఉన్నా.. నాకు చెప్పకుండా ప్యాషన్‌తో సినిమా కోసం ట్రావెల్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ నరేశ్ .. మధురం తర్వాత మను చేయాలనుకోగానే.. చేసేద్దాం అనుకున్నాడు. కానీ మను కాపీ ఇచ్చిన తర్వాత ఇలాంటి సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా కష్టమబ్బా.. నాకు టైమ్ కావాలి అన్నాడు. ముందు నలబై నిమిషాల సినిమాకు మ్యూజిక్ చేసి నచ్చకుండా దాన్ని అంతా తీసేసి మళ్లీ మ్యూజిక్ చేశారు. అలాగే శివ్‌కుమార్.. నాకంటే పైస్థాయి థింకింగ్ ఉన్న వ్యక్తి. ఈ సినిమాకు పనిచేయం లక్కీగా భావిస్తాను. ఈ సినిమాకు క్రౌడ్ ఫండింగ్ ఆలోచనను ఇచ్చిన శబరీష్, జాన్ కొటోలి సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. మా టీజర్, ట్రైలర్ చూసి వీళ్లకొక మూడు గంటలు సమయం ఇస్తే చాలు అనుకుని మా సినిమాకు వస్తే చాలు`` అన్నారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ - ``టీజర్, ట్రైలర్ నాకు బాగా నచ్చింది. నేను, గౌతమ్ ఒకే కాలనీలో పెరిగాం. గౌతమ్ అన్నహీరో కావడానికి చాలా కష్టపడ్డాడు. హీరోగా తనకు ముందు కష్టాలు వచ్చినా ఎక్కడా వదులుకోలేదు. అందుకే మనులాంటి సినిమాతో మన ముందుకు వచ్చారు. తెలుగులో నాలుగు ఫైట్స్, సాంగ్స్‌తో సినిమాలు వస్తుంటాయి. ఇలాంటి సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇండస్ట్రీకి 115 మంది కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారు. సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి`` అన్నారు.