
28 August 2018
Hyderabad
`పేపర్‌బాయ్` ప్రీ రిలీజ్ ఫంక్షన్
సంపత్ నంది టీమ్‌వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్, రియా సుమన్ , తన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 31న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో ..
డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ - ``మెహర్ రమేశ్ నాకు ఫోన్ చేసి `పేపర్‌బాయ్ సినిమాను చూశాను. అరవింద్‌గారికి సినిమా చూపించబోతున్నాను` అని చెప్పారు. `అరవింద్‌గారు సినిమా చూశారు.. ఆయనకు నచ్చింది. ఆయన సినిమా హక్కులను తీసుకున్నారు` అని చెప్పగానే సినిమా చాలా పెద్ద హిట్ అని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నాకు అరవింద్‌గారి జడ్జ్‌మెంట్‌పై అపారమైన నమ్మకం ఉంది. సినిమా అరవింద్‌గారి చేతుల్లోకి వెళ్లగానే స్పాన్ పెరిగింది. ఇప్పుడు ఇది పెద్ద సినిమా. మా శోభన్‌గారి అబ్బాయి సంతోశ్ పెర్ఫామర్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మంచి హీరోగా ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ - ``నా ఫ్రెండ్ వేమారెడ్డికి సంపత్ మంచి స్నేహితుడు.. కాబట్టి తను ఈ సినిమా చూశాడు. సినిమా చాలా బావుందని అప్రిషియేట్ చేశాడు. చిన్న సినిమా కదా! అని ఆలోచించాను. ఇలాంటి చిన్న సినిమాకు గీతా ఆర్ట్స్ వంటి పెద్ద ప్లాట్‌ఫామ్ దొరికింది. చిన్న సినిమా నిర్మాతలకు ఉండే కష్టాలేంటో నాకు తెలుసు. సంపత్‌నంది లాంటి డైరెక్టర్ మరో డైరెక్టర్‌కి అవకాశం ఇస్తూ సినిమాలు చేయడం గొప్ప విషయం. శోభన్‌గారి అబ్బాయి సంతోశ్‌కి ఇది మంచి సినిమా కావాలి. కథ తెలుసు. తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను. డైరెక్టర్ జయశంకర్, సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్, ఆర్ట్ వర్క్ రాజీవ్ నాయర్‌గారు.. టీమ్ అందరికీ అభినందనలు`` అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ``ఓసారి బన్ని ఈ సినిమా ట్రైలర్‌ను పంపి చూడమంటే చూసి చాలా బావుందని అన్నాను. తర్వాత మెహర్ రమేశ్ వచ్చి అర్జెంట్‌గా ఈ సినిమా చూడమన్నాడు. సరేనని చూశాను. చాలా బావుంది. సిన్సియర్ సినిమా. మళ్లీ మెహర్ వచ్చి.. మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తే బావుంటుందని నిర్మాతలు అనుకుంటున్నారు. మీరు రిలీజ్ చేస్తారా అన్నాడు. సాధారణంగా వ్యక్తి కన్నా సంస్థ గొప్పది.. సంస్థ కన్నా.. ఆ సంస్థలోని సినిమా గొప్పది. అలా మా సంస్థలో రీసెంట్‌గా వచ్చిన సినిమా గీత గోవిందం. ఆ సినిమా ఎఫెక్ట్ నాలుగైదు వారాలు కచ్చితంగా ఉంటుంది. ఇలాంటి తరుణంలో మా బ్యానర్‌లో పేపర్‌బాయ్‌లాంటి మరో మంచి సినిమాను విడుదల చేస్తే బావుంటుందనే ఆలోచన కలిగింది. ఇండస్ట్రీనే నమ్ముకున్న సంపత్ నందిలాంటి వ్యక్తి ఓ కథ రాసుకుని మరో డైరెక్టర్‌కి అవకాశం ఇచ్చి .. మంచి సినిమా చేసినప్పుడు మా సంస్థ ద్వారా విడుదలైతే సినిమా ఇంకా ప్రజలకు బాగా రీచ్ అవుతుంది కాబట్టి.. మనం సపోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. సినిమా నచ్చింది కాబట్టే ఇదంతా చేస్తున్నాను. సినిమా యూనిట్ అంతా బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చింది. సంతోశ్ శోభన్ కొత్తవాడైనా తూచినట్టు నటించాడు. రియా సుమన్ చక్కగా నటించింది. తన నటన చూస్తే భూమిక గుర్తుకొచ్చింది. ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
మెహర్ రమేశ్ మాట్లాడుతూ - ``ట్రైలర్ నచ్చి.. ఈ సినిమా చూస్తానని నేనే అడిగాను. సంపత్ నంది అండ్ టీం సిన్సియర్ ప్రయత్నమిది. సంపత్ నందిపై.. అతని చేసే ప్రయత్నంపై నమ్మకంతో పాటు.. మా శోభన్ గారి అబ్బాయి సంతోశ్ ఎలా చేశాడు? అని నేను, బన్నివాసు సినిమా చూశాం. అరవింద్‌గారు సినిమా చూసి నచ్చిందన్నారు. ఈ సినిమా ఆయన చేతుల్లోకి వెళ్లగానే సక్సెస్ అయింది. గీతాఆర్ట్స్ ఎంతో మంది స్టార్స్‌ను తయారు చేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో గీత గోవిందంలాంటి సినిమా చేశారు. ఆ సినిమా ఎఫెక్ట్‌లోకి మా పేపర్‌బాయ్ కూడా చేరాలి. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
సంపత్ నంది మాట్లాడుతూ - ``మా సినిమా ట్రైలర్ చూసి దాన్ని ట్వీట్ చేస్తూ అభినందించిన సూపర్ స్టార్ మహేశ్‌గారికి.. ట్రైలర్‌ను వీక్షించి యూనిట్‌ను అభినందించిన యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్‌గారికి ఈ సందర్భంగా థాంక్స్. మూడ రోజుల క్రితం వరకు ఇదొక చిన్న సినిమా. మామూలు సినిమా. ఎప్పుడు వస్తుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియలేదు. గీతాఆర్ట్స్ బ్యానర్ మా సినిమాను టచ్ చేయగానే సినిమా గౌరవం పెరిగింది. అరవింద్‌గారికి ఈ సినిమా నచ్చడం.. ఆయన రిలీజ్ చేస్తున్నారనగానే ఇదొక మంచి సినిమా అనే గుర్తింపు వచ్చింది. ఆయనకు మా సినిమా గురించి తెలియడానికి కారణం మెహర్ రమేశ్ అన్నే. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. మా సినిమా సింపుల్ స్టోరీనే. నిజాయతీగా అటెంప్ట్ చేశాం. జయశంకర్‌గారు .. రెండేళ్లుగా నాతో ట్రావెట్ చేశాడు. శోభన్‌గారి అబ్బాయి సంతోశ్ శోభన్ చక్కగా నటించారు. భవిష్యత్‌లో మంచి డైరెక్టర్‌గా ఎదుగుతారు. తమ్మిరాజు, సౌందర్ రాజన్, రాజీవ్ నాయర్, రియా సుమన్ అందరికీ థాంక్స్. అలాగే నిర్మాతలు రాములు, వెంకట్, నరసింహ అందించిన సహకారానికి వారికి కృతజ్ఞతలు. మా సినిమా ఆగస్ట్ 31న విడుదలవుతుంది`` అన్నారు.
సంతోశ్ శోభన్ మాట్లాడుతూ - `` అరవింద్‌గారు మా సినిమాను విడుదల చేయడంతో కల నేరవేరినట్టైంది. మా యూనిట్‌లో చాలా మంది కొత్తవాళ్లు ఉన్నా కూడా మా అందరికీ అండగా నిలబడ్డ వ్యక్తి సంపత్ నందిగారు. ఆయన ఇచ్చిన అవకాశానికి ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా రుణం తీరిపోదు. నాకు రేపు నటన పరంగా ఏదైనా క్రెడిట్ దక్కితే అది మా డైరెక్టర్ జయశంకర్‌కే దక్కుతుంది. అలాగే సౌందర్ రాజన్.. భీమ్స్ సిసిరోలియోగారు సహా అందరికీ థాంక్స్`` అన్నారు.
డైరెక్టర్ జయశంకర్ మాట్లాడుతూ - ``ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళిగారి వల్ల డైరెక్టర్‌గా నాకు అవకాశం దక్కింది. సంపత్‌గారు ఈ సినిమాకు కథను అందించడమే కాకుండా.. సినిమాను ప్రొడ్యూస్ కూడా చేశారు. ఏడాదిగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నాం. ఈ కష్టం.. గీతాఆర్ట్స్‌వారు మా సినిమాను తీసుకోవడం వల్ల మరచిపోయాం. సినిమాకు పెద్ద రీచ్ దొరికింది. ఈ సినిమాకు సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, తమ్మిరాజుగారి ఎడిటింగ్, రాజీవ్‌గారి ఆర్ట్ వర్క్‌తో అందరూ సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్. సంతోశ్‌కి సినిమాలంటే ఎంతో ప్యాషన్. రియాసుమన్ చక్కటి ఎమోషన్స్‌తో క్యారెక్టర్‌ను క్యారీ చేసింది. సహకరించిన అందరికీ థాంక్స్`` అన్నారు.


