5 September 2018
Hyderabad
అల్లరి నరేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ, నందినిరాయ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'సిల్లీఫెలోస్'. భీమనేని శ్రీనివాస్ దర్శకుడు. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మాతలు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదలవుతుంది.ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
అల్లరి నరేశ్ మాట్లాడుతూ - ``ఇది నా 54వ సినిమా. ఈ ప్రయాణంలో ఎంతో మంది దర్శకులు, నిర్మాతలతో కలిసి పనిచేశాను. అందరూ నాకు గురువులే. అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. భీమనేనిగారు, నేను అన్నదమ్ముల్లా డిస్కస్ చేసుకుని సినిమా చేస్తాం. ప్రతి సినిమా గురించి ఇద్దరం మాట్లాడుకుంటాం. నాకు ఎప్పుడూ తన సపోర్ట్ అందిస్తారు. 16 ఇయర్స్ జర్నీలో నాకు సుడిగాడు అనే బ్లాక్ బస్టర్ ఇచ్చిన భీమనేనిగారితో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. నాతో పాటు, సునీల్‌గారు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అంచనాలు పెరిగాయి. అందరం ఇష్టపడి, కష్టపడి సినిమా చేశాం. సునీల్‌గారు నా అమూల్ బేబి. ఇద్దరం కలిసి సినిమా ప్రారంభం కంటే ముందే 10-15 రోజుల జర్నీ చేశాం. ఎలా చేయాలో డిస్కస్ చేసుకుని, ఈగోస్ లేకుండా నటించాం. ఏదీ చేసినా సినిమా కోసమే చేశాం. ఏదైతే పాత నరేశ్, సునీల్‌గారి దగ్గర మిస్ అయ్యామని భావిస్తున్నారో వాళ్లందరికీ మేం బ్యాక్ అయ్యామని చెబుతున్నాను. 100 గ్యారెంటీగా నవ్విస్తున్నాం. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి, విశ్వప్రసాద్‌గారు, వివేక్‌గారు అందరూ ఓ ప్లానింగ్ ప్రకారం సినిమాను పూర్తి చేసుకున్నారు. చిత్రా శుక్లా, నందినీ రాయ్ సినిమా కోసం చక్కగా కష్టపడ్డారు. మ్యూజిక్ డైరెక్టర్ వసంత్‌గారికి, సపోర్టింగ్ టీమ్‌కు అభినందనలు.. సుడిగాడు రేంజ్ హిట్ అందిస్తారని నమ్ముతున్నాం`` అన్నారు.
సునీల్ మాట్లాడుతూ - ``నవ్వుతూ కలిసి టీం అంతా కష్టపడి చేసిన సినిమా. నరేష్‌గారు, నేను అన్నదమ్ముల్లా కలిసిపోయాం. తొట్టిగ్యాంగ్ సినిమాకు ఎంత ఎంజాయ్ చేశానో.. ఈ సినిమాకు కూడా అంతే ఎంజాయ్ చేశాను. ఫుల్‌లెంగ్త్ కామెడీ పాత్రలో నటించాను. తప్పకుండా నేను, నరేష్‌గారు ప్రేక్షకులను నవ్విస్తాం. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ - ``ఈ సినిమా వెనుక చాలా కష్టం ఉంది. ఏడాది పాటు స్క్రిప్ట్ కోసం పనిచేశాం. చాలా సమస్యలను అధిగమించి చేశాం. ఈ నెల 7న మా కష్టం తెరపై చూస్తారు. హార్ట్‌ఫుల్‌గా చేసిన సినిమాను ప్రామిస్‌తో, కాన్ఫిడెన్స్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. నరేష్‌గారితో సుడిగాడు చేశాను. అయన నా కుటుంబ సభ్యుడితో సమానం. ఈ ఆరేడేళ్లుగా ఇద్దరం ట్రావెల్ అవుతూనే ఉన్నాం. ఓ మంచి సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ కథ ఐడియాకి వచ్చింది. డెఫనెట్‌గా సుడిగాడు తర్వాత నేను ఒక సినిమా చేస్తే.. నరేష్‌గారు పన్నెండు సినిమాలు చేశారు. మళ్లీ కలిసి కసిగా ఇద్దరం చేసిన సినిమా. మన ఎఫర్ట్ కరెక్ట్‌గా ఉంటే చిన్న సినిమానే పెద్ద సినిమా అవుతుందని నమ్మకంతో చేసిన సినిమా ఇది. ఇందులో స్పూఫ్‌లు, పేరడీలు ఉండవు. స్క్రీన్‌ప్లే, క్యారెక్టర్ బేస్డ్ మూవీ. రెండు గంటల ఐదు నిమిషాల సినిమా మాత్రమే. ప్రమోషనల్ సాంగ్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 7న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాలో సునీల్ కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఆడియెన్స్ ఆయన్నుండి ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఈ సినిమాతో అందిస్తారు. నరేష్, సునీల్‌గారికి సక్సెస్ వచ్చి ఇండస్ట్రీ బావుండాలి. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి, విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఎంతగానో సపోర్ట్ చేశారు. వివేక్‌గారితో ఎప్పటి నుండి మంచి అనుంబంధం ఉంది. సుడిగాడు, స్పీడున్నోడు తర్వాత నేను, వివేక్ కలిసి చేస్తున్న చిత్రమిది. వసంత్ చాలా మంచి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. అవుట్ పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా అనేది మనల్ని గుర్తుకు తెచ్చుకునేలా ఉండాలి. అందుకనే పర్‌ఫెక్షన్ కోసం తపిస్తుంటాను. అలాగే ఈ సినిమాను పర్‌ఫెక్షన్‌తో తీశాను. అందరూ అర్థం చేసుకుని నటీనటులు, టెక్నీషియన్స్ సపోర్ట్ చేస్తున్నారు`` అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్.డి.సి ఛైర్మన్ అంబికాకృష్ణ మాట్లాడుతూ - ``సిల్లీఫెలోస్ అనే మంచి టైటిల్ పెట్టి కామెడీ మూవీ చేశారు. నరేశ్, సునీల్ ఇద్దరికీ పశ్చిమగోదావరి జిల్లాయే. భీమనేని శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. నిర్మాతలు నేనే రాజు నేనే మంత్రి, ఎమ్మెల్యే తర్వాత చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. దీంతో కూడా కచ్చితంగా హిట్ సాధిస్తారని అనుకుంటున్నాను. పెద్ద హీరోలందరూ కనీసం ఒక షెడ్యూల్ అయినా ఆంధ్ర ప్రదేశ్‌లో చేయాలని కోరుకుంటున్నాను. దర్శక నిర్మాతలను, హీరోలను రిక్వెస్ట్ చేస్తున్నాను. గత ఏడాది 178 సినిమాలు రిలీజైతే అందులో పెద్ద హీరోల సినిమాలు 30 దాకా రిలీజైయ్యాయి. వంద సినిమాలు చిన్న సినిమాలే. నాలుగు కోట్ల బడ్జెట్‌లో ఆంధ్ర ప్రదేశ్‌లోనే సినిమా చేస్తే వారికి ట్యాక్స్ వెనక్కి ఇచ్చేస్తాం. పది నుండి పదిహేను మంచి సినిమాలను ఎంపిక చేసుకుని 15 లక్షల వరకు బహుమతులు ఇస్తున్నాం. సింగిల్ విండో విధానాన్ని తీసుకు వచ్చాం. ఇక సినిమా విషయానికి వస్తే.. కామెడీ సినిమాలు ఈ మధ్య బాగా తగ్గిపోయాయి. ఇలాంటి తరుణంలో పూర్తిస్థాయి కామెడీతో వస్తున్న సిల్లీ ఫెలోస్ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
కె.నాగేశ్వర్ రెడ్డి రెడ్డి మాట్లాడుతూ - ``నరేష్‌గారు, సునీల్‌గారి కాంబినేషన్ ఇష్టమైన కాంబినేషన్. థియేటర్‌లో తప్పకుండా అందరినీ నవ్విస్తుందనుకుంటున్నాను. ఆరేళ్ల క్రితం భీమనేనిగారు నరేశ్‌తో సుడిగాడు అనే బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. తర్వాత నరేశ్‌కి హిట్స్ వస్తున్నాయి. కానీ బ్లాక్‌బస్టర్స్ రావడం లేదు. మళ్లీ ఈ సినిమాతో వీళ్ల కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను`` అన్నారు.
నందినీ రాయ్ మాట్లాడుతూ - ``మా డైరెక్టర్‌గారు పవన్‌కల్యాణ్‌తో చేసిన సుస్వాగతం సినిమా అంటే చాలా ఇష్టం. ఈ సినిమాను కూడా ఫుల్ కామెడీతో తెరకెక్కించారు. మా సిల్లీ ఫెలోస్ సునీల్, నరేశ్‌గారిపై చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వాటిని ఈ సినిమా రీచ్ అవుతుందనే నమ్మకం ఉంది. మా నిర్మాతలు విశ్వప్రసాద్, భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిగారికి, సినిమాటోగ్రాఫర్ అనీశ్‌గారికి, వసంత్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ నెల 7న ఫన్నీ రైడ్‌ను ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాం`` అన్నారు.
డా.బ్రహ్మానందం మాట్లాడుతూ - ``ఇందులో నాలుగైదు రోజుల క్యారెక్టర్ మాత్రమే చేశాను. ముందు భీమనేని శ్రీనివాస్‌తో 26 ఏళ్ల నుండి పరిచయం ఉంది. ఆయనలో ఏ మార్పు రాలేదు. భీమనేని పర్‌ఫెక్షనిస్ట్.తను హార్డ్ వర్కర్ కాబట్టే.. తను సినిమాలన్నీ సూపర్‌హిట్స్ అవుతున్నాయి. నరేశ్, సునీల్‌ల్లో ఒకరుంటేనే కామెడీ పరంగా తట్టుకోవడం కష్టం. అలాంటిది ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే కామెడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హాయిగా నవ్వుకునే సినిమాలను ఆదరించాలి. ప్రేక్షకులను నవ్వించడానికి వస్తున్న సిల్లీ ఫెలోస్ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను`` అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులందరూ యూనిట్ సభ్యులను అభినందించారు.