pizza
Aatagallu press meet
`ఆట‌గాళ్ళు` ట్రైల‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


30 June 2018
Hyderabad

ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నారా రోహిత్‌, జగపతిబాబు నటిస్తోన్న సినిమా ‘ఆటగాళ్ళు’. 'ఆంద్రుడు' చిత్ర దర్శకుడు పరుచూరి మురళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వాసిరెడ్డి రవీంద్రనాథ్‌, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్‌, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ ద‌ర్శ‌కుడు శేఖర్‌ కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా....

నటుడు శ్రీతేజ్‌ మాట్లాడుతూ - ''పరుచూరి మురళిగారికి 'ఆంధ్రుడు' సినిమా తర్వాత అంతే రేంజ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది'' అన్నారు.

ఫణి మాట్లాడుతూ - ''డైరెక్టర్‌గారు నాకు మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. మంచి డైలాగ్స్‌ ఉన్నాయి. ఆంధ్రుడు స్టయిల్లో మాస్‌ యాక్షన్‌ మూవీ ఇది. మంచి కామెడీ కూడా ఉంది'' అన్నారు.

రైటర్‌ గోపీ మాట్లాడుతూ - ''నేను జగపతిబాబుగారికి ఎక్కువ సినిమాలకు పనిచేశాను. ఫస్టాఫ్‌ అంతా ఎంటర్‌టైనింగ్‌గా, సెకండాఫ్‌ అంతా మైండ్‌గేమ్‌తో సాగే చిత్రమిది. జగపతిబాబుగారు, నారా రోహిత్‌గారు ఇద్దరూ తెరపై కనపడే ఆటగాళ్లు అయితే పరుచూరి మురళిగారు తెర వెనుక ఆటగాడిగా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు'' అన్నారు.

నిర్మాత వాసిరెడ్డి రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ - ''సినిమా అంతా మైండ్‌గేమ్‌తో ఆసక్తికరంగా ఉంటుంది. నటన, డైలాగ్స్‌ పరంగా జగపతిబాబుగారు, నారా రోహిత్‌గారు ఆట ఆడుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. జగపతిబాబుగారు 130-140 సినిమాలకు పనిచేశారు. అయితే తొలిసారిగా లాయర్‌ పాత్రలో నటించారు'' అన్నారు.

జగపతిబాబు మాట్లాడుతూ - ''ఇదొక థ్రిల్లర్‌, మర్డర్‌ మిస్టరీ. పరుచూరి మురళి ట్రైలర్‌ను అద్భుతంగా కట్‌ చేశాడు. ప్రేక్షకులను థ్రిల్‌ చేసే చిత్రమిది. డైరెక్టర్‌ పరుచూరి మురళి తమ స్నేహితుడు కావడంతో నిర్మాతలు కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను నిర్మించారు'' అన్నారు.

నారా రోహిత్‌ మాట్లాడుతూ - ''మర్డర్‌ మిస్టరీ మూవీ. ఇలాంటి జోనర్‌ మూవీ చేయడం నాకు కూడా కొత్తగా ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చింది. సాయికార్తిక్‌ మ్యూజిక్‌, విజయ్‌ సి.కుమార్‌ చక్కటి విజువల్స్‌ ఇచ్చారు'' అన్నారు.

డైరెక్టర్‌ పరుచూరి మురళి మాట్లాడుతూ - ''ఈ సినిమాను ప్రేక్షకులకు రీచ్‌ చేయిస్తే చాలు. ఎందుకంటే థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుడికి తప్పకుండా సినిమా నచ్చుతుంది. జగపతిబాబుగారితో ఇది వరకు పనిచేశాను. కానీ నారారోహిత్‌గారితో ఫస్ట్‌ టైమ్‌ వర్క్‌ చేశాను. అవుట్‌ పుట్‌ కోసం ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. నా స్నేహితులే నిర్మాతలు కావడంతో నన్ను భరించి సినిమాను పూర్తి చేశారు. చాలా డిసెప్లెయిన్‌గా సినిమాను నిర్మించారు'' అన్నారు.

నటీనటులు:
నారా రోహిత్, జగపతి బాబు, బ్రహ్మానందం, దర్శనా బానిక్... తదితరులు.

సాంకేతిక వర్గం:
డైరెక్టర్: పరుచూరి మురళి
నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కేనా రాము, వడ్లపూడి జితేంద్ర.
బ్యానర్: ఫ్రెండ్స్ మూవీస్ క్రియేషన్స్
సంగీతం: సాయి కార్తీక్
కెమెరా మెన్: విజయ్ సి కుమార్


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved