pizza
Devadas press meet
`దేవ‌దాస్‌` ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


25 September 2018
Hyderabad


‘DevaDas’ featuring Nagarjuna Akkineni, Nani, Rashmika Mandanna and Aakanksha Singh in the lead roles, is gearing up for release on September 27th. The team of ‘DevaDas’ interacted with the media on Tuesday.

Speaking first producer Ashwini Dutt said, “After very long time, I came before the media. Thanks to my favourite heroes Nagarjuna and Nani for all the support. Vyjayanthi Movies is proudly presenting ‘DevaDas’ and it would provide ample of entertainment for two and half hours. Hope audience would like it.”

Hero Nagarjuna said, “Ashwini Dutt garu is just the same. He is very passionate about films and now he has support in the form of his daughters. Deva is an international mafia don. Instead of violence and mafia activities, more of don’s personal life and friendship with Das is shown in the movie. How Deva and Das get influenced by each other and it is made in an entertaining way. There is a small message also in the movie but it won’t be in a preachy way. The chemistry between me and Nani, is all director Sriram Adittya’s magic. He handled the film quite and it is not easy to manage such a big cast and pressure. Cinematographer Shamdat is the biggest contributor for ‘DevaDas’ and I would like to work with him again and again.”

Hero Nani said, “Das is an innocent and honest doctor. There are no ups and downs in his life and it’s a smooth journey. Unexpectedly a don becomes his friend and how he reacts and how situations change from here form ‘DevaDas.’ Yes, I use phone a lot but whenever Nagarjuna sir is beside me, I rarely use it. But Rana, Rakul and many others have said, “I Agree” which is why the video went viral. Though there is little truth in it. It was wonderful experience working with Nagarjuna sir. I mean I never expected this to happen. For me who watched his films standing in queue at theatres and now sharing the screen with him is a huge thing.”

Actress Rashmika said, “My character is simple like a girl next door in ‘DevaDas.’ There is a surprise element to my role as well. That will be thrilling on the screen.”

Director Sriram Adittya said, “I never differentiate solo movies and multi-starrer. I enjoy doing both and it is obviously a joy to watch two superstars together. Me, Bhupathi Raja and Satyanand have worked on the script for four to five months. After owning the script, we went for the shoot.”

Actress Aakanksha Singh said, “Nagarjuna sir helped me a lot during the scenes. I was juggling with the lines and then he gave a tip. Working with Nag sir is like a dream come true and I can’t express in words.”
‘DevaDas’ is hitting the screens on September 27th and FlyHigh Cinemas is releasing the movie in overseas.

Cast:
Nagarjuna Akkineni Nani, Rashmika Mandanna, Aakansha Singh, Naresh VK, Sarathkumar, Kunal Kapoor, Rao Ramesh, Vennela Kishore, Avasarala Srinivas, Satya and others.

Crew:
Director: Sriram Aditya
Producer: Ashwini Dutt
Banner: Vyjayanthi Movies
DoP: Shamdat Sainudeen
Music: Manisharma
Art Director: Sahi Suresh

`దేవ‌దాస్‌` ప్రెస్‌మీట్‌

నాగార్జున‌, నాని, ఆకాంక్ష సింగ్‌, ర‌ష్మిక కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా `దేవ‌దాస్`. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. వైజ‌యంతీ మూవీస్, వ‌యాకామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అశ్వ‌నీద‌త్ నిర్మాత‌. ఈ సినిమా ఈ నెల 27న విడుద‌ల కానుంది.

నిర్మాత అశ్వ‌నీద‌త్ మాట్లాడుతూ ``మ‌హాన‌టికి నేను ప్రెస్ ముందుకు రాలేదు. ఈ సినిమాకు పెద్ద హీరోలు నాకు తోడుగా, అండ‌గా ఉన్నారు. వాళ్లు భుజాల మీద వేసుకుని న‌డిపిస్తున్నారు. చాలా ఏళ్ల త‌ర్వాత వైజ‌యంతీ మూవీస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తోన్న సినిమా ఇది. రెండున్న‌ర గంట‌ల సేపు గొప్ప వినోదం ఉంటుంది. ఇద్ద‌రు గొప్ప హీరోల న‌ట‌నా కౌశ‌లం ఉంటుంది. గ్లామ‌ర్ ఉంటుంది. చ‌క్క‌టి మెసేజ్ ఉంటుంది. ఈ నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. వైజ‌యంతీ మూవీస్ మ‌రింత ఉత్సాహంగా ముందుకు వెళ్ల‌డానికి, దాన్ని న‌డిపించ‌డానికి మా పిల్ల‌ల‌కు త‌గిన ప్రోత్సాహం ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను. నేను మొన్నామ‌ధ్య ఈ సినిమా గురించి చెబుతూ గుండ‌మ్మ‌క‌థ‌ను రెఫ‌ర్ చేశాను. ఎందుకు చేశానంటే నాగార్జున‌గారిని 30 ఏళ్ల‌కు పైగా చూస్తున్నాం. నానిగారు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లోనే హై రేంజ్‌కి తీసుకెళ్లారు. ట్రెండ్‌ని మార్చేశాడు. వీళ్లిద్ద‌రూ నాకు న‌చ్చారు. నేనూ నా జీవితంలో ఐదారు మ‌ల్టీస్టార‌ర్‌లు తీశాను. అయితే ఎప్ప‌టికీ గుండ‌మ్మ‌క‌థ‌లో రామారావుగారు, నాగేశ్వ‌ర‌రావుగారు క‌లిసి చేసిన విధానం, వాళ్లు పండించిన కెమిస్ట్రీని నేను ఈ ఇద్ద‌రి హీరోల మ‌ధ్య‌నే చూశాను. అందుకే నాకు గుండ‌మ్మ‌క‌థ‌లాగా పెద్ద హిట్ సినిమా అవుతుంది అని అనిపించింది`` అని అన్నారు.


నాగార్జున మాట్లాడుతూ ``నా ఆఖ‌రిపోరాటం స‌మ‌యంలో ఎలా ఉన్నారో ఇప్ప‌టికీ అశ్వ‌నీద‌త్‌గారు అలాగే ఉన్నారు. ఆయ‌న‌కు ఇప్పుడు ఇద్ద‌రు కూతుళ్లు, ఒక అల్లుడు ఆయ‌న‌కు తోడుగా ఉన్నారు. ఆఖ‌రిపోరాటం స‌మ‌యానికి ఇప్ప‌టికి నాలో వ‌చ్చిన తేడా పంక్చువాలిటీ. ఈ సినిమాలో నేను చేసిన దేవా పాత్ర డాన్ పాత్ర‌. అలాగ‌ని మాఫియా డాన్ చూపించ‌లేదు. అత‌ని ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని చూపించాం. చాలా కొత్త‌గా ఉంటుంది. అత‌ని ప‌ర్స‌న‌ల్ ఫ్రెండ్‌షిప్ దాస్‌తో ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిక‌రం. దేవ‌, దాస్ మ‌ధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ కార‌ణంగా ఈ సినిమాకు దేవ‌దాస్ అని పేరు పెట్టాం. వాళ్లు ఒక‌రిని మ‌రొక‌రు ఎలా ఇన్‌ఫ్లుయ‌న్స్ చేసుకున్నార‌నేది ఆస‌క్తిక‌రం. ఇది సీరియ‌స్‌గా తీసిన పాయింట్ కాదు. చ‌క్క‌గా న‌వ్వుతూ స‌ర‌దాగా ఉంటుంది. రాజు హిరాణీ సినిమాల‌ను చూసిన‌ట్టు ఉంటుంది. మున్నాబాయ్ ఎంబీబీయ‌స్ త‌ర‌హా సినిమా. ఈ సినిమాలో నా పాత్ర పేరు ముందు నుంచీ దేవ‌. నాని పేరు ముందు కృష్ణ‌. త‌ర్వాత కృష్ణ‌దాస్ అని అన్నారు. దాంతో దేవ‌దాస్ అని చెప్పారు. ఇటీవ‌లే ద‌త్తుగారు మ‌హాన‌టితో పెద్ద హిట్ కొట్టారు. ఆయ‌న‌కు దేవ‌దాస్ అనే పేరు కూడా బావుంటుంద‌నిపించింది. అందుకే అంద‌రూ ఓకే అన్నాక శ్రీరామ్ ఆదిత్య ఇదే పేరును ఖ‌రారు చేశాడు.న‌న్ను, నానిని, ఆకాంక్ష‌ను, ర‌ష్మిక‌ను, ముర‌ళీశ‌ర్మ‌ను.. ఇలా చాలా మంది సెల‌బ్రిటీల‌ను హ్యాండిల్ చేయ‌డం ప్రెజ‌రే. అయినా బాగా చేశాడు శ్రీరామ్‌. త‌ను మూడు రోజుల ముందే సినిమాను చూపించాడు. అలా కాకుండా నెల రోజుల ముందే క‌నుక శ్రీరామ్ సినిమా ఇచ్చి ఉంటే ఒక‌టికి నాలుగుసార్లు సినిమా చూసి ఏమైనా మార్పులు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఈ సినిమాలో నాకు ఏమో ఏమో పాట‌, వారూ వీరూ పాట బాగా న‌చ్చాయి. ఏమో ఏమో పాట‌ను నానికి ఇవ్వ‌డం జెల‌సీగా ఉంది. చేసే సినిమాల‌ను బ‌ట్టి గెట‌ప్ మారుస్తుంటా. మ‌ధ్య‌లో కొన్ని డీ గ్లామ‌రైజ్డ్ పాత్ర‌లు చేశా. ఈ సినిమాలో నేను అందంగా క‌నిపిస్తున్నానంటే కార‌ణం కెమెరామేన్ శ్యామ్‌. ఆదిత్య‌కు శ్యామ్ చాలా పెద్ద ఎసెట్‌. మా బ‌ట్ట‌ల స్కీమ్ కూడా వాళ్లిద్ద‌రూ క‌లిసి కూర్చుని డిజైన్ చేశారు. ఆయ‌న‌తో మ‌ర‌లా ప‌ని చేయాల‌ని ఉంది. నేను చేసిన మ‌ల్టీస్టార‌ర్ల‌న్నీ అలాగే కుదిరాయి. చాలా హ్యాపీ. `` అని అన్నారు.

నాని మాట్లాడుతూ ``మామూలుగా ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సాగిపోయే జీవితం దాస్‌ది. అలాంటి స‌మ‌యంలో త‌న‌కంటూ ఎవ‌రూ జీవితంలోని లేని ఒక వ్య‌క్తిగా దేవ అత‌ని జీవితంలోకి ఎంట‌ర్ అయితే ఏం జ‌రుగుతుంది? దానివల్ల అత‌నికి జ‌రిగిందేమిటి అనేది దాస్ పాత్ర‌. షూటింగ్ స‌మ‌యంలో నేను ఫోన్ ఎక్కువ‌గా వాడి ఉండ‌వ‌చ్చు. కానీ నాగ్‌సార్ ముందు నేనెప్పుడూ అంత‌గా ఫోన్ వాడ‌లేదు. నేను ఫోన్ ఎక్కువ‌గా వాడుతాన‌న్న‌ది నా మీద నింద‌లా త‌యారైంది. మేకింగ్ వీడియోలు అన్నీ చూస్తే రెండు మూడు ఫోన్ల మీద ఉన్న క్లిప్పులు దొర‌క‌డం పెద్ద ఇదేం కాదు..వాటిని ప‌ట్టుకుని చిన్న వీడియో చేశారు. దానికి ట్విట్ట‌ర్‌లో చాలా మంది ఐ అగ్రీ ఐ అగ్రీ అనేస‌రికి అది వైర‌ల్ అయింది. నిజంగా వెతికితే నాగార్జున‌గారికి కూడా ఫోన్ మాట్లాడే క్లిప్స్ దొరుకుతాయి. అయినా నేను నాగార్జున‌గారికి ఫ్యాన్‌ని. ఆయ‌న సినిమా టిక్కెట్ల కోసం లైన్ల‌లో కొట్టుకుని చూశాను. ఆయ‌న‌తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవ‌డం చాలా హ్యాపీ. ఆయ‌న‌కు ఏం న‌చ్చినా, ఏం న‌చ్చ‌క‌పోయినా వెంట‌నే చెప్పేస్తారు. సినిమా మొత్తం చూసి ఆయ‌న చెప్పిన మాట‌లు నేను మ‌ర్చిపోలేను. నా జీవితంలో హెక్టిక్ వీకెండ్ ఇది. లాస్ట్ టైమ్ ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం వ‌చ్చిన‌ప్పుడు కూడా మ‌రో సినిమా షూటింగ్ వ‌చ్చింది. అప్పుడూ ఇంతే హెక్టిక్‌గా అనిపించింది. ఇప్పుడు ఈ వీకెండ్‌లో బిగ్‌బాస్ హెక్టిక్ షెడ్యూల్ కూడా ఉంది. అందుకే ఈ ఆదివారం పూర్త‌యితే ఏ కాశీకో వెళ్దామ‌ని అనుకుంటున్నా. నేను న‌టుడిని. నాకు న‌ట‌నే బావుంటుంది. అయితే ఏ ప‌నినైనా అంగీక‌రిస్తే త‌ప్ప‌కుండా మ‌న‌స్ఫూర్తిగా చేస్తాను. కాలం ఎలా తీసుకెళ్తే అలా ఆ ప‌నిచేస్తాను. `` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``నాకెప్పుడూ సింగిల్ స్టార్ సినిమా అనీ, మ‌ల్టీస్టార‌ర్ సినిమా అనీ తేడా ఏమీ లేదు. ఈ సినిమా స్క్రిప్ట్ ను చాలా మంది ర‌చ‌యిత‌ల‌తో కూర్చుని ముందే లాక్ చేసుకున్నా. అందుకే చాలా హ్యాపీగా చేయ‌గ‌లిగాను. ఈ సినిమా ఏ సినిమాకీ రీమేక్ కాదు. ఫ్రెండ్‌షిప్ కోర్ పాయింట్‌గా ఉంటుంది. అయినా ఈ సినిమాలో స‌బ్ టెక్స్ట్ ఉంటుంది. అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. నాగార్జున‌గారు సెట్‌మీద‌కు వ‌చ్చాక భ‌య‌పెట్ట‌లేదు. ఆయ‌నెప్పుడూ లొకేష‌న్‌కి దూరంగా లేరు. సెట్లో చాలా స‌ర‌దాగా ఉండేవారు. ఎప్పుడూ స్టార్‌ని డీల్ చేస్తున్నామ‌నే భ‌యం మాత్రం రాలేదు`` అని అన్నారు.

ర‌ష్మిక మాట్లాడుతూ ``గ‌ర్ల్ నెక్స్ట్ డోర్ కేర‌క్ట‌ర్ చేశా. కాక‌పోతే చాలా స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా చూశాక మీకే అర్థ‌మ‌వుతుంది`` అని అన్నారు.

ఆకాంక్ష మాట్లాడుతూ ``నాకు నాగార్జున‌గారు చాలా హెల్ప్ చేశారు. కొన్నిసార్లు డైలాగులు చెప్పేట‌ప్పుడు త‌డ‌బ‌డుతుంటే, గ‌ట్టిగా చెప్ప‌కు.. స‌న్న‌గా చెప్పేయ్ అని ఆయ‌న అన్నారు. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం క‌ల సాకార‌మైన‌ట్టుంది. నేనిప్ప‌టి వ‌ర‌కు న‌టించిన ఇద్ద‌రు హీరోలు చాలా మంచివారు. ఇద్ద‌రూ హంబుల్ ప‌ర్స‌న్స్`` అని చెప్పారు.

Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved